Locations: Hyderabad

  • ‘నిజాయితీగా విధులు నిర్వహించాలి’

    మేడ్చల్: పోలీసు వ్యవస్థకు వన్నె తెచ్చేలా విధులు నిర్వహించాలని శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లకు ఐజీ రమేశ్‌ సూచించారు. మేడ్చల్ పోలీస్ శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 82 మంది కానిస్టేబుళ్లకు పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో ఐజీ రమేశ్‌ పాల్గొని మాట్లాడుతూ.. నిజాయితీగా విధులు నిర్వహించి, బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.

  • చోరీ కేసులో నిందితుల అరెస్టు

    HYD: బేగంపేట్ పీఎస్ పరిధిలోని సన్ స్టిల్ దుకాణంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేదించారు. సీసీ ఫుటేజ్ దృశ్యాలు, దుకాణంలోని సిబ్బంది చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడు మధ్యప్రదేశ్‌కు చెందిన గిరిదారి సింగ్‌గా గుర్తించారు.డీసీపీ సాధన రేష్మి పెరిమల్ ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ఆదేశాలతో ఇన్స్‌పెక్టర్‌ ఆధ్వర్యంలో బేగంపేట్ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాడి నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  • తండ్రి మందలించాడని.. ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య!

    HYD: బాలాపూర్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద అమ్మాయి(17) ఓ యువకుడిని ప్రేమించి వెళ్లిపోయింది. పంచాయతీలో పెట్టించిన తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. చదువుకోకుండా ఇవే పనులంటూ తండ్రి ఆమెతోపాటు మరో కూతురు(15)ను మందలించాడు. దీంతో వారిద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వారి స్వగ్రామం నెల్లూరు జిల్లా ఉదయగిరి.

  • స్కూల్‌లో యోగా కార్యక్రమం

    మేడ్చల్: ఉప్పల్‌ పరిధిలో నాచారంలోని అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ప్రముఖ యోగా మాస్టర్స్ శ్రీపూజిత, సాయికుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల డైరెక్టర్ శివ్ కుమార్, కరస్పాండెంట్ కల్పన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

  • ముగ్గరు బైక్ దొంగలు అరెస్ట్.. 13బైకులు స్వాధీనం

    HYD: బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురు బైకు దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి చోరీకి గురైన పదమూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిమ్మతి శ్రీకాంత్(32), నవీన్(22) నగరంలోని ప్రాంతాల్లో ఇద్దరూ నిరంతరం బైక్‌లను చోరీ చేస్తున్నారు. మూడవ నిందితుడు షేక్ కలీమ్‌కు ఈ బైకులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.

  • బేగంపేటలో భారీ చోరీ

    HYD: బేగంపేట పరిధిలోని సన్‌ స్టీల్‌ దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణంలోని లాకర్‌లో ఉన్న రూ.48లక్షలు ఎత్తుకెళ్లారని యజమాని గిరీశ్‌జైన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

  • “ఆరోగ్యానికి యోగా” అనే అంశంపై ఉపన్యాసం

    మేడ్చల్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మల్లా రెడ్డి విశ్వవిద్యాపీఠ్‌లో జూన్ 21 ఉదయం ఉత్సాహభరిత యోగా సెషన్ నిర్వహించారు. ఆసనాలు, శ్వాసాప్రమాణ వ్యాయామాలు, ధ్యానం వంటి యోగా అంశాలతో కూడిన కార్యక్రమం సానుకూల శక్తిని ప్రసరింపజేసింది. “ఆరోగ్యానికి యోగా” అనే అంశంపై నిపుణులు ఉపన్యాసం ఇచ్చి, యోగా శాస్త్రీయ లాభాలను వివరించారు.

  • చర్లపల్లి కేంద్ర కారాగారంలో యోగా కార్యక్రమం

    మేడ్చల్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చర్లపల్లి కేంద్ర కారాగారంలో జరిగిన ఖైదీలు, అధికారులు, సిబ్బందితో జరిగిన యోగా కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ  సౌమ్య మిశ్రా ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది శిక్ష ఖైదీలు ,150 మంది జైలు సిబ్బంది పాల్గొన్నారు.

  • అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కుటుంబానికి ఆర్థిక సాయం

    మేడ్చల్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆలేరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నర్సింగ రావు కుటుంబ సభ్యులకు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ నేరెడ్మెట్ కార్యాలయంలో భద్రత చెక్కులు అందజేశారు. నర్సింగ రావు భార్య విజయలక్ష్మీ, కుమార్తె వరలక్ష్మికి చెక్కులను అందించారు.

  • త్వరలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు

    HYD: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లోని ఎన్‌బీటీ నగర్‌లో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయనున్నామని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తెలిపారు. ఎన్‌బీటీనగర్‌ ప్రభుత్వ పాఠశాలలో రూ.1.16 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాన్ని మేయర్‌ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కొత్తగా నిర్మించిన భవనంలో అదనపు తరగతి గదులతో పాటు లైబ్రరీ, సైన్స్‌లాబ్‌, డైనింగ్‌హాల్‌ ఏర్పాటు చేశామన్నారు.