HYD: కాకగూడ అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్లో పికెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో క్షయవ్యాధి (TB) నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. TB దగ్గు, తుమ్మడం ద్వారా వ్యాపిస్తుందని, ప్రపంచంలో నాలుగోవంతు జనాభా ఈ వ్యాధి బారిన పడుతున్నారని మెడికల్ ఆఫీసర్ డా.మన్నె విశాల్ రాజ్ తెలిపారు. సకాల చికిత్సతో వ్యాధిని నిర్మూలించవచ్చని, లక్షణాలు కనిపిస్తే పికెట్ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
Locations: Hyderabad
-
కొండాపూర్‌లో అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం
రంగారెడ్డి: హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో చిరక్ స్కూల్ సమీపంలోని బాబు కదిరి అపార్ట్‌మెంట్ ఎనిమిదో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేసేందుకు రెండు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
HYDలో పారిశుద్ధ్యం పనులు .. 24 గంటలు!
HYD : GHMC రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్‌తో HYDలో పలు ప్రాంతాల్లో 24 గంటలు పారిశుద్ధ్యం పనులు నిర్వహించనుంది. ఇందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, KBRపార్కు, పెద్దమ్మగుడి, జగన్నాథ టెంపుల్, అగ్రసేన్ విగ్రహం, NFCL నుంచి వీరించి హాస్పిటల్, కార్వాన్,గోషామహల్, చార్మినార్ ప్రాంతాలు ఉన్నాయి.
-
కల్యాణ్ జువెలర్స్ నూతన షోరూంను ప్రారంభించిన నాగార్జున
హైదరాబాద్: నగరంలోని సుచిత్ర సర్కిల్‌లో కల్యాణ్ జువెలరీ 7వ నూతన షోరూంను ప్రముఖ నటుడు నాగార్జున, నటి శ్రీలీల కలిసి ప్రారంభించారు. అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ ఫొటోలకు పోజులిస్తూ వారు సందడి చేశారు.
-
శంషాబాద్ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు
దుబాయ్ నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)కు రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI2204 లోపం కారణంగా రద్దు చెయ్యబడింది. ఈ విమానం దుబాయ్‌లోనే ల్యాండ్ చేయబడింది. విమానంలోని 92 మంది ప్రయాణికులను దుబాయ్ విమానాశ్రయ సిబ్బంది మరో విమానంలో పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
-
ఆదర్శ డివిజన్‌గా అడ్డగుట్ట
HYD: సమస్యల రహితంగా అడ్డగుట్టను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం శాస్త్రీ నగర్‌లో సీసీ రోడ్ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సహకారంతో డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని అన్నారు.
-
‘నిధులు మంజూరు చేయాలి’
HYD: వచ్చే నెల జరగనున్న ఆషాడ బోనాల జాతరను పురస్కరించుకొని సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆయా దేవాలయల వద్ద అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ తరఫున రూ.10కోట్లలను మంజూరు చేయాలని కోరుతూ జోనల్ కమీషనర్ రవి కిరణ్‌కు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన ప్రత్తిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలిచారు.
-
‘ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వంద శాతం పూర్తికావాలి’
మేడ్చల్: ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వంద శాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్లో కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు మంజూరైన 1,409 ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ను నెలాఖరు లోగా పూర్తి చేయాలన్నారు.
-
అలరించిన విద్యార్థులు
మేడ్చల్: మూసాపేట హెచ్‌పీ రోడ్డులోని సాయి సేవా సంఘం ఆహ్వానం మేరకు అనాధ పిల్లల ఆశ్రమంలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటలు, కళలు, వివిధ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ చిన్నారుల క్రమశిక్షణ అహుతులను విశేషంగా ఆకట్టుకుంది.
-
బేకరీస్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫోకస్
HYD: గ్రేటర్‌లో బేకరీస్‌పై GHMC ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు 57 బేకరీలను అధికారులు చెక్ చేశారు. 32 శాంపిల్స్‌ని సేకరించి నాచారంలోని ల్యాబ్‌కి పంపించిన్నట్టు ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ డిస్‌ప్లే చేయకుండా పెడుతున్నారని, ఇది రూల్స్‌కు విరుద్ధమన్నారు. స్వీట్లు, ఇతర వంటకాలను తయారు చేసే కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచటంతో వంటకాల తయారీకి నాణ్యమైన సరకులను వినియోగించాలని అధికారులు సూచించారు.