Locations: Hyderabad

  • గొప్ప దేశ భక్తుడు శ్యామ్ ప్రసాద్

    HYD: గొప్పదేశ భక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధన కోసం కలసి కట్టుగా పని చేద్దామని బీజేపీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి ప్రసాద్ గౌడ్ పిలుపునిచ్చారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి(బలిదాన్ దివస్) సందర్భంగా బౌద్ధనగర్ డివిజన్‌లో ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

  • కారు బీభత్సం.. మహిళ మృతి

    మేడ్చల్: కూకట్‌పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యులతో నిల్చున్న కృతికపైకి కారు దూసుకు రాగా తీవ్ర గాయలయ్యాయి. దీంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనలో కృతిక కుమారుడు, భర్తకు గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • ఫోన్ ట్యాపింగ్‌పై CBI విచారణ

    ఫోన్ ట్యాపింగ్‌పై CBI విచారణ

     

  • చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

    మేడ్చల్: తండ్రి హత్య కేసులో జీవిత ఖైదీగా ఉండి పెరోల్‌పై విడుదలై దొంగతనాలకు పాల్పడుతున్న గొండ్ల రాములు (42)ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ట్రాక్టర్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.
  • భారీగా గంజాయి పట్టివేత.. 

    మేడ్చల్: మేడ్చల్‌ SOT పోలీసులు ORRపై గంజాయి తరలిస్తున్న దేవరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ మీదుగా హర్యానాకు గంజాయి సరఫరా చేస్తున్న దేవరాజ్‌, బజరంగ్‌ నుంచి గంజాయి తీసుకొని హనుమంత్‌ పవార్‌, రాజకుమార్‌లకు అందిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 120.17 కేజీ గంజాయి, నెక్సా కారు, 5 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
  • పార్టీ శ్రేణులతో సమావేశం

    HYD: సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆదేశాలతో తనయుడు రామేశ్వర్ గౌడ్ అడ్డగుట్టలో గులాబీ శ్రేణులతో సమావేశమై, పార్టీ స్థితిగతులపై చర్చించారు. పార్టీ పూర్వవైభవం కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అనారోగ్యంతో ఉన్న సీనియర్ నాయకుడు ఇస్మాయిల్‌ను పరామర్శించి, ధైర్యం చెప్పారు. సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
  • 70 వసంతాలు పూర్తి చేసుకున్న ఎస్‌బీఐ.. రక్తదాన శిబిరం ఏర్పాటు

    HYD: స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆవిర్భవించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్ జోనల్ అడ్మినిస్ట్రేటివ్  కార్యాలయంలో సోమవారం ఎస్‌బీఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని డీజీఎం భువనేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయంలో వారి ప్రాణాలు కాపాడగలిగిన వారమవుతామని చెప్పారు.

  • జూలై 9న సార్వత్రిక సమ్మె

    HYD: కేంద్రం కార్మిక హక్కులను హరిస్తూ బడా పారిశ్రామికవేత్తలకు సంపద సృష్టిస్తోందని ఆరోపిస్తూ, జూలై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి సికింద్రాబాద్‌లోని రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో INTUC, AITUC, HMS, CITU, IFTU, TNTUC, TUCI నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
  • బంగారం పేరుతో మోసం.. నిందితుడి అరెస్టు

    HYD: తక్కువ ధరకు బంగారం పేరుతో మోసగిస్తున్న నిందితుడిని అఫ్జల్‌గంజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తక్కువధరకు బంగారం విక్రయిస్తామంటూ ముగ్గురు ముఠాసభ్యులు అమాయకులకు టోకరా వేశారు. బాధితుల వద్ద రూ.40లక్షలు తీసుకొని పరారయ్యారు. నిందితుడు జయకుమార్‌ను అరెస్టు చేసి.. అతడి వద్ద నుంచి రూ.40లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితులు ఉదయ్‌, సందీప్‌ కోసం గాలిస్తున్నారు.

  • నీటి కొరతపై కాలనీవాసుల ఆందోళన

    మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచర్ల గాంధీ నగర్‌లో నీటి సరఫరా లేక కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం నుంచి ఐదు రోజులకు ఒకసారి కేవలం ఒక డ్రమ్ము నీరు వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. HMWS వాటర్ బోర్డు కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపారు.