TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఐదోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న 9 గంటల పాటు సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. తమ విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని అధికారులు అంటున్నారు. ఈ మేరకు ప్రభాకర్ రావుకు అరెస్ట్ నుంచి ఇచ్చిన మినహాయింపును రద్దు చేయాలని ఇావాళ సుప్రీంకోర్టులో సిట్ పిటిషన్ వేయనుంది.
Locations: Hyderabad
-
వాటర్ పైప్ లైన్స్ పెండింగ్ పనుల పై సమీక్ష
మేడ్చల్: చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ వాటర్ పైప్ లైన్స్ పెండింగ్ పనుల పై యుజీడీ, ఏఈ సందీప్‌తో సమీక్ష నిర్వహించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అలాగే కొన్ని కాలనీలలో వాటర్ బిల్స్ ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులపై వెంటనే వెంటనే పరీక్షించాలన కోరారు. -
150 నకిలీ ఆసుపత్రులు సీజ్..
HYD: నగరంలో లైసెన్డ్స్ ప్రైవేటు ఆస్పత్రులు 4వేలు ఉన్నాయి. కానీ వీధికో క్లినిక్ ఉందన్న ఫిర్యాదుతో ఆస్పత్రులపై మెడికల్ కౌన్సిల్ అధికారులు దాడిచేశారు. ఏడాదిలో 150 కేసులు నమోదు చేసి, కొన్నింటిని సీజ్ చేసి జిల్లా అధికారులకు అప్పగించారు. ఆ క్లినిక్‌లు మళ్లీ తెరుచుకోవడంతో జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. గతంలో వనస్థలిపురం, ఉప్పల్, మదీనాగూడలో నకిలీ డాక్టర్ల దాటికి పలువురు మరణించారు.
-
సైబర్ మోసం.. మహిళ నుంచి రూ.90,500 కొట్టేసిన నేరగాళ్లు
HYD: యూసుఫ్‌గూడలోని లక్ష్మీ నరసింహనగర్‌కు చెందిన ఉమాదేవిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించి రూ.90,500కాజేశారు. గుర్తుతెలియని నంబర్ నుంచి వచ్చిన కాల్‌లో ఖాతాలో రూ.20 వేలు వచ్చాయని నమ్మించి, సంక్షిప్త సందేశంతో ఆమెను మోసం చేశాడు. నాలుగు దఫాలుగా రూ.90,500 ఆన్‌లైన్‌లో పంపించుకున్నాడు. మోసపోయిన విషయాన్ని ఆమె కుమారుడు క్రాంతికుమార్‌కు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
తగ్గిన బంగారం, వెండి ధరలు
HYD: నేడు బంగారం ధరలు తగ్గాయి. నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 600 తగ్గి రూ.1,00,480కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 550 తగ్గి రూ. 292,100 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2000 తగ్గి రూ.1,20,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
-
ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగాడే: కిషన్‌రెడ్డి
HYD: ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంట్‌డౌన్ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగాడే. భారత్‌లో పుట్టిన యోగాను ప్రపంచ దేశాలు గుర్తించాయి. దేశ ప్రజలంతా గర్వించాల్సి విషయం ఇది. యోగా అందరి జీవితాల్లో భాగం కావాలి’’అని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
-
‘వికలాంగుల హక్కుల కోసం పోరాటం’
మేడ్చల్: వీహెచ్‌పీఎస్ వికలాంగుల హక్కుల కోసం రాజకీయ భాగస్వామ్యం, పెన్షన్ల కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. నాగోలు శుభం కన్వెన్షన్ హాల్‌లో పద్మశ్రీ గ్రహీతగా వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. పద్మశ్రీ అణచివేతకు గురైన వర్గాల కోసం బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.
-
కేశవనగర్‌లో విషాదం.. యువకుడు ఆత్మహత్య
HYD: హైదర్‌గూడాలోని కేశవ నగర్ కాలనీలో చంద్రశేఖర్ అనే యువకుడు హాల్‌లో ఫాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
బల్కంపేట ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళం
HYD: బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడల్లా బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ దేవస్థానానికి వచ్చినప్పుడు ఆలయ విశిష్టతను ఈవో ఆమెకు వివరించారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. దీంతో ఆమె రూ.కోటి విరాళాన్ని ఆలయ ఖాతాలో జమ చేశారు.
-
తక్కువ కాలంలో అధిక దిగుబడి
HYD: తెలంగాణ రైతులు తక్కువ పంట కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే సన్న వరి సాగుకు మొగ్గుచూపుతున్నారు. యాసంగి సీజన్‌లో 23లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం విక్రయించడం దీనికి నిదర్శనం.ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 115-125 రోజుల్లో దిగుబడి ఇచ్చే కొత్త సన్నవరి వంగడాలను అభివృద్ధి చేస్తోంది. ఆరు పరిశోధన కేంద్రాల ద్వారా తెలంగాణ వాతావరణానికి అనువైన విత్తనాలపై పరిశోధనలు సాగిస్తున్నారు.