మేడ్చల్: నాగారం మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రీ భవాని రామలింగేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ట్రస్ట్ ధర్మకర్త ప్రతాప్ రెడ్డి గత మూడేళ్లుగా 2000 మంది విద్యార్థులకు పుస్తకాల అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే నోటుపుస్తకాల సరిపోక, విద్యార్థులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని గమనించి ఈ సేవ చేస్తున్నామని, భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమం కొనసాగిస్తామని అన్నారు.
Locations: Hyderabad
-
2023లో ORR అలా.. 2025లో ఇలా
TG: హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ జంట నగరాల చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు ఏటికేడాది మారిపోతున్నాయి. 2023లో ORR చుట్టూ ఖాళీ ప్రదేశాలు ఉండగా.. 2025లో మాత్రం పెద్ద భవనాలు కట్టారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
-
బాలానగర్‌లో బాలిక అదృశ్యం
మేడ్చల్: బాలానగర్ ఠాణా పరిధిలో రంగారెడ్డినగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక ఈ నెల 19న ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలిక కోసం దర్యాప్తు చేస్తున్నారు.
-
గాంధీ భవన్‌లో గొర్రెలతో నిరసన
HYD: గాంధీ భవన్‌లో గొల్ల కురుమలు వినుత్నంగా నిరసన తెలిపారు. యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్రంలో 16% జనాభా ఉన్న యాదవ, కురుమలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్‌లో గొర్లతో నిరసనదీక్ష చేపట్టింది. రూ.5000కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు, గోర్లు–మేకల సహకార సమాఖ్యకు ఛైర్మన్ నియామకం, గొర్లకు ఇన్సూరెన్స్, రెండో విడత గొర్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
-
ఆపరేషన్ సింధూర్‌లో హైదరాబాద్ వీరుడు
HYD: ఆపరేషన్ సింధూర్ జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడికి ప్రతికారంగా భారత సైన్యం పాకిస్థాన్ పై విరుచుకుపడింది. ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకొని ముష్కరులను మట్టు బెట్టింది. అటువంటి యుద్ధంలో మన హైదరాబాద్‌కు చెందిన రాపోలు సుఖదేవ్ శరణ్ పాల్గొనడం గర్వకారణం. తాజాగా ఆయన సిటీకి రావడంతో ఫిరోజ్ గూడలోని నివాసంలో కాంగ్రెస్ నాయకులు సన్మానించారు.
-
జులై 11 నుంచి లాల్ దర్వాజా బోనాల జాతర
HYD: పాతబస్తీ లాల్ దర్వాజా మహంకాళి బోనాల జాతర జులై 11నుంచి ప్రారంభం కానున్నాయని సింహవాహిణి మహంకాళి లాల్ దర్వాజా ఆలయ ఛైర్మన్ బీ.మారుతి యాదవ్, కన్వీనర్ జీ.అర వింద్ గౌడ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. జులై 20న అమ్మవారికి బోనాల సమర్పణ, రాత్రి శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21న పోతరాజు స్వాగతం, రంగం, అమ్మవారి ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
-
దడ పుట్టిస్తున్న డెంగీ
HYD : నగరంలో డెంగీ జ్వరాలు పడగ విప్పాయి. దోమకాటుతో.. బస్తీలు, కాలనీల్లో జ్వరం బాధితులు పెరుగుతున్నారు. గత 3 రోజుల్లో హైదరాబాద్ జిల్లాలో 27 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. వైద్య ఆరోగ్యశాఖ, ఎంటమాలజీ అధికారులు ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకుని.. ప్రజలను జ్వరాల నుంచి బయటపడేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.
-
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
HYD: లాలాగూడ్ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా సోమవారం సరఫరాలో అంతరాయం ఉంటుందని ప్యారడైజ్ ఏడీఈ ఆదినారాయణరావు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యానికేతన్, సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజ్ ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు. మ. 2 నుంచి సాయంత్రం 5 వరకు కనకదుర్గ అపార్ట్‌మెంట్, సండే మార్కెట్, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.
-
అప్పుల బాధతో ఓయో రూమ్‌లో యువకుడు ఆత్మహత్య
మేడ్చల్: అల్వాల్ పీఎస్ పరిధిలో ఓయో రూమ్‌లో షణ్ముఖం(29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 19న ఒంటరిగా రూమ్ తీసుకున్న షణ్ముఖం మచ్చబొల్లారంలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆధార్ కార్డు ప్రకారం వెంకట్ నగర్ అడ్రస్ ఉంది. అప్పుల ఒత్తిడే ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.
-
పాదచారులకు ఇబ్బంది
మేడ్చల్: కూకట్‌పల్లి ఏసీపీ కార్యాలయం సమీపంలోని రోడ్డు క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో పాదచారులకు కష్టంగా మారింది. సిగ్నల్స్ పనిచేసినా.. కొందరు రెడ్‌లైట్ పడినా ఆగకుండా వాహనదారులు వేగంగా వెళ్తుంటారు. కొన్ని రోజులుగా సిగ్నల్స్ పనిచేయకపోవటంతో వాహనాలు ఆగక.. రోడ్డు దాటేందుకు జనం పాట్లుపడుతున్నారు. వాహనాల మధ్య నుంచి రోడ్డు దాటాల్సి వస్తోంది. సిగ్నల్స్‌కు మరమ్మతులు చేపట్టాలని పాదచారులు కోరుతున్నారు.