Locations: Hyderabad

  • బసవతారకం ఆసుపత్రికి ఎంతో మంది సహకరించారు: బాలకృష్ణ

    TG: హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో సిల్వర్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఛైర్మన్‌  బాలకృష్ణ పైలాన్‌ను ఆవిష్కరించారు. తన తల్లి బసవతారకం కోరిక మేరకు ఈ క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మాణం జరిగిందని ఆయన తెలిపారు. క్యాన్సర్‌ పేషెంట్స్‌కు అండగా ఉండడం కోసం ఎంతో మంది దాతలు ఆసుపత్రికి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు.

     

  • సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని శ్రీ చిత్తారమ్మ దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున  వారికి చెక్కులు పంపిణి చేశారు. అనంతరం నియోజకవర్గం ప్రజల నుంచి వచ్చిన పలు ఆహ్వానాలు, వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు.
  • పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు

    మేడ్చల్: ప్రధాని మోడీ 11 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరిస్తూ ఇంపీరియల్ గార్డెన్‌లో నిర్వహించిన “11 ఏళ్ల సుపరిపాలన” చిత్ర పాట ప్రదర్శన, సభను మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విజయవంతం చేశారు. ఓల్డ్ బోయిన్‌పల్లి బీజేపీ సీనియర్ నాయకుడు తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాషాయ శ్రేణులు తరలివచ్చి, మోడీ, ఈటలకు అనుకూలంగా నినాదాలు చేశారు.

  • తగ్గిన బంగారం ధరలు

    దేశంలో బంగారం ధరలు తగ్గాయి. శనివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.1,02,980 ఉండగా.. ఆదివారం నాటికి రూ.882 తగ్గి రూ.1,02,098కు చేరుకుంది. హైదరాబాద్​లో 10 గ్రాముల​ బంగారం ధర రూ.1,02,098గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.1,02,098గా ఉంది. కిలో వెండి ధర రూ.1,09,815గా ఉంది. ఇక శనివారం కిలో వెండి ధర రూ.1,09,815 ఉండగా, ఆదివారం కూడా రూ.1,09,815గానే ఉంది.

  • తగ్గిన చికెన్ ధరలు

    HYD: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కిలోపై రూ.20-30 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కేజీ చికెన్ రూ.210 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.200, రాజమండ్రిలో రూ.220 ధరకు అమ్ముతున్నారు. డిమాండ్‌ను బట్టి పలు ప్రాంతాల్లో రూ.260 వరకూ విక్రయిస్తున్నారు.

  • శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెండు గంటలుగా నిలిచిపోయిన విమానం

    HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బ్రిటిష్ ఎయిర్ సర్వీస్ విమానం రెండు గంటలుగా నిలిచిపోయింది. ఆ విమానం హైదరాబాద్ నుంచి మిడిల్ ఈస్ట్ గగనతలం మీదుగా లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే ఇరాన్‌పై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో అధికారులు ఆ విమానానికి ఇంకా అనుమతి ఇవ్వలేదు. ప్రయాణికులు మాత్రం విమానంలో కూర్చుని ఉన్నారు.

  • శానిటేషన్ వర్కర్స్‌కు చీరలు, బట్టలు పంపిణీ

    మేడ్చల్: నాగారం మున్సిపల్ 16వ వార్డు నేతాజీ నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్స్‌కు చీరలు, బట్టలు పంపిణీ చేశారు. నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఛైర్మన్ కౌకుట్ల చంద్ర రెడ్డి పాల్గొని పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో  మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, కేశవరెడ్డి, తదితరులు హాజరయ్యారు.
  • మోజమ్ జాహీ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం

    TG: హైదరాబాద్‌లోని రద్దీగా ఉండే మోజమ్ జాహీ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

     

  • 27న జగన్నాథ రథయాత్ర

    మేడ్చల్: ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 27న కుత్బుల్లాపూర్‌లో జగన్నాధ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాలను రథాలపై ఊరేగిస్తారు. ఈ రథయాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాలని కమిటీ సభ్యులు తెలిపారు.

  • కార్లతో డేంజర్స్ స్టంట్‌లు

    TG: హైదరాబాద్‌లో నిన్న రాత్రి కొంతమంది యువకులు వీరంగం సృష్టించారు. హైటెక్ సిటీలో కొందరు లగ్జరీ కార్లతో హల్‌చల్ చేశారు. అతివేగంతో డ్రైవింగ్ చేస్తూ,  ప్రమాదకర విన్యాసాలు చేశారు. ఈ క్రమంలో ఒక కారు అదుపుతప్పి రెండు పార్కింగ్ కార్లను ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.