HYD: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ ఎగ్జిగ్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్‌ను మొదటి రోజు కస్టడీలో ఏసీబీ అధికారులు విచారించారు. నూనె శ్రీధర్ ఇంట్లో వందల కొద్ది డాక్యుమెంట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఎవరివని ఆరా తీస్తున్నారు. శ్రీధర్‌కు ఉన్నత అధికారులతో పాటు ఓ రాజకీయ నాయకుడి అండదండలు ఉన్నట్టు సమాచారం.
Locations: Hyderabad
-
రూ.1.16 కోట్లతో స్కూల్ భవనం.. రేపు ప్రారంభించనున్న మేయర్
HYD: బంజారాహిల్స్ రోడ్‌నెం12లోని ఎన్‌బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో రూ.1.16 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు గదులు ప్రారంభానికి సిద్దమయ్యాయి. రెండేళ్లక్రితం మన ఊరు మనబడి పథకం కింద ప్రారంభించిన ఈ భవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ మేయర్ చొరవతో ఎంపీ ల్యాడ్స్ నిధులు అందించారు. శనివారం పాఠశాల భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రారంభించనున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
-
అంతర్ రాష్ట్ర ముఠా అరెస్ట్
మేడ్చల్: రాచకొండ పోలీసులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. ఎస్ఓటీ, ఎల్బీనగర్ జోన్, హయత్‌నగర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హయత్ నగర్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. వికాస్, సాగర్ గజానన్, రంగనాథ్, అమోల్ నారాయణ్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి 166 కిలోల గంజాయి, ఒక క్రూయిజర్, 4ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
-
కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి
HYD: అర్హులందరికీ కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సీపీఎం సికింద్రాబాద్ నేత ఎం. అజయ్ బాబు డిమాండ్ చేశారు. మారేడుపల్లి మండల ఎమ్మార్వో భీమయ్య గౌడ్‌కు సీపీఎం నాయకులు వినతిపత్రం సమర్పించారు. దాదాపు 830మంది అర్హులైన వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు దరఖాస్తులు చేసుకుని, పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.
-
ఆరోగ్య కేంద్రం బోయబస్తీ కమ్యూనిటీ హాల్‌కు మార్పు
HYD: అడ్డగుట్ట ఆరోగ్య కేంద్రాన్ని తుకారం గేట్ బోయబస్తీలోని కమ్యూనిటీ హాల్‌కు మార్చుతున్నట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆరోగ్య కేంద్రం స్థలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అడ్డగుట్ట ప్రజలకు వైద్య సేవలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలికంగా ఆరోగ్య కేంద్రాన్ని బోయబస్తీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
-
వాటికి పెట్టే ఖర్చుతో మరో 14 ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు: ఎమ్మెల్యే
HYD: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు తీసేసి.. వాటిలోని పైపులను వాడుకోవాలని సూచించారు. ఆ మూడు ప్రాజెక్టులకు పెట్టే ఖర్చుకు బదులు ప్రాణహిత పూర్తి చేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. వీటికి మరమ్మతులు చేసే బదులు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో గోదావరిపై 14 చిన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు.
-
పోచమ్మ దేవాలయంలో డమ్మీ హెలికాప్టర్ దగ్ధం
రంగారెడ్డి: రాచకొండ కమిషనరేట్‌లోని మీర్పేట్ పీఎస్ పరిధిలో గుర్రం గూడాలోని పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో సినిమా షూటింగ్ కోసం ఏర్పాటుచేసిన డమ్మీ హెలికాప్టర్ దగ్ధమైంది. గుర్రం గూడాకు చెందిన శంకర్ కుమారుడు నాలుగు సంవత్సరాల క్రితం ఒక చిన్న సినిమా కోసం ఈ డమ్మీ హెలికాప్టర్‌ను ఏర్పాటుచేశారు. సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోవడంతో ఈ డమ్మీ హెలికాప్టర్‌ను దేవాలయం వెనుకఉన్న మైదానంలో ఉంచారు -
ఎల్బీ స్టేడియంలో యోగా కార్యక్రమం
HYD: ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50,000 మందికి పైగా ఉత్సాహంగా సందర్శించారు. బీజేపీ నాయకులు రవి, శ్రీనివాస్, నందు యాదవ్, నర్సింహా తదితరులు కూడా ఈ యోగ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
దుకాణం బోర్డు చించినందుకు జైలు శిక్ష
HYD: కలాసిగూడకు చెందిన మామిడేల ప్రకాష్, గోల్కొండ అఖిల్ అనే ఇద్దరు యువకులు జ్యువెలరీ దుకాణం నేమ్‌బోర్డు చించిన కేసులో న్యాయమూర్తి ఇద్దరికీ 2 రోజుల జైలు శిక్ష, రూ.1000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ పరశు రామ్ తెలిపారు.
-
ఉచిత పుస్తకాల పంపిణీ
HYD: మోండా డివిజన్, మార్కెట్ వీధిలోని పరోపకారిణి బాలికల హై స్కూల్‌లో కాంగ్రెస్ నాయకురాలు వైష్ణవి యాదవ్ ఏర్పాటు చేసిన ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు పిల్లలు, టీచర్లతో మాట్లాడి స్కూల్ పరిస్థితి విద్యార్దుల గురించి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని, స్కూల్‌కు, టీచర్లకు మంచి పేరు తీసుకురావాలని, తల్లిదండ్రులు గర్వపడేలా జీవితంలో ఎదగాలని పిల్లలకు చెప్పారు.