Locations: Hyderabad

  • జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు పార్టీని సిద్ధం చేయాలి: CM రేవంత్‌

    TG: పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మార్కెట్‌, టెంపుల్‌ కమిటీల్లో నామినేషన్‌ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ‘‘రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాం. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌, జమిలి ఎన్నికల వంటి అనేక అంశాలు మన ముందుకు రానున్నాయి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలి’’అని సీఎం చెప్పారు.

     

  • ‘మా యూనివర్సిటీ నాయకుడికి అవకాశం కల్పించండి’

    మేడ్చల్: రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల్లో ఈసారి జేఎన్టీయూ యూనివర్సిటీ విద్యార్థులకు అవకాశం కల్పించాలని జేఎన్టీయూ యూనివర్సిటీ వివిధ సంఘాల సభ్యులు విజ్ఞప్తి చేశారు. వివిధ యూనివర్సిటీల వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఈసారి ఇవ్వబోయే నామినేటెడ్ పదవుల్లో జేఎన్టీయూ వారికి అవకాశం కల్పించాలని సూచించారు. ఈసారి జేఎన్టీయూ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడైన కరుణాకర్ రెడ్డికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాయన్నారు.

  • రోడ్లపై అక్రమ నిర్మాణాలకు చెక్‌

    మేడ్చల్: పట్టణంలోని వ్యాపారస్తులు, గృహ నిర్మాణ దారులు రోడ్లపైకి నిర్మాణాలు గాని, షాపులు నిర్మించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణ రెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ గల రోడ్డుపై నిర్మించుకున్న చిరువ్యాపారుల షాపులు, ఇంటి నిర్మాణం ముందు ఏర్పాటు చేసుకున్న షెడ్లను మంగళవారం జేసీబీల సహాయంతో అధికారులు కూల్చివేశారు.

  • ‘పాస్టర్‌ను కఠినంగా శిక్షించాలి’.. పీఎస్‌లో ఫిర్యాదు

    HYD: దేశ ఔన్నత్యాన్ని, మతసామరస్యాన్ని, మహిళల గౌరవాన్ని తీవ్రంగా భంగపరిచిన పాస్టర్ శాలెం రాజును కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రముఖ సామాజిక ఉద్యమకారిని, విశ్వహిందు రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ సైబర్‌క్రైమ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విశ్వహిందూ రక్షా పరిషత్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కమల కుమారి మాట్లాడుతూ.. ఆడవాళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.

  • దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

    HYD: సికింద్రాబాద్‌ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ వ్యాపారవేత్తకు టోకరా వేశారు. జ్యువెలరీ వ్యాపారవేత్త నుంచి రూ.45 లక్షలు కాజేశారు. సినీఫక్కీలో జరిగిన ఈ దోపిడీని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిందితుల్లో కొండాపూర్‌ 8వ బెటాలియన్‌కి చెందిన కానిస్టేబుల్‌ కేశవ్‌ పట్టుబడ్డాడు. ప్రధాననిందితులు ఇద్దరిని గోవాలో అదుపులోకి తీసుకున్నారు. కేసులో 18మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

  • నటుడు మోహన్‌బాబు పిటిషన్‌పై విచారణ వాయిదా

    HYD: పహాడీషరీఫ్‌ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నటుడు మంచు మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే నెల 3కి వాయిదా వేసింది. విలేకరి రంజిత్‌పై దాడి కేసులో మోహన్‌బాబుపై పోలీసులు పలు సెక్షన్ల కింద మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు.

  • చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్

    హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు. తమ తల్లి అంజనా దేవి అనారోగ్యానికి గురి కావడంతో ఏపీ కేబినెట్ భేటీ నుంచి పవన్ హుటాహుటిన బయలుదేరి చిరంజీవి ఇంటికి వచ్చారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

  • అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు

    మేడ్చల్: వ్యాపారస్తులు, గృహ నిర్మాణ దారులు రోడ్లపైకి నిర్మాణాలు గాని, షాపులు నిర్మించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణ రెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులోని కాలనీ రోడ్డపై నిర్మించుకున్న చిరువ్యాపారుల షాపులు, ఇంటి నిర్మాణం ముందు ఏర్పాటు చేసుకున్న షెడ్లను జెసీబీల సహాయంతో మున్సిపాలిటీ కమిషన్ బి.నాగిరెడ్డి ఆదేశాలతో సిబ్బంది సహకారంతో అధికారులు కూల్చివేశారు.

  • చరిత్రలో నిలిచిపోయేలా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు

    HYD: సికింద్రాబాద్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జులై 13న ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.  అన్ని శాఖల సమన్వయంతో ప్రజలందరి సహకారంతో బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి కోరారు.

  • ‘ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి’

    HYD: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను బాధ్యతతో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను కమిషనర్‌ స్వీకరించారు. ఫిర్యాదులను ఆయా విభాగాలకు పంపి తక్షణ చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించారు.