Locations: Hyderabad

  • పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్యేల పరామర్శ

    మేడ్చల్: ఇటీవల స్వల్ప ప్రమాదానికి గురై హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

  • అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

    మేడ్చల్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని శ్రీ సాయి భవాని ఫంక్షన్ హాల్‌లో హత యోగ ఆశ్రమం స్థాపకులు శంకర్ చారి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ ఇంఛార్జి వజ్రేష్ యాదవ్, జవహర్ నగర్ నాయకులు పాల్గొన్నారు. యోగా శరీర దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసం అవసరమ వారు తెలిపారు.

  • మహంకాళి సీఐ వై.కే. ప్రసాద్, ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్

    HYD: సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ సీఐ వై.కే. ప్రసాద్, కానిస్టేబుల్స్ శ్యామ్, మహేష్‌లు హవాలా డబ్బుల విషయంలో 6 లక్షల రూపాయలు డిమాండ్ చేసి వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందించడంతో.. వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

  • సిట్ విచారణకు హాజరైన ప్రణీత్ రావు

    TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు నిందితుడు ప్రణీత్ రావు హాజరయ్యారు. ఇవాళ ఐదోసారి ప్రణీత్‌ రావును సిట్ అధికారులు ప్రశ్నింస్తున్నారు. ఈ కేసులో ప్రణీత్ రావు A2గా ఉన్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఫోన్లను ట్యాపింగ్ చేయడం, ఆధారాలు ధ్వంసం చేయడం తదితర అంశాలపై ప్రణీత్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు.

  • స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి

    మేడ్చల్: జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని ఆల్విన్ కాలనీ తులసి నగర్‌లో సైకిల్ తొక్కుతూ ప్రమాదవశాత్తు కిందపడిన 10 ఏళ్ల జయశిత్ చౌహాన్‌పై స్కూల్ బస్సు ఎక్కడంతో మృతి చెందాడు. గోకుల్ ఫ్లాట్స్‌కు చెందిన క్వాంటం లీప్ స్కూల్ బస్సుగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

     

  • ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్ అలెర్ట్

    HYD: నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్ మ్యాపింగ్‌తో ITMSను అనుసంధానించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్ జామ్ అయితే 3 కీ.మీ ముందే అలర్ట్ వస్తుంది. రోజూ వీధుల్లో 1600 కొత్త వాహనాలు చేరుతుండగా, నగరంలో వాహనాల సంఖ్య 91 లక్షలకు చేరింది. డ్రోన్లు, హైరేంజ్ కెమెరాలతో ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు. వర్షాకాలంలో ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

     

  • ‘బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు’

    HYD: 18 ఏళ్ల లోపు బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పోలీసులు హెచ్చరించారు. గతేడాది హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో 1,500 మందికి పైగా బాల కార్మికులకు విముక్తి కల్పించారు. బాల కార్మికులను గుర్తిస్తే 1098, 100, రాచకొండ-8712662111, సైబరాబాద్-9490617444, హైదరాబాద్-9490616555 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు

    HYD: బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 270 పెరిగి రూ.1,00,750కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 250 పెరిగి రూ.92,350 పలుకుతోంది. వెండిపై రూ.100 తగ్గి రూ.1,19,900గా ఉంది. దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలున్నాయి.

  • గోల్కొండ కోట నుంచి టూంబ్స్‌ వరకు రోప్‌వే..

    HYD: గోల్కొండ కోట నుంచి 1.5 కి.మీ దూరంలోని కుతుబ్‌షాహీ టూంబ్స్‌ వరకు రోప్‌వే ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. రోజూ 10వేల మంది, అందులో 3 వేలు విదేశీ పర్యాటకులు సందర్శిస్తున్న ఈప్రాంతాల మధ్య రాకపోకలను సులభతరం చేయడానికి, ఆకర్షణీయమైన కేబుల్‌కార్ ప్రయాణం అందించడానికి ఈ ప్రాజెక్టు రూపొందింది. సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కన్సల్టెన్సీ నియమించేందుకు త్వరలో బిడ్‌ల ఆహ్వాన నోటిఫికేషన్ విడుదల కానుంది.

  • ‘యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి’

    రంగారెడ్డి: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని VM హోమ్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. యోగా శరీర, మనస్సు శాంతికి అవసరమని, దీన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, బీజేపీ నాయకులు, స్థానికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.