Locations: Hyderabad

  • మత్తు పదార్థాల నియంత్రణ

    HYD: నగరంలో మత్తు పదార్థాల వినియోగదారులు, వారికి సరఫరా చేస్తున్న ముఠాల ఆట కట్టించడంలో డ్రగ్స్‌ కిట్లు కిలకపాత్ర పోషిస్తున్నాయి. టీజీ న్యాబ్‌ కొంతకాలంగా వినియోగిస్తున్న ఈపరికరం క్షణాల వ్యవధిలో ఫలితాలిస్తూ నేరగాళ్లలో భయం పుట్టిస్తోంది.గతంలో డ్రగ్స్, గంజాయి వినియోగించే వారిని గుర్తించినా మత్తు పదార్థం తీసుకున్నారో లేదో నిర్ధారించడానికి సమయం పట్టేది. డ్రగ్స్‌ కిట్ల రాకతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

  • పోలీసులపై లంచం ఆరోపణలు

    HYD: మహానగరం బోనాలకు ముస్తాబవుతోంది. ఇంతటి ప్రతిష్ఠాత్మక సంబరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు పోలీసులు సిద్ధమైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన ఆలయాలున్న చోట కొందరు అడ్మిన్‌ ఎస్సైలు దుకాణదారులు, హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వాహకుల నుంచి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడుతన్నట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్టు సమాచారం.

  • బయో మెడికల్‌ వ్యర్థాలు

    HYD: గ్రేటర్‌ పరిధిలోని మున్సిపల్‌ డంపింగ్‌ యార్డుల్లో బయో మెడికల్‌ వ్యర్థాలు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. నగరం నలుమూలలా ఏ డొమెస్టిక్‌ డంపింగ్‌ యార్డులో చూసినా దవాఖానల నుంచి తీసుకువచ్చిన మెడికల్‌, కెమికల్‌ వ్యర్థాలు కుప్పలుతెప్పలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో పర్యావరణ కాలుష్యంతో పాటు ఇటు పారిశుధ్య సిబ్బందికి రోగాలబారిన పడుతున్నారు. అధికారులు స్పందించి నిరంతర తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

  • హనుమాన్ ఆలయంలో చోరీ

    మేడ్చల్: ఆలయంలో చోరీ జరిగిన ఘటన షామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలోకి దుండగులు చొరబడి చోరీ చేశారు . ఆలయంలో ఉన్న వెండి వస్తువులను ఎత్తుకెళ్లారని ఆలయ పూజారి తెలిపారు. గత పదిరోజులు కిందట రామాలయం, ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. దీంతో వరుసగా చోరీ ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

  • హైడ్రా కూల్చివేతలు

    మేడ్చల్: పోచారం మున్సిపాలిటీ, కొర్రెముల్ల రెవెన్యూ పరిధిలోని ఏకశిలా నగర్‌లో హైడ్రా అక్రమ నిర్మాణాలపై కూల్చివేతలు చేపట్టింది. సర్వే నంబర్లు 739 నుంచి 749లోని వెంచర్‌లో 7.16 ఎకరాల్లో నిర్మించిన అనధికార ప్రహరీ గోడను హైడ్రా గుర్తించింది. పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు . ఐదు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ ప్రాంతాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు.

  • చెరువులో వ్యర్థాలు పారబోసిన ట్యాంకర్‌ పట్టివేత

    మేడ్చల్‌: జిల్లాలోని సుతారిగూడ చెరువులో వ్యర్థాలను పారబోస్తూన ట్యాంకర్‌ను ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ట్యాంకర్‌ ఎక్కడి నుంచి వచ్చింది. ఏ పరిశ్రమ నుంచి తీసుకొచ్చారో వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పీసీబీ అధికారులు నమూనాలను సేకరించి ఫింగర్‌ ప్రింట్‌ పరీక్షకు ప్రయోగశాలకు పంపించారు. అనంతరం ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకొని జీడిమెట్లలోని ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (వ్యర్థాల శుద్ధి కేంద్రం)కు తరలించారు.

  • ఆరు గంటల్లోనే నిందితులు అరెస్టు

    HYD: గతంలో పనిచేసి మానేసిన సంస్థలోనే చోరీకి పాల్పడి పెద్ద మొత్తంలో నగదుతో పారిపోయేందుకు యత్నించిన వ్యక్తిని ఆరు గంటల వ్యవధిలోనే బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేట పాటిగడ్డలోని సన్‌ ఐనక్స్‌ స్టీల్స్‌ సంస్థలో రూ.46.4లక్షల నగదు చోరీ జరిగింది.దీనిపై ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన ఇన్‌స్పెక్టర్‌ ప్రసాదరావు, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి నిందితుని పట్టుకున్నారు.

  • నేడు విద్యుత్‌లో సరఫరాలో అంతరాయం

    HYD: ఖైరతాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్కైలేన్ అపార్టుమెంట్స్, తిరుమల అపార్టుమెంట్, అవంతినగర్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా ఉండదన్నారు. హిమాయత్‌నగర్ టీటీడీ మెయిన్ రోడ్ ఏరియా, లిబర్టీ రోడ్, హిమాయత్ నగర్ మెయిన్ రోడ్, ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు.

  • HYDలో బోనాలు.. పూనకాలు లోడింగ్!

    HYD: ఆషాడ మాసం వచ్చిందంటే భాగ్యనగరంలో బోనాల సందడి మొదలవుతుంది. నెలరోజుల పాటు ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతుంది. పోతురాజుల విన్యాసాలు, ఆడపడుచులు అలంకరించే బోనాలు, తొట్టెల ఊరేగింపు, డప్పుచప్పుళ్ల మధ్య ఈ పండుగ ఎంతో కోలాహలంగా సాగుతుంది.  గోల్కొండ కోటలోని శ్రీజగదాంబిక అమ్మవారికి ఈ గురువారం తొలిబోనంతో సంబరం మొదలుకానుంది.

     

     

  • రూ.5 లక్షల విలువైన నకిలీ కరెన్సీ స్వాధీనం

    మేడ్చల్: బాచుపల్లి పోలీసులు రూ.5లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఏపీ ప.గో జిల్లా చేబ్రోలుకు చెందిన ప్రేమ్‌చంద్‌(28)కు పుణెకు చెందిన రాకేశ్‌తో పరిచయం ఏర్పడింది. ప్రైవేటు బస్సులో పుణె నుంచి ఆహారపదార్థాల పేరిట పార్సిల్‌ తీసుకుని నిజాంపేటలో తానుచెప్పిన వ్యక్తికి ఇస్తే రూ.3లక్షలు ఇస్తానన్నాడు.సమాచారం అందుకున్న పోలీసులు అతడిని పట్టుకొని తనిఖీ చేయగా నకిలీ కరెన్సీ దొరికింది.