Locations: Hyderabad

  • వినాయకుడి నిమజ్జనం.. పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే

    HYD: వినాయక నిమజ్జనం సమయంలో భక్తులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గణపతి విగ్రహాలను నేరుగా నదులు, చెరువుల్లో నిమజ్జనం చేయరాదు. విగ్రహం పగలకుండా జాగ్రత్త వహించాలి. నిమజ్జనానికి ముందు విగ్రహానికి పూజ చేసి, మోదకాలు, లడ్డూలు, పువ్వులు సమర్పించి, ప్రసాదాన్ని భక్తులకు పంచాలి. విగ్రహాన్ని నేరుగా నీటిలో పడవేయకుండా, మూడుసార్లు ముంచి నెమ్మదిగా విడిచిపెట్టాలి. ముఖ్యంగా మత్తు పదార్థాలు సేవించి నిమజ్జనం చేయరాదు.

  • హైదరాబాద్​లో అంగరంగ వైభవంగా గణేశ్​ నిమజ్జనం!

    భారీ భద్రత మధ్య హైదరాబాద్​లో గణేశ్​ నిమజ్జనం జరుగుతోంది. ట్యాంక్​ బండ్​ పరిసర ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున నుంచే విగ్రహాల నిమజ్జనం ఊపందుకుంది. వాహనాలు, ప్రజల రద్దీ మధ్య ట్యాంక్​ బండ్​ కిక్కిరిసిపోతోంది. మరోవైపు గణేశ్​ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన చేసింది.  రాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లను నడిపనున్నట్టు ప్రకటించింది.

     

     

  • HYDలో డేటింగ్ స్కామ్

    హైదరాబాద్‌లో కొత్త తరహా డేటింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.  డేటింగ్‌ యాప్‌లు వినియోగించే పురుషులే లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయి. యాప్‌లలో నకిలీ ప్రొఫైళ్లు సృష్టిస్తున్న యువతులు.. వలపు వల విసురుతూ దగ్గరవుతున్నారు. పరిచయం పెంచుకుని ఫలానా పబ్బులో కలుద్దామంటూ రప్పించి ఖరీదైన మద్యం, ఆహారం పేరుతో రూ.వేలల్లో బిల్లులు కట్టించి పత్తా లేకుండా పోతున్నారు.  ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

  • కాసేపట్లో ఖైరతాబాద్‌ గణేశ్ శోభాయాత్ర ప్రారంభం

    HYD: మరికాసేపట్లో ఖైరతాబాద్‌లో​‌ కొలువైన మహా గణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. లక్షలాది భక్తుల మధ్య గణనాథుడు నిమజ్జనానికి తరలివెళ్లనున్నాడు. ఎక్కడ చూసినా గణపతి బప్ప మోరియా అంటూ చిన్నాపెద్దా అంతా వారి భక్తిని చాటుకుంటున్నారు.  ట్యాంక్​ బండ్​ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

  • ఇరానీ చాయ్‌.. తాగరా భాయ్‌

    HYD: నగరానికి.. ఇరానీ చాయ్‌కు చారిత్రక బంధముంది. 19వ శతాబ్దంలో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో పాతబస్తీలో ఇరానీ కెఫేల సంస్కృతి మొదలైంది. చిక్కదనం.. గోధుమ వర్ణం.. తీయదనం.. ప్రత్యేక రుచి కలగలిసిన ఈ తేనీటిని సేవించనిదే చాలా మందికి తెల్లవారదు. ఉస్మానియా బిస్కెట్‌ తింటూ ఇరానీ చాయ్‌ తాగితే..ఆ రుచే అమోఘం. 1993లో 60పైసలు ఉన్న ఇరానీ చాయ్‌..ప్రస్తుతం పాతిక రూపాయలకు చేరింది.

  • HYDలో 48 గంటలు వాటర్ బంద్

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు గోదావరి తాగునీటి సరఫరాలో 48 గంటల పాటు అంతరాయం కలగనుంది. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లో భాగంగా ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో మరమ్మతు పనులు చేపట్టనున్నారు.   ఈ కారణంగా  SRనగర్, సనత్‌నగర్, బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, KPHB, జగద్గిరిగుట్ట, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో  నీటి సరఫరా నిలిచిపోనుంది.

     

  • బయట టీ తాగుతున్నారా?

    హైదరాబాద్‌‌లో కల్తీ టీ వ్యాపారాన్ని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. 42 టీ పౌడర్ యూనిట్లు, టీ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, 19 నమూనాలను ల్యాబ్‌కు పంపారు నివేదికలు వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కల్తీ టీ పౌడర్ తడి గుడ్డపై రుద్దినప్పుడు పసుపు కలర్‌లో మారుతుందని తెలిపారు.  కల్తీ పౌడర్ కలిపిన నీళ్లు వెంటనే డార్క్ రెడ్  కలర్ లోకి మారుతాయని పేర్కొన్నారు.

     

     

  • మెట్లెక్కుతుంది… మంటలార్పుతుంది!

    HYD: ఇది షార్క్‌ ఫైర్‌ ఫైటింగ్‌ రోబో. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు మనిషి వెళ్లలేని ప్రాంతాల్లోకి అవలీలగా దూసుకెళుతుంది. రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే ఈ రోబో ఏ భవనం మెట్లు అయినా సులభంగా ఎక్కగలదు. ఈ రోబో మంటలను ఆర్పేందుకు నీటిని చల్లడంతోపాటు వేడిని తట్టుకునేందుకు తనపైన కూడా నీటిని చల్లుకుంటూ ముందుకు వెళుతుందని హైదరాబాద్‌లోని హైకోర్టు ఫైర్‌స్టేషన్‌కు చెందిన టెక్నికల్‌ ఫైర్‌ఫైటర్‌ కొమరెల్లి తెలిపారు.

  • మహానిమజ్జనం.. సర్వం సిద్ధం

    TG: గణేశ్ ఉత్సవాలకు ముగింపు పలుకుతూ హైదరాబాద్‌లో నేడు నిమజ్జనోత్సవం ఘనంగా జరగనుంది. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర, బాలాపూర్ లడ్డూ వేలం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సిటీలోని భారీ విగ్రహాలు ఊరేగింపుగా గంగఒడికి చేరనున్నాయి. లక్షలాది మంది భక్తులు నిమజ్జనంలో పాల్గొననున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

     

  • రూ.2.3కోట్లు పలికిన గణేశ్‌ లడ్డూ

    TG: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ సన్‌ సిటీలో ఉన్న రిచ్‌మండ్‌ విల్లాస్‌లో నిర్వహించిన గణపతి లడ్డూ వేలంలో రికార్డు నమోదైంది. ఈ లడ్డూ ఏకంగా రూ.2.32 కోట్లు పలికింది. ప్రతి సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ వేలంపాటలో స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పాల్గొన్నారు. ఈసారి వేలం రూ. కోటి నుంచి ప్రారంభమైనట్లు సమాచారం.