Locations: Hyderabad

  • భారీగా డ్రగ్స్ పట్టివేత.. నైజీరియన్‌ అరెస్ట్

    HYD: నార్సింగ్‌లో టీన్యాబ్, నార్సింగ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో రూ.30 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేశారు. రూ. 30లక్షల విలువైన ఎస్టసీ పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్‌ విస్డం ఒనేకాతో పాటు ఇద్దరు లోకల్‌పెడ్లర్స్‌ మణికొండకి చెందిన గోపిశెట్టి రాజేష్, వెస్ట్‌గోదావరికి చెందిన బొమ్మ దేవర వీరరాజునును అరెస్ట్ చేశారు. ముఠా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సిటీలో అమ్ముతున్నట్లు గుర్తించారు.

  • ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్

    HYD: జీహెచ్ఎంసీ గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బిల్లు ప్రాసెస్ చేసి, పైకి పంపించడానికి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసింది. రూ. 5 వేలు అడ్వాన్స్ ఇచ్చి.. మిగతా రూ. 15 ఇచ్చే ముందు ఏసీబీకి పట్టించారు బాధితులు.

  • రైతు భరోసా.. 5116 మంది రైతులకు 4.61 కోట్లు జమ

    మేడ్చల్: రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసి, వారి ముఖాల్లో సంతోషం చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వమని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. సోమవారం నాటికి జిల్లాలో 5116 మంది రైతుల ఖాతాల్లో 4.61 కోట్ల రూపాయలు జమ అయినట్లు కలెక్టర్ వెల్లడించారు.

  • ప్రజావాణిలో 117 దరఖాస్తుల స్వీకరణ

    మేడ్చల్: మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 117 దరఖాస్తులు స్వీకరించారు. అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఈ దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, జాప్యం లేకుండా త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. లబ్ధిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నట్లు అధికారులు తెలిపారు.

  • తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: మంత్రి లోకేష్‌

    ఎన్టీఆర్​ ఘాట్​ను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.1.3 కోట్ల వ్యయానికి ఆమోదం తెలపడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ‘‘ఎన్టీఆర్‌ ఘాట్‌కు రూ.1.35 కోట్లతో మరమ్మతులు చేపట్టడం సంతోషకరం. నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని అన్నారు.

  • ‘వారిపై మానవత్వంతో వ్యవహరించాలి’

    HYD: కంటోన్మెంట్ వార్డు 7, లాల్‌బజార్‌లోని వీధి వ్యాపారులను ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయగా.. వారు ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను ఆశ్రయించారు. తాము 20 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నామని తమను ఆదుకోవాలని కోరారు.  ఈ నేపథ్యంలో లాల్‌బజార్‌లో ఎమ్మెల్యే శ్రీగణేష్‌ పర్యటించారు. ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. వీధి వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని, వారిపై మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు.

  • ఎమ్మెల్యేతో నూతన కమిటీ భేటి

    HYD: కంటోన్మెంట్ వార్డు 4, లక్ష్మీనగర్‌లోని శ్రీ హనుమాన్ దేవాలయం నూతన పాలకమండలి ఛైర్మన్ దర్శనాల సాంబశివ, సభ్యులు ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నూతన పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, బాగా పనిచేయాలని సూచించారు. ఎంతో అదృష్టం చేసుకుంటేనే భగవంతుడికి భక్తులకు సేవచేసే అవకాశం లభిస్తుందని అన్నారు.

  • సీసీ రోడ్డు పనులు ప్రారంభం

    మేడ్చల్: ఆర్.కే నగర్‌లో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులను మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ప్రారంభించారు. ఆర్.కే నగర్, శ్రీకృష్ణ నగర్, బలరాం నగర్‌లలో ప్యాచ్ వర్క్స్ పూర్తి చేస్తామన్నారు. ఆయన మాట్లాడుతూ.. స్థానికుల సమస్యలపై వాటర్ వర్క్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
  • 2,402 ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ ఛాన్స్

    HYD: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన 2,402 పోస్టుల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్-సి, గ్రూప్-డి కేటగిరీల్లో భర్తీ చేయనుంది. దరఖాస్తు ఫీజు రూ.100 కాగా మహిళలు, SC, ST, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు  ఫీజు మినహాయింపు ఉంటుంది.

  • రోబోటిక్ స్కార్లెస్ థైరాయిడ్ ఆపరేషన్

    HYD: భారతదేశం అడ్వాన్స్‌డ్ సర్జరీలలో ప్రపంచ స్థాయి కేంద్రంగా మారుతోందని నిరూపిస్తూ.. మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ గొప్ప విజయాన్ని సాధించిందని సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్‌సర్జన్‌ డాక్టర్ అజయ్‌వరుణ్ రెడ్డి అన్నారు. రోబోటిక్ స్కార్లెస్ థైరాయిడ్ ఆపరేషన్ చేపట్టామని ఆయన తెలిపారు. ఇది మెడికవర్ గ్రూప్ చరిత్రలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మొదటిసారని తెలిపారు. ఈ పద్ధతితో కోలుకోవడం వేగంగా జరుగుతుందున్నారు.