Locations: Hyderabad

  • ఎస్‌ఎల్‌వి ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవం

    మేడ్చల్: ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయనున్నట్లు ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుదెళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కూకట్‌పల్లిలోని ఎస్‌ఎల్‌వి ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గాంధీ కార్పొరేటర్లతో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో జాతీయ అంతర్జాతీయ క్రీడలకు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులు ఎక్కువ అవుతారన్నారు.

  • నేడు స్మారక పురస్కారాల ప్రదానం

    HYD: రసమయి పైడి లక్ష్మయ్య ట్రస్ట్‌ ఆధ్వర్యంలో స్మారక పురస్కారాలను ఈ రోజు ప్రదానం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో పైడి లక్ష్మయ్య, పీఎల్‌ సంజీవరెడ్డి స్మారక పురస్కారాల పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమాచారాని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

  • ప్రియుడి కోసం అమ్మ ప్రేమ మరిచావా బిడ్డా!

    రోజురోజుకు మానవ సంబంధాలు దారుణంగా తయారవుతున్నాయి.  చిన్న వయసులో ప్రేమలో పడటం తల్లిదండ్రులు అడ్డు చెబితే చావడమో.. చంపడమో చేస్తున్నారు. ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్నతల్లిని పదో తరగతి చదివే కుమార్తె ప్రియుడితో కలిసి హతమార్చిన ఘటన జీడిమెట్లలో జరిగింది.  దీంతో ‘‘ప్రియుడి కోసం అమ్మ ప్రేమ మరిచావా బిడ్డా’’అని యువతిపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

     

  • జీడిమెట్ల హత్య కేసులో సంచలన విషయాలు!

    HYD: జీడిమెట్లలో హత్యకు గురైన అంజలి(39) చాకలి ఐలమ్మ మునిమనవరాలని తెలిసింది. వారంరోజుల క్రితం తన ప్రియుడు శివతో అంజలి కూతురు తేజశ్రీ వెళ్లిపోయింది. మూడురోజుల క్రిత తిరిగి వచ్చింది. తల్లి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసి.. అంజలిపై తేజశ్రీ, శివ, అతడి తమ్ముడు యశ్వంత్ దాడి చేశారు. అంజలి తలపై తేజశ్రీ సుత్తితో కొట్టగా.. యశ్వంత్ ఆమె గొంతుకోశాడు.

  • ఆషాఢంలో అమ్మతల్లికి బోనాలు

    HYD: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో ప్రత్యేకంగా నిలిచే పండగల్లో బోనాలు ఒకటి. అలాంటిది ఆషాఢ బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి జులై 24 వరకు జరగనున్న బోనాల పండగ కోసం నగరంలోని ప్రధాన ఆలయాలు అందంగా ముస్తాబు అవుతున్నాయి. వచ్చే నెల 13న సికింద్రాబాద్ ఉజ్జయిన మహంకాళి ఆలయానికి CM రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.

  • ఎస్‌ఎంఎస్‌ స్కూల్‌ యాజమాన్యానికి నోటీసులు

    HYD: బార్‌ పక్కన స్కూల్‌ ఎలా నడుస్తుందని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన జిల్లా విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్కూల్‌పై పూర్తి నివేదిక సమర్పించాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో ప్రత్యేక అధికారులు సీతాఫల్‌మండిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎస్‌ఎంఎస్‌ స్కూల్‌ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

  • కుమార్తెపై తండ్రి అత్యాచారయత్నం

    HYD: సికింద్రాబాద్‌ బొల్లారం పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రే కుమార్తెపై అత్యాచారానికి యత్నించాడు. మద్యం మత్తులో కుమార్తె శరీర భాగాలు తాకి వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బొల్లారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుని విచారిస్తున్నట్టు సమాచారం.

     

     

  • 2050 నాటికి.. 629 కి.మీ మెట్రో

    HYD: మహానగరం అవుటర్‌ రింగ్‌ రోడ్డు దాటి రీజనింగ్ రింగ్‌ రోడ్డు వరకు విస్తరిస్తోంది. HMDA పరిధి కూడా 7257చ.కి.మీ.ల నుంచి 10,472చ.కి.మీ.లు పెరగనుంది. ప్రస్తుతం నగర జనాభా 1.45కోట్లు కాగా.. వచ్చే 20 ఏళ్లలో 3 కోట్లకు చేరనుందని HMDA అంచనా వేస్తోంది. కాంప్రెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌(CMP)లో భాగంగా 2050 వరకు మెట్రో సేవలు 629కి.మీ.ల వరకు విస్తరించాలని యోచన. ఫేజ్‌-2లో 74, ఫేజ్‌2Bలో మరో 86 కిలోమీటర్లకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

  • ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు

    మేడ్చల్: జీడిమెట్ల పీఎస్ పరిధిలోని NLB నగర్‌లో నివాసముంటున్న సట్ల అంజలి(39)ని ఆమె కూతురు తేజశ్రీ(16), ప్రియుడు పగిల్ల శివ(19), అతని తమ్ముడు పగిల్ల యశ్వంత్(18) కలిసి గొంతు నులిమి, తలపై కొట్టి హత్య చేశారు. తేజశ్రీ ప్రేమ వ్యవహారం తల్లికి తెలిసి మందలించడంతో కోపంతో ఈదారుణానికి పాల్పడినట్టు తెలుస్తుంది.  జీడిమెట్ల పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
  • రీల్స్‌ కోసం బైక్‌పై ప్రమాదకర స్టంట్‌ (VIDEO)

    HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో  ఏకంగా ఎనిమిది మంది యువకులు ఓ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనంపై రీల్స్‌ కోసం స్టంట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియో చూసి వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు స్పందించి.. యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉండటం గమనార్హం.