Locations: Hyderabad

  • నగరంలో బోనాల సందడి ఆరంభం

    HYD: నగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, డిల్లెంబల్లెం మోతలు, కళాకారుల ఆటపాటలు, డీజే హోరుతో ప్రతి గల్లీ సందడిగా మారనుంది. ఈ ఏడాది సంబరాలు అంబరాన్నంటేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంధువులు, భక్తులు, ఇరుగుపొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులతో హైదరాబాద్ సందడిగా కనిపించనుంది.
  • ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

    మేడ్చల్: బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి కింద పడి మృతి చెందిన సంఘటన జీనమ్ వ్యాలీ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వేలీ గ్రామానికి చెందిన ఎర్ర సునీల్‌కుమార్  పాఠశాలలో సెక్యూరిటీ డ్యూటీ చేస్తూ జీవించేవాడు.ద్విచక్ర వాహనంపై బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

     

  • బడి భవనంలో తహసీల్దార్ వద్దు

    HYD: ప్రజాభవన్ ప్రజావాణిలో తల్లుల సంఘం, సీఆర్పీఎఫ్ ప్రతినిధులు అడ్డగుట్టలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోని తహసీల్దార్ కార్యాలయాన్ని తరలించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. వెయ్యి మంది విద్యార్థులకు తరగతి గదులు సరిపోకపోవడంతో ఎమ్మార్వో కార్యాలయం తరలింపు అవసరమని పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, తల్లుల సంఘం కోకన్వీనర్ ఎన్ శోభా, ఎంవీ ఫౌండేషన్ ఆర్గనైజర్ ఏ.సువర్ణ పాల్గొన్నారు.
  • జూబ్లీహిల్స్‌లో పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం: అజారుద్దీన్‌

    HYD: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రేసులో తాను ఉన్నానని, అయితే పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని సీనియర్‌ నేత అజారుద్దీన్‌ తెలిపారు. గాంధీభవన్‌‌లో ఆయన మాట్లాడుతూ ‘గత అసెంబ్లీ ఎన్నికలో జూబ్లీహిల్స్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను. ఇప్పుడూ టికెట్‌ ఆశిస్తున్నాను. అధిష్ఠానానికి నా ఆలోచన చెప్పా. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా’ అని పేర్కొన్నారు.

  • మొహర్రం ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం

    HYD: జూలై 6 లేదా 7న జరిగే మొహర్రం బిబి-కా-ఆలం ఊరేగింపు కోసం హైదరాబాద్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. డబీర్‌పురా నుంచి చాదర్‌ఘాట్ వరకు సాగే ఈ ఊరేగింపులో వేలాది షియా ముస్లింలు పాల్గొంటారు.  పోలీస్ కమిషనర్ సివి.ఆనంద్ సాలార్జంగ్ మ్యూజియంలో షియామత పెద్దలు, జీహెచ్‌ఎంసీ వాటర్‌వర్క్స్,విద్యుత్, వైద్య, అగ్నిమాపక, వక్ఫ్‌బోర్డు అధికారులతో సమావేశమై, అభివృద్ధి విషయాలపై  చర్చించి, సమన్వయం కోసం అభిప్రాయాలు సేకరించారు.
  • భూమి వివాదం.. ఘర్షణలో గాయాలు

    HYD: ఫాతిమా కాలనీ హుస్సేని ఆలం వద్ద భూమి వివాదం కారణంగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ, సౌత్ జోన్ అదనపు డిసిపి ఎం.ఎ. మజీద్, చార్మినార్ ఏసీపీ, హుస్సేని ఆలం పోలీస్ ఇన్స్పెక్టర్లు సంఘటనా స్థలాన్ని సందర్శించి, భూమిని పరిశీలించి, రెండు వర్గాల నుంచి సమాచారం సేకరించారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

     

  • హైదరాబాద్‌లోని 349 ప్రాంతాల్లో వరద ముప్పు: హైడ్రా

    HYD: భాగ్యనగరంలో 349 ప్రాంతాల్లో వరద ముప్పు ఉందని హైడ్రా గుర్తించింది. వర్ష సమాచారం తెలియగానే ఆయా ప్రాంతాల్లో సంబంధిత శాఖల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సూచించారు. 349 ప్రాంతాలకు దగ్గరలో చెరువులు, నాలాలు అనుసంధానమై ఉన్నాయో, లేదో పరిశీలించాలని ఆదేశించారు. వరద కాలువలు కుంచించుకుపోయినా, పూడుకుపోయినా  సమాచారం ఇస్తే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

     

  • లిక్కర్ సేవించి గొడవ.. ముగ్గురికి జైలు, జరిమానా

    HYD: పాతబస్తీ కిషన్‌బాగ్‌కు చెందిన సల్మాన్, ఫిరోజ్, హసన్‌నగర్‌కు చెందిన అబ్దుల్ షానూర్ బహదూర్‌పురా ఎక్స్ రోడ్ వద్ద రాత్రిపూట చీప్ లిక్కర్ సేవించి గొడవకు పాల్పడ్డారు. బహదూర్‌పురా పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వీరికి ఐదు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధించారు.
  • ఇంట్లో చోరీ.. కేసు నమోదు

    రంగారెడ్డి: అమెరికాకు వెళ్లి.. తిరిగి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తుర్కయంజాల్‌కు చెందిన సొమరౌతు శ్రీలక్ష్మి అనే మహిళ ఏప్రిల్18న అమెరికాకు వెళ్లి జూన్19న తిరిగి హైదరాబాద్‌కు తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న సుమారు 20 తులాల బంగారం, ఐప్యాడ్, ఐఫోన్, నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించింది. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • డ్రగ్స్ అమ్మకాలతో ఊడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం

    HYD: సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో వస్తున్న లక్షల జీతాలు సరిపోవంటూ డ్రగ్స్ అమ్మకాలకు దిగడంతో చేస్తున్న ఉద్యోగం ఊడిన ఘటన మైలార్ దేవులపల్లిలో జరిగింది. ప్రకాశం జిల్లాకి చెందిన వెంకట జగదీశ్వర్ రెడ్డి (25) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మైలార్ దేవులపల్లి ప్రాంతం మైఫిల్ హోటల్ సమీపంలో డ్రగ్స్‌ను తీసుకువెళ్తుండగా పోలీసులకు దొరికాడు. నిందితుడి వద్ద 23.3 ఎండీఎంఏ డ్రగ్స్, సెల్ ఫోన్, బైకును స్వాధీనం చేసుకున్నారు.