Locations: Hyderabad

  • భారీ చోరీ.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు

    HYD: బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. పాటిగడ్డలోని సన్ స్టీల్ దుకాణంలో శుక్రవారం రాత్రి రూ.46లక్షల చోరీ జరిగింది. 50 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడు మధ్యప్రదేశ్‌కు చెందిన గిరిదారి సింగ్ గుర్తించారు. మహారాష్ట్ర బార్డర్‌లో నిందితుడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.46లక్షల నగదను స్వాధీనం చేసుకున్నారు.

  • చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో స్వల్ప అగ్ని ప్రమాదం

    హైదరాబాద్‌: చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. త్యాగరాయ గానసభ ఒకటో అంతస్థులోని కళామారుతీ హాలులో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఆ సమయంలో హాలులో కళాకారులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

  • సంకల్ప సభకు బీజేపీ నేతలు

    మేడ్చల్: సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరిగిన వికసిత్ భారత్ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో సూర్యారం 129 డివిజన్ నుంచి అధ్యక్షుడు కేశవ్ యాదవ్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఉషోదయ టవర్స్ నుంచి బయలుదేరారు. జిల్లా ఉపాధ్యక్షుడు బక్క శంకర్ రెడ్డి, నాయకులు తిరుపతి, దాసు, ప్రశాంత్ రెడ్డి, జాల వెంకటేష్, సరోజ, సిద్ధార్థ, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
  • ’42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే’

    మేడ్చల్: కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ డిమాండ్ చేశారు. ఆదివారం మేడ్చల్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. బీసీలకు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.
  • సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవం

    మేడ్చల్: మేడ్చల్‌లోని రాజబొల్లారం గ్రామంలో శ్రీ సీతారామచంద్రుల ఆలయ 4వ వార్షికోత్సవ సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. బాలగిరి రాజయ్య, సావిత్రమ్మ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భాస్కర్ యాదవ్, గోపని వెంకటేష్, గ్రామ ప్రజలు, భక్తులు ఈ వైభవంలో పాల్గొన్నారు.
  • బాధితుడికి పరామర్శ

    HYD: యూసఫ్‌గూడ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బాబి తల్లి భాగ్యలక్ష్మి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. మాగంటి గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్ ఆమె భౌతిక దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. భాగ్యలక్ష్మి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన వజ్రనాథ్, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
  • కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

    మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం కైసర్ నగర్‌లో యువకులు బి. శేఖర్, బి. రాజు, వారి మిత్రులు సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గంగుల అంజలి యాదవ్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, బోయిని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
  • భారీగా గంజాయి పట్టివేత

    HYD: నాంపల్లి మంగర బస్తీలో గంజాయి అమ్మకాల సమాచారంతో STF బృందం దాడులు నిర్వహించి 1.138 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. కాంబ్లీ అరుణ్‌ను అరెస్ట్ చేయగా, సాకేత్ రాజు, ఖలీద్ పరారీలో ఉన్నారు. కేసు నమోదై, నిందితుడిని నాంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. STF టీమ్ లీడర్ నంద్యాల అంజిరెడ్డి వివరాలు వెల్లడించారు.
  • దొంగ నోట్ల కలకలం..

    మేడ్చల్: బాచుపల్లి పీఎస్ పరిధిలో నకిలీ కరెన్సీ కలకలం. ఏపీకి చెందిన ప్రత్తిపాటి ప్రేమచందును నిజాంపేట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లు చలామణి చేస్తుండగా, అతని నుంచి రూ.15 లక్షల రూపాయల 500 నోట్లు, రెడ్‌మి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పూణేకి చెందిన రాకేష్ నకిలీ కరెన్సీ సరఫరా చేసినట్లు విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసి, నిందితుని రిమాండ్‌కు తరలించారు.
  • ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

    మేడ్చల్: తూంకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయాంజాల్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి జిల్లా రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి భూమిపూజ చేశారు. మాజీ ఉప సర్పంచ్ తిరుపతి శంకర్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎల్లెంకి భారతి తదితరులు పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని, పేదల సంక్షేమమే రాష్ట్ర ధ్యేయమని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.