Locations: Hyderabad

  • పులి పిల్లలను దత్తత తీసుకున్న ఉపాసన

    HYD: నెహ్రూ జూపార్కులోని పులి పిల్లలను అపోలో ఆస్పత్రుల సీఎస్‌ఆర్‌ వైస్‌ ఛైర్మన్, యువర్‌లైఫ్‌ వ్యవస్థాపకురాలు కొణిదెల ఉపాసన దత్తత తీసుకున్నారు. కుమార్తె క్లింకారతో జూకు చేరిన ఉపాసన, జంతువుల ఎన్‌క్లోజర్లను వీక్షించి, జూపార్కు డైరెక్టర్‌ సునీల్‌ ఎస్‌.హిరేమత్‌తో సంప్రదించారు. పులిపిల్లల పోషణ కోసం ఆర్థిక సహాయం అందజేశారు. జంతువుల దత్తత పథకంలో కార్పొరేట్‌ సంస్థలు, జంతు ప్రేమికులు చేరుతున్నారని డైరెక్టర్‌ తెలిపారు.

  • రోడ్డు ప్రమాదాల నివారణపై జీహెచ్‌ఎంసీ దృష్టి

    HYD: నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల రక్షణ కోసం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌.వీ.కర్ణన్ ఇంజినీర్లకు కీలక ఆదేశాలిచ్చారు. ఐఆర్‌సీ ప్రమాణాలను 100% పాటించాలని లేదంటే.. క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. హైటెక్‌సిటీ, ఉప్పల్, కొండాపూర్‌లో గుర్తించిన సమస్యలు అశాస్త్రీయ రంబుల్ స్ట్రిప్స్, నాసిరకం సైనేజీ, పాడైన రోడ్డు మార్కింగ్‌లు, ఆక్రమణలు, నిర్లక్ష్యం ఇతర లోపాలతో రహదారులు ప్రమాదకరంగా మరుతున్నాయన్నారు.

  • దోస్త్‌ మూడో విడత రిజిస్ట్రేషన్‌, వెబ్‌ఆప్షన్ల గడువు పొడిగింపు

    HYD: డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ (దోస్త్‌) ద్వారా డిగ్రీ ప్రవేశాలు మూడు విడతలుగా జరుగనున్నాయి. మూడో విడత రిజిస్ట్రేషన్ల గడువును ఈనెల 25 వరకు పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. రిజిస్ట్రేషన్లు, ఆన్‌లైన్‌ వెబ్‌ ఆప్షన్లకు 25 వరకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు, కళాశాలల ప్రిన్సిపల్స్‌ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మండలి తెలిపింది.

  • హనీ ట్రాప్‌తో సైబర్ నేరాలు.. జాగ్రత్త

    HYD: సోషల్ మీడియాలో యువతి పేరుతో చాటింగ్, నగ్నవీడియో కాల్స్‌తో సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్‌ చేస్తున్నారు. యువతుల ఫొటోలు సేకరించి, నకిలీ ఖాతాలతో మాట్లాడి రికార్డు చేసిన వీడియోలతో బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా విశ్రాంత ఉపాధ్యాయుడి నుంచి రూ.38లక్షలు కొట్టారు. అశ్లీలవీడియోలు చూపిస్తూ మోసం చేస్తారని, యువతి పేరుతో వచ్చే సందేశాలు నమ్మొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

  • యువతి ఆత్మహత్య.. అత్తింటి వేధింపులే కారణం

    HYD: దుర్గంచెరువులో బీ.సుష్మ (27) మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఆరు నెలల క్రితం అమృత్‌తో వివాహమైన సుష్మ, భర్త, అత్త, మామ, మరిది నుంచి వేధింపులు ఎదుర్కొంది.బుధవారం రాత్రి ఆమె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం దుర్గంచెరువులో సుష్మ మృతదేహం లభించింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

  • యువతి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ ఎస్ఐ

    HYD: నగరంలోని సేఫ్ ఎక్స్‌ప్రెస్ కూడలి వద్ద వాహనం నుంచి యువతి పడిపోయింది. దీంతో బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ కే.దేవిదాస్ వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించి ప్రమాదం నుంచి కాపాడారు. ట్రాఫిక్ ఏసీపీ జీ.శంకర్ రాజు మాట్లాడుతూ.. ఉన్నతాధికారులు ఇచ్చిన CPR, ప్రాథమిక చికిత్స శిక్షణ సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. దేవిదాస్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

  • ఆరోగ్యశాఖ మంత్రితో తెలంగాణ జూనియర్ వైద్యుల భేటీ

    HYD: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో హైదరాబాద్‌లోని వారి నివాసంలో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (TJUDA) సమావేశమైంది. మంత్రి జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని TJUDA అధ్యక్షుడు డా.ఇసాక్ న్యూటన్ తెలిపారు. ఈసమావేశంలో హెల్త్ సెక్రటరీ డా. క్రిస్టినా జెడ్ చొంగ్తు, జుడా GS డా.అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

  • ORRపై రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

    రంగారెడ్డి: పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై టిప్పర్‌ను బైక్ ఢీకొట్టడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ రమావత్ మాన్ సింగ్(యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్) మృతి చెందారు. ట్రాఫిక్ విధులు ముగించుకుని హయత్‌నగర్‌లోని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. గర్భిణి మృతి

    HYD: కారుడ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఏడు నెలల గర్భిణి ఆస్ర ఫాతిమా (29) ప్రాణాలు కోల్పోయింది. అత్తాపూర్‌లో ద్విచక్రవాహనంపై భర్త, కుమార్తెతో ఇంటికి వస్తుండగా.. కారులోని డ్రైవర్ నిర్లక్ష్యంగా డోర్‌ తెరవడంతో ఫాతిమా, కుమార్తె కింద పడిపోయారు.ఈక్రమంలో ఫాతిమా మీదుగా ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో చక్రాల కింద పడి మృతిచెందగా..తన కుమార్తెను రెప్పపాటులో దూరంగానెట్టి ప్రాణాలు కాపాడారు. కారుడ్రైవర్‌ పరారయ్యాడు.పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

  • JNTU గర్ల్స్ హాస్టల్‌లోని భోజనంలో పురుగు

    TG: హాస్టల్‌లో ఓ విద్యార్థిని భోజనం చేస్తుండగా అందులో పురుగు కనిపించి కలకలం రేపింది. ఈఘటన గురువారం రాత్రి కూకట్‌పల్లి JNTUలోని బాలికల హాస్టల్‌లో చోటుచేసుకుంది. నాసిరకం భోజనం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భోజనంలో పురుగు రావడంతో ఇదేంటని హాస్టల్‌ మెనేజ్‌మెంట్‌ను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని స్టూడెంట్స్‌ వాపోయారు.  నాణ్యమైన ఆహారం వడ్డించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.