
Locations: Hyderabad
-
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన రైతులు
మేడ్చల్: కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఆలోచిస్తుందని మేడ్చల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమణారెడ్డి అన్నారు. మంగళవారం రైతు భరోసా పథకం కింద మేడ్చల్ మండల రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని, రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేడ్చల్ రైతుల తరఫున రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
పాతబస్తీలో రాళ్ల దాడి.. వాహనాల ధ్వంసం
HYD: పాతబస్తీలోని హుసేనిఆలం పోలీస్ పరిధిలో ఆస్తి గొడవ కారణంగా ఇరు వర్గాలు రాళ్లు, ఇనుప కుర్చీలతో దాడి చేసుకున్నారు. వాహనాలను ధ్వంసం చేసి, మహిళలపై కూడా యువకులు రాళ్లతో దాడి చేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొడవకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యుత్ సరఫరాకు అంతరాయం
మేడ్చల్: చెట్ల కొమ్మల తొలగింపుతో పాటు విద్యుత్ ఫీడర్ మరమ్మతుల కారణంగా బుధవారం గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని మేడ్చల్ విద్యుత్ ఏఈ విజయ్ కుమార్ తెలిపారు. పలు ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.
-
హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మల్లంపేట గ్రామంలో రోడ్డు సమస్య, ట్రాఫిక్ ఇబ్బందులతో గ్రామస్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దుండిగల్ మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేయగా, అధికారులు గోడను తొలగించి సమస్యను పరిష్కరించారు. మల్లంపేట వాసులు హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన గుర్తింపు
TG: ఢిల్లీలో జరుగుతున్న ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారుల సమావేశం-2025లో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన గుర్తింపు దక్కింది. 2024-25 మధ్య కాలానికి గానూ ‘సంస్కరణలు, ప్రజా సేవపట్ల నిబద్ధత’ విభాగంలో హైదరాబాద్ ‘రీజినల్ పాస్‌పోర్టు ఆఫీస్’ అవార్డు సాధించింది. అంతేకుండా పాస్‌ఫోర్టు వెరిఫికేషన్‌లో ఉత్తమ సేవలు అందించినందుకుగానూ తెలంగాణ పోలీసు విభాగాన్ని కూడా అవార్డుతో సత్కరించారు.
-
భర్తతో గొడవ.. మహిళ అదృశ్యం
మేడ్చల్: భార్యభర్తల మధ్య గొడవ కారణంగా భార్య అదృశ్యమైన ఘటన జవహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దొండతోట సమీపంలో నివసిస్తున్న పొర్ల శ్రీను, భార్య భాగ్యలక్ష్మి (35) మధ్య ఈ నెల 19న గొడవ జరిగింది. 20న శ్రీను పనికి వెళ్లగా, భాగ్యలక్ష్మి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబం ఫిర్యాదుతో జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నోటు పుస్తకాల పంపిణీ
మేడ్చల్: గుండ్లపోచంపల్లి మున్సిపల్‌లోని బాసురేగడి సెయింట్ క్లారెట్ స్కూల్‌లో మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యాదానం గొప్పదని, పేద విద్యార్థులకు సహకరించడం సంతోషమని తెలిపారు. కార్యక్రమంలో కోమలత, శిల్పా, అబ్రార్ ఖాన్, విజయ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి’
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ ఉపాధ్యక్షులు దొడ్ల నాగేశ్వర్ రెడ్డి కుమార్తె అనూషకు రూ.1,00,116 కల్యాణ లక్ష్మీ చెక్కును నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో ఇంఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. అర్హులందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. -
చెట్ల తొలగింపును పర్యవేక్షించిన కార్పొరేటర్
మేడ్చల్: చర్లపల్లి డివిజన్ ఐజీ కాలనీలో GHMC స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్, TGSPDCL ADE రామ్ దాస్‌తో కలిసి పర్యటించారు. వర్షాకాలంలో ఈదురుగాలుల వల్ల చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడకుండా, ముందస్తు జాగ్రత్తగా అధికారుల సమక్షంలో చెట్ల తొలగింపు పనులను పర్యవేక్షించారు. -
‘సంజీవ్’ సినిమా పోస్టర్ విడుదల
HYD: చిన్నప్పటి నుంచి నటనలో ఆసక్తితో ఓ యువకుడు ‘సంజీవ్’ సినిమా కోసం బ్యాంక్‌లో పర్సనల్ లోన్ తీసుకుని తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమాను నిర్మించాడు. సిద్దిపేట జిల్లాకు చెందిన అనిల్ నక్క అనే యువకుడు మధుర ఆడియెస్ బ్యానర్ ద్వారా తనే రచన, దర్శకత్వం వహించి నటించిన ‘సంజీవ్’ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు.