Locations: Hyderabad

  • జయశంకర్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తా

    మేడ్చల్: ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు జేఏసీ వెంకన్న, మురుగేష్, ఉపేందర్, నర్సింగ్, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.

     

     

  • సీసీ రోడ్డు ప్రారంభం

    మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 23వ డివిజన్‌లోని శ్రీ లక్ష్మి లేఔట్‌లో సీసీ రోడ్డు పాడైపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతనెలలో వారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డిని సంప్రదించగా, ఆయన మున్సిపల్ కార్పొరేషన్ నిధుల ద్వారా సీసీరోడ్డు నిర్మాణాన్ని మంజూరు చేయించారు. ఈ రోజు హన్మంత్ రెడ్డి రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. 
  • సీసీ రోడ్, వీధి దీపాల శంకుస్థాపన

    మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 2వ డివిజన్‌లో సీసీ రోడ్డు, వీధి దీపాలు, ఇతర అభివృద్ధి పనుల లేమితో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డిని సంప్రదించగా, ఆయన మున్సిపల్ కార్పొరేషన్ నిధుల ద్వారా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించారు. ఈరోజు ఆయన పాల్గొని ఈ పనులకు శంకుస్థాపన చేశారు.
  • నగరంలో బదిలీల పర్వం

    HYD: నగరంలో పలువురు ఏసీపీలు, సెక్షన్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. వారికి పోస్టింగ్స్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

     

  • అన్యాయంపై ప్రజలకు అవగాహన

    HYD: ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రజలకు అవగాహన కల్పించి, తుది శ్వాస వరకు తెలంగాణ సాధన కోసం పోరాడిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు.
  • ప్లేస్కూల్‌లో చిన్నారుల యోగాసనాలు

    HYD: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్‌లోని ప్లేస్కూల్‌లో చిన్నారులు యోగాసనాలు వేశారు. ప్రధానోపాధ్యాయులు జె. శారదా విజయకుమార్, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహిత ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు.

  • ‘విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి’

    మేడ్చల్: తెలంగాణ ప్రగతి సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, దివంగత కాంగ్రెస్ నాయకుడు పాండు ముదిరాజ్ పదవ వర్ధంతి సందర్భంగా ఫతేనగర్‌లోని హలోనీ భగత్‌సింగ్ పార్క్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు.
  • చెరువుల పరిశీలన

    మేడ్చల్: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ చర్లపల్లి జైలు పరిధిలోని 60 ఎకరాల చెరువును అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువు సుందరీకరణ కోసం దత్తత తీసుకున్న హైడ్రా సంస్థ, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రాకు శ్రీదేవి యాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
  • జడ్జిని కలిసిన కలెక్టర్

    మేడ్చల్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా హైకోర్టు ప్రిన్సిపల్ డిస్ట్రీక్ట్, సెషన్ జడ్జి ఎస్.ఎన్ శ్రీదేవిని, జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ మిక్కిలినేని మను చౌదరి కలిశారు. అల్వాల్‌లోని లయోలా కాలేజీలో సెషన్ జడ్జితోపాటు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి బి.తిరుపతి, 3వ అడిషనల్ డిస్ట్రీక్ట్ జడ్జి ఎం.వెంకటేశ్వరరావులను కూడా కలిశారు.

  • పిల్లలకు ఆర్థిక సాయం అందజేత

    HYD: హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఆంబోజి నరేందర్ యాదవ్ జన్మదిన వేడుకలను కర్మన్ ఘాట్‌లోని శ్రీ కీర్తన ఫౌండేషన్ అనాధాశ్రమం జరుపుకున్నారు. అనంతరం అనాధాశ్రమంలో చన్న పిల్లలు చదువుకోవడానికి స్టడీ మెటీరియల్,ఫ్రూట్స్,వాటర్ బాటిల్స్,  ఫౌండేషన్‌లో ఉన్న పిల్లలకు, మానసిక సమస్యలున్న ఉన్నవాళ్లు అందరికోసం రూ.6వేల ఆర్థిక సాయం భోజనం కోసం అందజేశారు.