Locations: Hyderabad

  • ప్యాకెట్ పాలు ప‌గిలిపోయాయ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు

    మేడ్చల్: కూకట్‌పల్లిలో పాకెట్ పాలు పగిలినాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితుడు. కుకట్‌పల్లి పీఎస్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో ప్యాకెట్ పాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చి కాచేసరికి పగిలిపోయాయి. బాధితుడు దుకాణదారుడిని ప్రశ్నించగా మేము ఏమి చేస్తాం అంటూ జవాబుకు ఇచ్చాడు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
  • దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిన చంపిన కూతురు

    HYD: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తన తల్లి అంజలి(39)ని కూతురు తేజశ్రీ(16) హత్య చేసింది. తన ప్రేమ వ్యవహారం తెలియడంతో తల్లిమందలించిందన్న కోపంతో తన ప్రియుడు పగిల్ల శివ(19), అతని తమ్ముడు పగిల్లా యశ్వంత్(18)తో కలిసి అంజలి గొంతు నులిమి, తలపై కొట్టి చంపేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

  • గుడిమల్కాపూర్ మార్కెట్ తరలింపు

    HYD: మెహదీపట్నానికి సమీపంలో గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. నగరం అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతం ప్రస్తుతం రద్దీగా మారింది. దీన్ని తరలించడానికి శంకర్‌పల్లి, శంషాబాద్, మొయినాబాద్, గండిపేట మండలాల్లో ప్రభుత్వ భూములను పరిశీలించారు. బాహ్యవలయ రహదారికి సమీపంలోని మొయినాబాద్‌ మున్సిపాలిటీ అజీజ్‌‌గర్‌ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వభూములు అనువుగా ఉన్నాయని, ఇక్కడైతేనే రైతులు, హోల్‌సేల్‌ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది.

  • తెలంగాణ భవన్ వద్ద ఫ్లెక్సీ కలకలం

    TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కామపిశాచి అంటూ తెలంగాణ భవన్‌ వద్ద ఫ్లెక్సీ వెలిసింది. ‘కేసీఆర్ సారూ గిరిజన మహిళలను లైంగికంగా వేధిస్తున్న మీ వాళ్లను పార్టీలో నుండి సస్పెండ్ చేయండి’ అంటూ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మానవ అక్రమ రవాణాలోనూ బీఆర్ఎస్ నేతలే నిందితులుగా ఉన్నారని ఆరోపించారు.

     

  • వృత్తి విద్య కోర్సులతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు

    HYD: యువతకు ఉజ్వల భవిష్యత్తు వృత్తి విద్య కోర్సులతోనే అని ఇంటర్ విద్య డైరెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. వెస్ట్ మారేడ్‌పల్లి కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో వృత్తి విద్య కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల కోసం అప్రెంటిషిప్, కమ్ జాబ్ మేళా నిర్వహించారు. 81 కంపెనీలలో 3,183 ఉద్యోగ ఖాళీలు ఉండగా, ఇందులో 53 కంపెనీలు 572 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేశాయి.

  • ‘విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి’

    HYD: పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించింది. విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించేలా చట్టం తెచ్చి విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేసింది. పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు పి.మహేష్, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వీ.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు మాట్లాడారు. అనంతరం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

  • మున్సిపల్ కమిషనర్ల బదిలీ

    మేడ్చల్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, తుంకుంట మున్సిపల్ కమిషనర్ వెంకట్ గోపాల్‌లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా మేడ్చల్ మున్సిపల్ కమిషనర్‌గా కె. చంద్ర ప్రకాష్, తుంకుంట మున్సిపల్ కమిషనర్‌గా ఎం.ఎన్.ఆర్. జ్యోతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
  • విద్యార్థులకు ఈ-సిగరెట్, గంజాయి చాక్లెట్ల విక్రయం

    HYD: నగరం, శివారు ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు ఈ-సిగరెట్‌కు అలవాటుపడినట్టు పోలీసులు గుర్తించారు. ముంబయి ముఠా ఏజెంట్ల ద్వారా పిల్లలకు విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. రాజస్థాన్, ఒడిశా ముఠాలు గంజాయి చాక్లెట్లు, బిస్కెట్లను రుచి చూపుతున్నాయి. విద్యాసంస్థల సమీపంలోని కొన్ని కిరాణా, పాన్‌ షాపుల్లో వీటిని విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో గుర్తించారు.కట్టడి చేయకపోతే పెద్ద నేరాలకు పాల్పడే ఆస్కారం ఉందని టీజీన్యాబ్‌ డీఎస్పీ మధుమోహన్‌రెడ్డి హెచ్చరించారు.

     

  • చికిత్స పేరిట చిన్నారిని హింసిస్తున్నారు

    మేడ్చల్: ఆటిజం పిల్లలకు సాంత్వన చేకూరుస్తామంటూ హబ్సిగూడలో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ పేరుతో కేంద్రం ఉంది. నాలుగేళ్ల బాలికకు మైల్డ్‌ ఆటిజం,మాటలు రావడం ఆలస్యం కావడంతో తల్లిదండ్రులు ఇక్కడ చేర్పించారు. నిర్వాహకులు చికిత్స పేరిట చిన్నారిని కొట్టడం,హింసకు గురిచేయడం చేస్తున్నారు. బాలిక శరీరంపై గాయాలు చూసి తల్లి నిలదీయగా, చికిత్స అలానే ఉంటుందన్నారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది.

  • గచ్చిబౌలిలో గజం ధర ఎంతంటే

    HYD : గ్రేటర్‌ పరిధిలో ఉన్న తెలంగాణ హౌసింగ్‌ బోర్డు స్థలాల వేలంలో ఆశించిన స్థాయిలో ధరలు పలకలేదు. అయితే హౌసింగ్‌ బోర్డు నిర్వహించిన వేలంలో IT కారిడార్‌లోని ప్రధాన ప్రాంతమైన గచ్చిబౌలిలో గజం ధర అత్యధికంగా రూ.2.22 లక్షలు పలకగా.. అత్యల్పంగా రూ.1.12 లక్షలు పలికింది. గచ్చిబౌలిలో 4 ప్లాట్లను అమ్మకానికి పెట్టగా, అన్నీ కొనుగోలు చేశారు.