HYD: కంటోన్మెంట్ బోర్డ్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ బోర్డు మీటింగ్‌లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. కొత్త బోర్డు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న బ్రిగేడియర్ రాజీవ్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్‌బోర్డు అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కంటోన్మెంట్ ప్రాంతంలో నీటి సరఫరాకు సంబంధించి వాటర్‌బోర్డ్ సరఫరా చేసే 1 ఎంజీడీ అదనపు నీటిని నిలువ చేసుకునే సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.
Locations: Hyderabad
-
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
మేడ్చల్: ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ జిల్లా పరిషత్ హై స్కూల్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు ప్రథమశ్రేణి, ద్వితీయశ్రేణి, తృతీయశ్రేణి బ్యాడ్జ్‌లను, ప్లేట్లను పంపిణీ చేశారు.
-
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర సచివాలయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఆషాడమాస బోనాల పండుగకు నిధులు కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే నూతన దేవాలయాలకు కూడా నిధులు కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత పరుశురాంరెడ్డి, రాముయాదవ్ పాల్గొన్నారు.
-
మొదలైన వర్షం
TG: హైదరాబాద్‌లో వర్షం పడుతోంది. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లిహిల్స్, కూకట్ పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు పారుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది.
-
నగరంలో ‘వీ రీచ్’ హబ్ వేదిక
HYD: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఉన్న వ్యాపార సామర్థ్యాన్ని వెలికితీయడం, దానిని ప్రోత్సహించడమే లక్ష్యంగా నగరంలోని ‘వీ హబ్’ (ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్) మరో సరికొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా వ్యాపారం నిర్వహించాలనుకునే మహిళల స్టార్టప్ ప్రయాణానికి దోహదపడే ప్రీ–ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ‘వీ రీచ్’ హబ్ వేదికగా అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరి చందన పాల్గొన్నారు.
-
అశోక్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే
మేడ్చల్: చర్లపల్లి డివిజన్ పరిధిలోని మోడీ విస్టాలో ప్రధాన సమస్య వాటర్‌బిల్ అధికంగా వస్తుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం ఖైరతాబాద్‌లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో ఎండీ అశోక్‌రెడ్డిని కలిసి వివరించారు. వెంటనే స్పందించిన ఎండీ సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో BRS పార్టీ నేత మహేష్‌గౌడ్, మోడీ విస్టా మాజీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
‘దాతలు ముందుకు రావడం అభినందనీయం’
HYD: చదువుతో పాటు, ఆట పాటల్లో రాణించాలని, ఉన్నత స్థానాలను అధిరోహించాలని విద్యార్థులకు మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. నల్లగుట్ట ప్రభుత్వ బాలికల పాఠశాలలో పూర్వ విద్యార్థి స్వర్ణలత జ్ఞాపకార్ధం రూ.26లక్షలతో నిర్మించిన తరగతి గదులను ఆయన హాజరై ప్రారంభించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ బడుల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
-
కొత్త ట్రాఫిక్ రూల్స్.. డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ నియంత్రణ!
HYD: నగరంలో త్వరలో కొత్త ట్రాఫిక్ రూల్స్ రాబోతున్నాయి.. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. సిటీలో వాహనాల యావరేజ్ స్పీడ్ బాగా పెరిగింది, రోడ్లు మాత్రం అంతే ఉన్నాయన్నారు. అలాగే డ్రోన్ల ద్వారా ట్రాఫిక్‌ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం, ఎక్కడైతే ట్రాఫిక్‌కు ఇబ్బంది ఉంటదో.. అక్కడ డ్రోన్లను ఉపయోగిస్తామని తేల్చి చెప్పారు.
-
‘సమాజ సేవకు యువత ముందుకు రావాలి’
మేడ్చల్: సమాజ సేవకు యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నెరేడ్‌మెట్‌లోని ప్రభుత్వ మండల ప్రాథమిక స్కూల్లో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్, పెన్సిల్ కిట్లను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువకులు సమాజ సేవ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని యువత ముదుకువస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
-
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: సీవీ ఆనంద్
HYD: తిరుమలగిరి మిలిటరీ ఏరియాలో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురిలో ఇద్దరు మహిళలు, పురుషులు ఉన్నట్లు సమాచారం. మిలిటరీ ఏరియాలో అనుమానితుల కేసులో అన్ని కోణాలో దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. యాంటి సోషల్ ఎలిమెంట్స్‌తో సంబంధాలు ఉన్నాయా.. లేదా అమాయకులా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.