HYD: హైకోర్టు ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి గూడలో అక్రమంగా నిర్మించిన మూడు, నాలుగు, ఐదు అంతస్థుల భవనాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన ఈ అంతస్థులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేయడంతో, జీహెచ్‌ఎంసీ వెంటనే సీజ్ ప్రక్రియను పూర్తి చేసింది. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
Locations: Hyderabad
-
మహిళ మెడలో మంగళసూత్రం చోరీ
మేడ్చల్: మేడ్చల్ పీఎస్ పరిధిలోని గిర్మాపూర్ గ్రామానికి చెందిన చాకలి సుశీల మెడలోని మంగళసూత్రం దొంగలు లాక్కెళ్లారు. సర్వీస్ రోడ్డు మీదుగా నడుస్తూ ధ్రువ కాలేజ్ వైపు వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఆగంతుకుడు ఆమె మెడ నుంచి పుస్తెలతాడు లాక్కుని ముందు ఉన్నా బైక్‌పై మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
HYDలో నకిలీ మందుల కలకలం
HYD: గ్రేటర్ హైదరాబాద్‌లో మెడికల్ షాపుల్లో నకిలీ మందులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. డాక్టర్లు అనవసర టెస్టులతో జేబులు గుల్ల చేస్తుండగా, మెడికల్ షాపులు నకిలీ మందులు అందజేస్తున్నాయి. దీంతో రోగాలు తగ్గక, రోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మందులనాణ్యత, గడువు తనిఖీలు నిర్లక్ష్యం చేస్తుండగా.. డ్రగ్‌కంట్రోల్ అధికారులు ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలతో లాలూచీపడి దాడులు మరిచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
-
‘సౌండ్ థెరపీ’తో లాభాలెన్నో!
పలు రకాల పాత్రల మీద శబ్దాలు చేస్తూ వాటి నుంచి వచ్చే ధ్వని ద్వారా ఉపశమనం, మానసిక ప్రశాంతత అందించడమే సౌండ్ థెరపీ. ప్రస్తుతం హైదరాబాద్‌లో సౌండ్ థెరపి ట్రెండింగ్‌లో ఉంది. చాలా మంది యాంగ్జైటీ, ఒత్తిడి నుంచి బయటపడటం కోసం సౌండ్ థెరపి వైపు అడుగులు వేస్తున్నారు.
-
నక్షత్ర తాబేళ్ల విక్రయానికి యత్నం.. వ్యక్తి అరెస్టు
HYD: రాయదుర్గం పరిధిలో నిషేధిత నక్షత్ర తాబేళ్లు విక్రయించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మణికొండ సాయిరాంనగర్‌లో న్యూ బ్లే స్టార్క్ అక్వేరియం నిర్వహించే చెరుకుల బాలస్వామి నక్షత్ర తాబేళ్లు అమ్మేందుకు సిద్ధంగా ఉంచారని సమాచారం అందడంతో ఎస్‌ఓటీ, రాయదుర్గం పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితుడి నుంచి నాలుగు నక్షత్ర తాబేళ్లు, రెండు రెడ్ ఇయర్డ్ స్లైడర్ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.
-
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు
మేడ్చల్: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రు నగర్ కమిటీ హాల్‌లో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్‌రావు పాల్గొని యోగాసనాలు చేసారు. ఈ కార్యక్రమానికి యోగా గురువు బొడ్డు రవీందర్ నేతృత్వం వహించగా, స్థానిక బీజేపీ నాయకులు బాలకృష్ణ గౌడ్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
-
మహిళకు 52ఏళ్ల వ్యక్తి వేధింపులు.. కేసు నమోదు
HYD: బేగంపేట శ్యాంలాల్ బిల్డింగ్స్‌కు చెందిన 26 ఏళ్ల మహిళను పనీశ్(52)అనే వ్యక్తి వేధించిన ఘటనలో బేగంపేట పోలీసులు కేసునమోదు చేశారు. 2023లో బ్యాంకు ఉద్యోగం కోల్పోయింది. దీంతో పనీశ్ అనే వ్యక్తి పరిచయమై, డబ్బు ఇచ్చి సహాయం చేసినట్లు నటించాడు.2024ఏప్రిల్ నుంచి వాట్సాప్‌లో అసభ్యసందేశాలతో కోరిక తీర్చాలని బెదిరించాడు. ఆమె బ్యాంకులో చెడు ప్రచారం చేయడంతో ఉద్యోగం కోల్పోయింది. పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.
-
కాప్రా సర్కిల్‌లో యోగా దినోత్సవం
మేడ్చల్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ జగన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. సానిటరీ సూపర్‌వైజర్ సుదర్శన్, జవాన్లు, ఎస్‌ఎఫ్‌ఏ, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. యోగాలో ప్రతిభ కనబరిచిన కరుణ, రాజు, నరేష్, మంజుల, రామ్‌లను శాలువాతో సత్కరించారు.
-
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్
TG: సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. ఆఆయనకు మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.
-
జయశంకర్ విగ్రహానికి నివాళర్పించిన నాయకులు
మేడ్చల్: మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని జయశంకర్ చౌరస్తాలో శనివారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధనకు జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్ సార్ సిద్ధాంతకర్త, మార్గదర్శి అని నాయకులు కొనియాడారు. ఆయన ఆశయాల మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో మల్లేష్ గౌడ్, ప్రవీణ్, కొండల్ రెడ్డి, సాయి, తదితరులు పాల్గొన్నారు.