రంగారెడ్డి: యాచారం మండలంలో ఈ నెల 11న 90 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన గ్యార శివ(23)ను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. 20 మంది అనుమానితులను విచారించిన పోలీసులు, బాధితురాలి వివరాలతో శివను గుర్తించారు. నగరంలో ప్రైవేటు ఉద్యోగి అయిన శివపై గతంలో కేసులు ఉన్నట్లు తెలిపి, అతన్ని రిమాండ్‌కు తరలించారు.
Locations: Hyderabad
-
శిథిలావస్థకు చేరిన ఉస్మానియా నర్సింగ్ హాస్టల్
HYD: ఉస్మానియా ఆసుపత్రిలోని నర్సింగ్ కళాశాల హాస్టల్ శిథిలావస్థకు చేరింది. 70 ఏళ్ల నాటి భవనాలు పెచ్చులూడి, పిచ్చి మొక్కలు మొలిచాయి. 180 జనరల్, 50 బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. పాత వైరింగ్, ఊడిపోయే కిటికీలు, డ్రైనేజీ దుర్గంధం, బొద్దింకలు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. స్టైఫండ్‌తో హాస్టల్ నడుస్తుండగా, ధర్నాలు, ఫిర్యాదులు పరిష్కారం కాకపోవడంతో కొత్త ఆసుపత్రి నిర్మాణం వరకు ప్రత్యామ్నాయ చర్యలు కోరుతున్నారు.
-
రాజ్‌భవన్ ముందు మహిళ ఆందోళన
HYD: రాజ్‌భవన్ వద్ద నాగమణి అనే మహిళ గవర్నర్‌ను కలవాలంటూ బైఠాయించి ఆందోళన చేసింది. సెక్యూరిటీ అడ్డుకోవడంతో కన్నీటి పర్యంతమైంది. ముంబైలో రూ.40లక్షల దొంగతనం జరిగిందని, ఫిర్యాదులు పట్టించుకోలేదని, బొల్లారం పోలీసులు కూడా స్వీకరించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పంజాగుట్ట పోలీసులు ఆమెను విచారణకు తరలించారు. మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు భావిస్తూ వివరాలు సేకరిస్తున్నారు.
-
HYDలో 1579 పార్కుల్లో యోగా క్లాసులు.
HYD: నగర పరిధిలో 1579 గ్రీన్ లంగ్స్ స్పేస్ పార్కులను యోగా కేంద్రాలుగానూ తీర్చిదిద్దినట్లుగా జీహెచ్ఎంసీ తెలిపింది. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రతి చోట యోగా చేసేందుకు తరలిరావాలని పిలుపునిచ్చింది. యోగా క్లాసులు సైతం జరుగుతాయని ఇందులో జాయిన్ అవ్వొచ్చని జీహెచ్ఎంసీ తెలిపింది.
-
నగరంలో మురుగు సమస్యలు..
HYD: నగరంలో మ్యాన్‌హోళ్ల శుభ్రత, మురుగు కాలువల పూడిక తొలగింపు జరుగుతున్నా.. హోటళ్లు, వాణిజ్య భవనాలు సిల్ట్ ఛాంబర్లు ఏర్పాటు చేయకపోవడంతో మురుగు ఓవర్‌ఫ్లో సమస్యలు పునరావృతమవుతున్నాయి.మలక్‌పేట, రియాసత్‌నగర్‌లో హోటళ్లు ఆహార వ్యర్థాలు, ప్లాస్టిక్, దుస్తులను మ్యాన్‌హోళ్లలో వేస్తున్నట్లు జలమండలి గుర్తించింది. సిల్ట్ ఛాంబర్లు లేని హోటళ్లపై రూ.10 వేల జరిమానా, మురుగు, తాగునీటి కనెక్షన్ల తొలగింపు, మూసివేత చర్యలకు జలమండలి సిద్ధమవుతోంది.
-
ఫుడ్ డెలివరీ యాప్‌ల పేరుతో సైబర్ మోసాలు
HYD: ఫుడ్ డెలివరీ యాప్‌ల వాడకం పెరుగుతుండడంతో సైబర్ మోసాలు కూడా పెరిగాయి. ఆర్డర్ రద్దు తర్వాత రీఫండ్ పేరుతో సైబర్ ముఠాలు డబ్బు కొట్టేస్తున్నాయి. ఫుడ్‌డెలివరీ యాప్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి, లింక్ క్లిక్ చేసి బ్యాంకు వివరాలు నమోదు చేయమని సూచిస్తారు. నేరగాళ్లు ఫోన్‌ను ఆధీనంలోకి తీసుకొని బ్యాంకు ఖాతాలుఖాళీ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు.
-
‘సమస్యల నుంచి విముక్తి పోరాటాలతోనే సాధ్యం’
HYD: సమస్యల నుంచి విముక్తి పోరాటాలతోనే సాధ్యమని సీపీఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 29న లాలపేట్ నఫీస్ ఫంక్షన్ హాల్‌లో జరిగే సీపీఐ 4వ మహాసభ కరపత్రాలను చిలకలగూడ, మైలర్ గడ్డ, ఆటో స్టాండ్ వద్ద ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు కొమురెల్లి బాబు, సోమయ్య, గౌస్, రవి, ఈరయ్య, బిక్షపతి, చందర్, తదితరులు పాల్గొన్నారు.
-
ఓల్డ్ బోయిన్‌పల్లిలో కార్పొరేటర్ పర్యటన
HYD: ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లోని అస్మత్ పెట్, పార్క్ విల్లా కాలనీ, అబ్రార్ నగర్‌లో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. డ్రైనేజ్, ఎలక్ట్రిక్ పోల్స్, స్ట్రీట్ లైట్లు, మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ డీఈ నిఖిల్, ఏఈ ఆశ, నాయకులు సయ్యద్ ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.
-
గంజాయి స్మగ్లింగ్.. రైల్వే ఉద్యోగితో సహా నలుగురు అరెస్ట్
HYD: రాచకొండ పోలీసుల ఎల్‌బీ.నగర్ ఎస్‌ఓటీ, మహేశ్వరం, హయత్‌నగర్ బృందాలు నిర్వహించిన దాడుల్లో మహారాష్ట్రకు చెందిన వికాస్ బాబన్‌సాల్వే, రంగనాథ్ యువరంజన్ సాద్వే, అమోల్ నారాయణ్ బోర్డే, రైల్వే ఉద్యోగి సాగర్ గంజనన్ ఖందేభరాద్‌లను అరెస్ట్ చేశారు.వారి నుంచి రూ.50లక్షల విలువైన 166కిలోల గంజాయి, కారు, 4 చరవాణులు, రూ.6,200స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. సరఫరాదారు మాలిక్ పరారీలో ఉన్నాడు.
-
గంజాయి స్మగ్లింగ్‌పై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు
మేడ్చల్: మేడ్చల్ పీఎస్ పరిధిలోని మునీరాబాద్ గ్రామంలో శివాజీ విగ్రహం సమీపంలో గంజాయి అమ్మకాలపై ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఒరిస్సా, బీహార్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.