Locations: Hyderabad

  • నవవధువు ఆత్మహత్య

    HYD: రెండు నెలల కిందట ఒక్కటైన జంట కాపురంలో అనుమానం, భర్త వేధింపులు తట్టుకోలేక నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త శ్రీనివాస్‌‌తో భార్య పూజిత(19) కేపీహెచ్‌బీ బస్టాప్‌ సమీపంలో నివాసం ఉంటున్నారు. రాత్రి శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లేసరికి పూజిత ఉరివేసుకొని కనిపించడంతో కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు శ్రీనివాస్, అతడి కుటుంబసభ్యులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

  • రోడ్లపై ఈ గీతలకు అర్థం తెలుసా?

    HYD: రాచకొండ పోలీసులు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పిస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా ట్విట్టర్(X) వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. రోడ్డు మధ్య తెల్లని గీత మధ్యలో ఖాళీలుంటే ఓవర్‌ టేక్‌, లేన్‌ మారొచ్చు. తెల్లగీతలు కంటిన్యూగా ఉంటే ఎమర్జెన్సీలో ఓవర్‌ టేక్‌ చేయొచ్చు. పసుపు రంగుగీతలు ఉంటే ఓవర్‌ టేకింగ్‌ పూర్తిగా నిషేదం అని వివరించారు.

  • మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

    HYD : వచ్చే ఎన్నికల్లోపు హైదరాబాద్‌ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి కనీసం 50 శాతం పనులైనా పూర్తి చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మెట్రో రెండో దశ పనులను పార్ట్‌-A, పార్ట్‌-B కింద 8 కారిడార్లను ప్రతిపాదించి రూ.43,848 కోట్లు నిధులు కేటాయించారు. మొత్తం రూ.43,848 కోట్లలో 48శాతం అంటే రూ.21,047.04 కోట్ల ను అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాలుగా సేకరించనున్నారు.

     

  • సర్కారు పథకాలు.. సైబర్‌ ఎత్తులు

    TG: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలనూ సైబర్‌ నేరగాళ్లు వదలడం లేదు. రైతు భరోసా, ప్రధానమంత్రి ముద్రా యోజన ఇలా ప్రజలు తరచూ చర్చించుకునే పథకాల పేరుతో మోసపూరిత లింకులు, ఏపీకే ఫైళ్లు పంపించి డబ్బులు కొట్టేస్తున్నారు.   ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే లింకుల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

     

  • సికింద్రాబాద్‌లో సంకల్ప సభ

    HYD: సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో భారతీయ జనతా పార్టీ 11 ఏళ్ల సుపరిపాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి, దౌత్య రంగంలో సాధించిన విజయాలను మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిని ప్రదర్శించే సంకల్ప సభ జరిగింది. GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు మునగల హరీష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • కాలుష్య కాసారంలా హుస్సేన్‌సాగర్‌

    హుస్సేన్‌సాగర్‌లో నిత్యం సుమారు 450 ఎంఎల్‌డీలకు పైగా వ్యర్థజలాలు నేరుగా కలుస్తున్నాయి. దీంతో నీటిలో కరిగిన ఆక్సిజన్‌ పరిమాణం తగ్గుతోంది. డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌ (డీవో) పరిమాణం 4 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉండాలని, బీవోడీ (బయోలాజికల్‌ ఆక్సీజన్‌ డిమాండ్‌) 3 మిల్లీగ్రాములకు మించరాదంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సూచిస్తుండగా అనేక చోట్ల పరిమితులకు మించి నమోదవుతోంది. హుస్సేన్‌సాగర్‌‌లోని లీటర్‌ నీటిలో డీవో 0.3 మిల్లీగ్రాములు, బీవోడి 10 మిల్లీగ్రాములుగా ఉంది.

     

  • 5 కిలోల గంజాయి స్వాధీనం

    మేడ్చల్: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కెట్ వెనుక వైపు పోలీసులు వాహన తనిఖీల చేయగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుంచి 5కిలోల గంజాయి స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

  • మహిళ మెడలో గొలుసు చోరీ

    మేడ్చల్: కుషాయిగూడ స్టేషన్ పరిధిలో మహిళ మెడలో గొలుసు అపహరించిన ఘటన చోటు చేసుకుంది. ఆమె ఇంటి నుంచి అనుపురం ఫంక్షన్ హాల్ వైపు వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వెనక నుంచి వచ్చి గొలుసు లాక్కొని పరారయ్యాడు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

  • గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

    మేడ్చల్: బీహర్ నుంచి గంజాయిని తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోచారం ఐటీ కారిడార్ పోలీసులు అరెస్టు చేశారు. పోచారం ఐటీసీ పీఎస్ పరిధి చౌదరిగూడలోని స్వర్ణగిరి కాలనీలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో కుమార్ మండల్ అనే వ్యక్తిని అరెస్టుచేశారు. నిందితుడి వద్ద నుంచి 870గ్రాముల డ్రైగంజాయి,రెండు ఓసీబీ పేపర్‌బాక్సులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ బి.రాజువర్మ తెలిపారు.
  • అక్రమార్కులపై ACB దూకుడు

    HYD: రాష్ట్రంలో అక్రమార్కులపై అవినీతి నిరోధకశాఖ(ACB) దూకుడు కొనసాగిస్తోంది. గత ఏడాది మొత్తంలో 129 ట్రాప్‌ కేసులు నమోదు చేస్తే ఈ ఏడాది ఆరు నెలలు పూర్తికాకముందే ఈ సంఖ్య 122కు చేరుకోవడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో సగటున ప్రతి మూడు రోజులకు రెండు కేసుల చొప్పున నమోదవుతున్నా లంచావతారులు ఏమాత్రం జంకకపోవడం గమనార్హం.