Locations: Hyderabad

  • ‘సమస్యల పరిష్కారానికి కృషి’

    మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్‌లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

  • గాంధీభవన్‌లో గొల్ల, కురుమలు, టీపీసీసీ చీఫ్‌తో చర్చలు

    HYD: గాంధీ భవన్‌లో గొర్ల కాపరుల సంక్షేమ సంఘం నేతలు గొర్రెలతో వినూత్న నిరసన చేపట్టారు. గొల్ల, కురుమ సామాజిక వర్గాలకు ప్రభుత్వం, పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్, కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో అవకాశం దక్కలేదని ఆందోళన వ్యక్తం చేసిన వారు, వినతిపత్రం సమర్పించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తక్షణ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

  • సరూర్ నగర్‌లో వ్యక్తిపై హత్యాయత్నం

    రంగారెడ్డి: సరూర్‌నగర్ పీఎస్ పరిధిలోని రెడ్డి బ్రదర్స్, తిరుమల నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్న అభిషేక్ (16), మహేష్‌లపై ఆరుగురు వ్యక్తులు కత్తితోదాడి చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన స్నేహితుడు భద్రుడితో గొడవ జరగడంతో అభిషేక్ ఆపే ప్రయత్నం చేశాడు. మామిడికాయల బండిపై నిద్రిస్తున్న సమయంలో దాడి జరిగింది. అతనికి మెడ,తలపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

  • ఆలయ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

    HYD: చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్ ఘాట్ క్రాంతి నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద జరుగుతున్న పనులను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. దేవాలయం చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారని కొనియాడారు. తప్పకుండా దేవాలయం అభివృద్ధి కోసం తన వంతు సహాయసహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.

  • కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో విచారణ

    TG: కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ భూములను గతంలో TGIICకి రాష్ట్ర ప్రభుత్వ కేటాయించింది. ఈక్రమంలో కంపెనీ భూములను జేసీబీలతో చదును చేసింది. దీన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో TGIICకి భూమిని అప్పగిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉండటంతో.. హైకోర్టు తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

  • టింబర్ వ్యాపారులపై అటవీ శాఖ వేధింపులు

    HYD: తెలంగాణలో టింబర్ వ్యాపారులను అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ టింబర్ అండ్ సామిల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. లక్డికపుల్‌లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో అధ్యక్షుడు చకినాల రామయ్య మాట్లాడుతూ.. చట్టబద్ధ పత్రాలు ఉన్నప్పటికీ ట్రక్కులను అడ్డగించి, భారీజరిమానాలు విధిస్తున్నారని ఆరోపించి, ప్రోటోకాల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.మంత్రి కొండా సురేఖను కలిసి సమస్యలు చర్చిస్తామన్నారు.
  • లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ

    మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో స్థానిక నారాయణ ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఇంఛార్జ్ వజ్రెష్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై 59 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇల్లు రాని వారు బాధ పడొద్దని, ప్రతి పేదవాడికి పార్టీలకు అతీతంగా మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు.

  • ‘కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా’

    మేడ్చల్: తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం కాప్రా డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఆయన పర్యటించారు. కాప్రా డివిజన్‌లో మంజూరు చేయించిన పనులను ఆయన పరిశీలించారు. కాలనీల సమస్యలు తెలుసుకోవడానికి సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు. కార్యక్రమంలో అధికారులు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • గాంధీభవన్‌లో భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్‌ వర్గాల ఆరా

    TG: గాంధీభవన్‌లోకి గొర్రెలు తీసుకువచ్చిన ఘటనపై, పోలీసుల భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్‌ వర్గాలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పోలీసుల కట్టుదిట్ట భద్రతా ఉన్నా గొర్రెల లారీ లోపలికి రావడంపై కాంగ్రెస్‌ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.  కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలో యాదవలకు ఇప్పటి వరకూ చోటు కల్పించకపోవడం గమనార్హం.

     

  • రాంగోపాల్‌పేట్‌లో మొక్కలు నాటిన కార్పొరేటర్

    HYD: రాంగోపాల్‌పేట్‌లోని బోట్టన్ స్కూల్‌లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, గొప్ప దేశభక్తుడి స్మృత్యర్థం మొక్కలు నాటినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్, నాయకులు మల్లేష్, మదన్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.