Locations: Hyderabad

  • ‘కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం’

    మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామనీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజుల రామారం డివిజన్ ఒక్షిత హిల్ వ్యూ కాలనీలో రూ. 60 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు వివేకానంద శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు.

     

  • స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం సమావేశం

    మేడ్చల్: JNTUHలో స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షలు పూర్తిచేసుకుని, మంచి ర్యాంకులు పొంది, ఎంసెట్, పీజీఈసెట్, పాలిసెట్,ఈసెట్, ఐసెట్‌ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల సందేహాల నివృత్తికి స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు.  అనంతరం హెల్ప్‌లైన్‌కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
  • అంతర్ రాష్ట్ర ముఠా అరెస్ట్.. నిందితుల్లో రైల్వే ఉద్యోగి

    మేడ్చల్: గంజాయి విక్రహిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్ చేసిన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులలో మహారాష్ట్ర రైల్వే ఉద్యోగి సాగర్ గజానన్ ఉన్నాడని పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.50 లక్షల విలువగలా 166కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

  • అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే సమీక్ష

    మేడ్చల్: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలాజీ నగర్ డివిజన్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా కాముని చెరువు సుందరీకరణ పనులను స్వయంగా పరిశీలించారు. కబ్జా అవుతున్న స్థలాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బతుకమ్మ కుంటలు కూడా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

  • ఆర్టీసీ నుంచి ఒక్క రోజు తీర్థయాత్ర

    మేడ్చల్: ఆర్టీసీ సంస్థ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందిస్తున్నదని కూకట్‌పల్లి డిపో మేనేజర్ హరి ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేదిన వివిధ తీర్థయాత్రల కోసం కూకట్‌పల్లి డిపో నుంచి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని, పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.300 రుసుము నిర్ణ యించినట్లు తెలిపారు.

  • ఓఆర్ఆర్ టోల్ లీజు.. ఏసీబీ డీజీకి ఫిర్యాదు

    HYD: ఓఆర్ఆర్ టోల్ లీజు విషయంలో జరిగిన అవినీతిపై ఏసీబీ డీజీకి బీసీ పోలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ.. గతంలో ఓ సారి ఫిర్యాదు చేశామని, కానీ పురోగతి లేకపోవడంతో ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేశామన్నారు. టోల్ లీజు అంశంలో కేటీఆర్‌కు అనధికారికంగా రూ.1000 కోట్లు ముడుపులు అందాయని ఆరోపించారు.

  • చైల్డ్ పోర్న్ చూసినా.. సెర్చ్ చేసినా జైలుకే: శిఖాగోయల్

    TG:ఆన్లైన్లో చిన్నారుల అశ్లీల వీడియోలు(చైల్డ్ పోర్న్) చూసినా.. ఆన్లైన్లో సర్క్యూలేట్ చేసినా.. జైలుకు వెళ్లక తప్పదని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు. ఈ నెల 18నుంచి TGCSB స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించింది. డార్క్ వెబ్‌పై ప్రత్యేక నిఘా పెట్టి.. చిన్నారుల అశ్లీల చిత్రాలు చూస్తున్న హైదరాబాద్, యాదగిరిగుట్ట, కరీంనగర్, జగిత్యాల, వరంగల్ జిల్లాలకు చెందిన 15మందిని బుధవారం అరెస్టు చేశారు.

     

  • భార్య.. పిల్లల దాడిలో భర్తకు తీవ్రగాయాలు

    రంగారెడ్డి: భార్యతో విభేదాల కారణంగా వేరుగా ఉంటున్న భర్తపై దాడి జరిగిన ఘటన నాగోల్‌ పీఎస్ పరిధిలో జరిగింది. రియల్‌‌ఎస్టేట్‌ వ్యాపారి సీహెచ్‌ రాములు(44)కు 22 ఏళ్ల కిందట విజయతో పెళ్లి కాగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.  భార్య విజయ మరికొందరితో కలిసి రాములు ఇంటికి వచ్చి హాకీ బ్యాట్లు, పెప్పర్‌‌స్ప్రేతో దాడి చేశారు. రాములు రెండుకాళ్లు, చేతులవేళ్లు విరిగినట్లు వైద్యులు తెలిపారు.

  • ‘రాజాసాబ్’ టీజర్ లీకేజీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మూవీ టీమ్

    HYD: ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ టీజర్ లీకేజీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మూవీ టీమ్ ఫిర్యాదు చేసింది. ఈనెల 16న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. అంతకంటే మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో టీజర్‌కు సంబంధించిన క్లిప్స్ వైరల్ అయ్యాయి. దీంతో బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ సినిమా డబ్బింగ్ ఇంఛార్జ్ వసంత్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • పారామౌంట్ కాలనీలో కార్డన్ సెర్చ్.. 28మంది విదేశీయులు అరెస్టు

    HYD: టోలిచౌకి పీఎస్  పరిధిలోని పారమాంట్ కాలనీలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ నిర్బంధ తనిఖీలు
    సరైన పత్రాలు చూపించని 28 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. 16 మంది వీసా కాలం పూర్తయినట్లు గుర్తించామని,  పత్రాలు సరిగా లేని 25 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.