Locations: Hyderabad

  • ఇందిరమ్మ ఇండ్ల పథకం పరిశీలన

    మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గ ఇంఛార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ ఆదేశాలతో ఘట్కేసర్ మున్సిపల్‌లోని ఎదులాబాద్ గ్రామంలో మాజీ ఛైర్‌పర్సన్ ముల్లి పావని పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పేర్లు రాని వారి ఇండ్లను పరిశీలించారు. రూ.5 లక్షల రూపాయలు విడుదల చేస్తామని, స్థానిక సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అమర్, ఉదయ్ రెడ్డి, కందుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
  • జీతాలు లేక ఇబ్బందులు..

    మేడ్చల్: జిల్లా పరిధిలోని 1962 పశు సంచార వైద్య సిబ్బంది గత మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సిబ్బంది, జీతాలు లేకపోయినా పశువులకు వైద్య సేవలు అందిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి జీతాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
  • బస్తీలో పర్యటించిన కార్పొరేటర్

    మేడ్చల్: రామంతపూర్ నెహ్రూ నగర్‌లో సంక్షేమ సంఘం అధ్యక్షులు ముత్తినేని జగదీష్, కమిటీ సభ్యులు కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావుని కలిసి కాలనీలో అత్యవసరంగా డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి చేశారు. దీన్నిపై కార్పొరేటర్ వెంటనే స్పందించి మంగళవారం నెహ్రూనగర్ బస్తీలో పర్యటించారు. ఈ పర్యటనలో కార్పొరేటర్‌తో పాటు జలమండలి మేనేజర్ రవీందర్, సూపర్‌వైజర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

  • నిధుల మంజూరు.. ప్రొసీడింగ్ పత్రాల అందజేత

    మేడ్చల్: నాయీబ్రాహ్మణుల గ్రేవ్ యార్డు అభివృద్ధికి, మౌళిక సదుపాయాల కల్పనకు రూ.40లక్షల నిధులను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో కులపెద్దలకు నిధుల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఉప్పల్ నాయీబ్రాహ్మణుల సంఘం అధ్యక్షులు తురాయి చంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు.

  • మహాసభకు తరలి వెళ్లిన ఆర్టీసీ ఉద్యోగులు

    మేడ్చల్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మహాసభకు మేడ్చల్ డిపో ఆర్టీసీ ఉద్యోగులు తరలి వెళ్లారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం సభ ఉద్దేశమన్నారు. మహాలక్ష్మి పథకం విజయంలో ఉద్యోగుల పాత్రను యూనియన్ నాయకులు కొనియాడారు. కానీ పనిభారం, సెలవులు, మానవ వనరుల శాఖ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.
  • గల్లీలో కార్పొరేటర్ పర్యటన

    HYD: సీతాఫల్‌మండిలోని వీరయ్య గల్లీలో కార్పొరేటర్ సామల హేమ స్థానికుల విజ్ఞప్తి మేరకు పర్యటించారు. వారి సమస్యలు తెలుసుకొని సీసీ రోడ్డు పనులకు ఇప్పటికే ప్రతిపాదనలు పెట్టడం జరిగిందని, నిధులు మంజూరు కాగానే త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. హై టెన్షన్ వైర్లపై పెరిగిన చెట్ల కొమ్మలు ప్రమాదంగా మారుతున్నాయని, త్వరలో అధికారులతో మాట్లాడి చెట్ల కొమ్మలను తొలగిస్తానని హామీనిచ్చారు.

  • రమేష్‌కు ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్

    HYD: రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి OSD పాక రమేష్‌కు ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 లభించింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సారధి జి. వెన్నెల గద్దర్, ఫిలిం ఛాంబర్ ఛైర్మన్ పి. రామకృష్ణ గౌడ్ చేతుల మీదుగా రమేష్ ఈ అవార్డును అందుకున్నారు.
  • మొబైల్ ఫోన్‌ల రికవరీ

    మేడ్చల్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు పోగొట్టుకున్న, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించి వాటిని తిరిగి బాధితులకు అందజేశారు. మొత్తం 1130 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో రాచకొండ పోలీసులు విజయవంతమయ్యారు. ఈ ఫోన్ల విలువ సుమారుగా మూడునన్నర కోట్లు (₹3.5 కోట్లు) ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలిపారు.

  • విరిగిన పాలు.. షాప్‌పై కేసు

    HYD: కూకట్‌పల్లి పీఎస్‌లో విచిత్రమైన కేసు నమోదైంది. తను కొన్న ప్యాకెట్ పాలు విరిగిపోయాయని రాములు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అతను ఓ సూపర్ మార్కెట్‌లో 2 పాల ప్యాకెట్లు కొన్నాడు. ఒకదాన్ని కట్ చేసి వేడి చేసేందుకు గిన్నెలో పోయగా అవి విరిగిపోయాయి. వెంటనే సూపర్‌మార్కెట్‌కు వెళ్లి ప్రశ్నించగా, వారు తమకేం సంబంధం లేదని సమాధానం ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

     

  • బస్తీబాటలో పాల్గొన్న కార్పొరేటర్ 

    HYD: బస్తీబాట కార్యక్రమం భాగంగా రహమత్ నగర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్‌లో వివిధ శాఖల అధికారులతో కలిసి కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పర్యటించారు. బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సేవరేజ్, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలపైన స్థానిక ప్రజలతో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఇన్స్‌స్పెక్టర్ కిరణ్, జీహెచ్‌ఎంసీ ఇన్స్‌స్పెక్టర్ వణిధర్,  పాల్గొన్నారు.