HYD: జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్యక్రమాల పేరిట రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో స్పెషలైజ్డ్ శానిటేషన్ కోసం మరోసారి కోట్లు వెచ్చించేందుకు సిద్ధమవుతోంది. చార్మినార్, గోల్కొండ, బేగంపేట, బంజారాహిల్స్‌లో గతంలో ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, చార్మినార్ జోన్లలో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా పారిశుద్ధ్యం కోసం ఆర్‌ఎఫ్‌పీ ఆహ్వానించారు.మిగతా జోన్లలోనూ ఇదే విధానం అమలు చేయనున్నట్లు సమాచారం.
Locations: Hyderabad
-
కిషన్‌రెడ్డితో కలిసి యోగాసనాల్లో పాల్గొన్న తేజ, మీనాక్షి చౌదరి
HYD: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 24 గంటల కౌంటౌన్ వేడుకలు ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి కిషన్‌రెడ్డి యోగాసనాల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, నటుడు తేజ సజ్జ, నటి మీనాక్షి చౌదరితో కలిసి యోగా చేసి ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు.
-
కోడలిపై మామ కత్తితో దాడి..
HYD: జూబ్లీహిల్స్‌లో కోడలిపై సీనియర్ జూనియర్ ఆర్టిస్ట్ వెంకటేశ్వర రావు (68) కత్తితో దాడి చేశాడు. గాయపడిన కోడలిని కుటుంబం ఆస్పత్రిలో చేర్చగా.. తండ్రిని కాపాడేందుకు కొడుకు అరుణ్ ప్రసాద్ నేరం తనపై వేసుకున్నాడు. కోడలు భర్తతో గొడవలో గాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. భర్తను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వెంకటేశ్వర రావును రిమాండ్‌కు తరలించి సాక్ష్యాలు తారుమారు చేసిన అరుణ్‌పై కేసునమోదు చేశారు.
-
యోగా అంతిమ లక్ష్యం అదే: వెంకయ్య నాయుడు
TG: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘యోగా డే’ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే మన లక్ష్యం. యోగా అంతిమ లక్ష్యం మానవత్వం సాధించడం. యోగా అంటే మనస్సు, వృత్తి, ప్రవృత్తులను నిగ్రహించడం, ఇది చాలా ముఖ్యం’’ అని పేర్కొన్నారు.
-
నిరుపేద విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ
మేడ్చల్: కల్పతరువు విమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో, విశ్వహిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో సాయినాథపురంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 35 మంది నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ముఖ్యఅతిథిగా హాజరై, విద్యార్థులను ఉత్సాహపరిచారు. నిరుపేదలకు విద్యా సహాయం అందించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.
-
నేరెడ్‌మెట్‌లో కాటన్ సెర్చ్..
మేడ్చల్: నేరెడ్‌మెట్ పీఎస్ పరిధిలో నేరాల నియంత్రణలో భాగంగా వినాయక్ నగర్‌లో కాటన్ సెర్చ్ జరిగింది. డీసీపీ పద్మజా రెడ్డి, ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐ సందీప్ కుమార్ నేతృత్వంలో 140మంది సిబ్బంది 400 ఇళ్లలో తనిఖీలు చేశారు. 20 లీటర్ల మద్యం, గుట్కా ప్యాకెట్లు, గుర్తింపు పత్రాలు లేని 50 బైక్‌లు స్వాధీనం చేశారు. స్థానికుల సహకారంతో సమాజాన్ని భద్రంగా ఉంచగలమని డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు.
-
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరు అరెస్ట్
HYD: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన నసీమాబాను, సయ్యద్ ఆదిల్‌లను సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నసీమాబాను తార్నాకలో కన్సల్టెన్సీ నడిపి, నకిలీ వీసాలు, ఉద్యోగ పత్రాలతో హైదరాబాద్, నిజామాబాద్‌కు చెందినవారి నుంచి రూ.35లక్షలు వసూలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
-
హత్యాయత్నం కేసులో రౌడీషీటర్ రిమాండ్
HYD: కాచిగూడ రైల్వే పోలీసులు హత్యాయత్నం కేసులో రౌడీషీటర్ మహ్మద్ అబ్దుల్ సోహైల్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. యాకత్‌పుర రైల్వే స్టేషన్‌లో షేక్ ఖదీర్‌పై సోహైల్ అతని అనుచరులు డబ్బులు, సెల్‌ఫోన్ డిమాండ్ చేసి నిరాకరించడంతో కత్తితో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు. ముదస్సిర్, ఆయన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
-
నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం
మేడ్చల్: పోచారం మున్సిపాలిటీలో చెట్ల కటింగ్, నిర్వహణ పనుల కారణంగా 33/11 కేవీ నారపల్లి సబ్‌స్టేషన్‌కు చెందిన 11 కేవీ నారపల్లి ఇండస్ట్రియల్ ఫీడర్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుంది. వెంకటద్రి టౌన్‌షిప్, చౌదరిగుడా, విజయపురి, 11కేవీ ఎపీ మాంసం ఫీడర్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5వరకు మహాలక్ష్మిపురం, సప్తగిరి కాలనీ, తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని ఏఈ ప్రదీప్‌కుమార్ తెలిపారు.
-
పాఠశాల బస్సుల భద్రతపై సిటీ పోలీసుల నిఘా
HYD: విద్యా సంవత్సరం ప్రారంభంతో నగర సిటీ పోలీసులు పాఠశాలలపై ప్రత్యేక నిఘా పెట్టారు. రవీంద్రభారతిలో పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. స్కూల్ బస్సుల ఫిట్‌నెస్, అనుమతులు, డ్రైవర్ వివరాలు డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. గత మూడేళ్లలో అజాగ్రత్తతో 8మంది విద్యార్థులు మృతిచెందినట్లు గుర్తుచేసి, పిల్లలకు ఎలాంటి సమస్య ఎదురైనా యాజమాన్యాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు.