మేడ్చల్: రూట్ వాచ్‌లో భాగంగా అనుమానస్పదంగా కన్పించిన వ్యక్తిని తనిఖీ చేయగా గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి. ఈ ఘటన మేడ్చల్ ఎక్సైజ్ పీఎస్ పరిధిలోని అయోధ్య చౌరస్తా జరిగింది. ఈ ఘటనలో 5.170 కిలోల గంజాయి చాక్లెట్లు లభించాయి. విచారణలో యూపీకి చెందిన జయరామ్ మిశ్రా(33)గా గుర్తించారు. మిశ్రాను అరెస్ట్ చేసి, చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Locations: Hyderabad
-
రెండో పెళ్లికి సిద్ధమైన సాఫ్ట్‌వేర్ భర్త..
రంగారెడ్డి: తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట ప్ల కార్డుతో భార్య బైఠాయించిన ఘటన బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీధర్‌కుమార్ తన భార్య స్రవంతిని వదిలేసి రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. విషయం తెలిసిన భార్య స్రవంతి, తన తల్లితో కలిసి భర్త ఇంటిముందు ప్లేకార్డులతో బైఠాయించారు.
-
ఇంటర్నేషనల్ స్కూల్‌కు బాంబు బెదిరింపు
HYD: పటాన్‌చెరు సమీపంలోని గాడియం ఇంటర్నేషనల్ స్కూలుకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. మధ్యాహ్నం సమయంలో స్కూల్ ఆవరణలో బాంబు పెట్టినట్టు పాఠశాల యాజమాన్యానికి ఈ-మెయిల్ వచ్చినట్లు సమాచారం. అప్రమత్తమైన యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించగా.. బాంబు స్క్వాడ్‌లు స్కూల్‌కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. దాదాపు 3 గంటల తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.
-
సెల్ ఫోన్ దొంగల అరెస్ట్
HYD: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో గురువారం జీఆర్పీ ఇన్స్‌స్పెక్టర్ ఆర్. ఎల్లప్ప ఆధ్వర్యంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఇద్దరు సెల్ ఫోన్ దొంగలను అరెస్ట్ చేశారు. నిందితులు దాసరి మౌనిక (20), రంగారెడ్డి జిల్లా పోతుగల్‌కి చెందిన కూలీ సుక్కయ్య (35)ను అరెస్ట్ చేసి వారి నుంచి ఒక సెల్ పోన్, నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
-
పర్యాటక ప్రాంతంగా చర్లపల్లి చెరువు..
మేడ్చల్: చర్లపల్లి జైలు పరిధిలో ఉన్న చెరువుపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ఆహ్వానంమేరకు చర్లపల్లి చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. 58 ఎకరాల్లో ఉన్న చర్లపల్లి చెరువు ఆధునికీకరణపై చర్చించారు. చెరువులో నీరు పరిశుభ్రంగా ఉండటంతో జీవవైవిధ్యానికి అవకాశం లభిస్తుందని రంగనాథ్ ఆనందం వ్యక్తంచేశారు. చర్లపల్లి చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.
-
శానిటేషన్ డ్రైవ్‌ను ప్రారంభించిన కార్పొరేటర్
HYD: సీతఫల్‌మండి డివిజన్ సురేష్ థియేటర్ వద్ద శానిటేషన్ డ్రైవ్‌ను డీసీ సురేష్‌తో కలిసి కార్పొరేటర్ సామల హేమ గురువారం ప్రారంభించారు. మొదటగా సురేష్ థియేటర్, బీదల బస్తీ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులు శుబ్రపరిచారు. ఈ డ్రైవ్‌లో భాగంగా రోడ్ల మీద పేరుకుపోయిన చెత్త తొలగింపు, చెట్టు కొమ్మలు, మురుగు నీటి నిల్వలు తొలగింపు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం చేశారు.
-
‘పేదలకు ఎల్లప్పుడు సహకారం ఉంటుంది’
HYD: పేదల వైద్య సేవలకు ఎల్లప్పుడు తన సహకారం ఉంటుందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తెలిపారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న సికింద్రాబాద్‌కు చెందిన మైత్రి చేతన్ కార్తీక్‌కు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని సితాఫల్‌మండీలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం అందించారు.
-
నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
HYD: అడ్డగుట్ట డివిజన్ నార్త్ లాలాగూడలోని రైల్వే క్వార్టర్స్‌లోని పురాతన రామాలయ దేవాలయనికి నూతనంగా ఏర్పాటైన పాలక కమిటీ ప్రతినిధుల చేత గురువారం దేవాదాయ శాఖ ఇన్స్‌స్పెక్టర్ ఆండాలు, ఈఓ రవి కాంతుల ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవాలయ సలహాదారు ఆదం భరత్ కుమార్ హాజరై నూతన పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
-
అనారోగ్యంతో యువ వైద్యుడి మృతి
మేడ్చల్: అనారోగ్యంతో యువ వైద్యుడి మృతి చెందిన ఘటన మేడ్చల్ మున్సిపాలి పరిధిలో జరిగింది. పట్టణంలోని నర్సింగ్ రావు, యశోద దంపతుల కుమారుడు డాక్టర్ రాజ్‌కుమార్ గురువారం తెల్లవారుజామున రక్తపోటుతో అనారోగ్యానికి గురి కావడంతో స్థానికంగా ప్రథమ చికిత్స అందజేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సుచిత్రలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 8 గంటల ప్రాంతంలో మృతి చెందాడు.
-
‘నాణ్యమైన బోజనాన్ని అందించాలి’
మేడ్చల్: బాలాజీ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు గోగుల సరితతో కలిసి జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజన పథకం ద్వారా కలిగే లాభాలను వివరించారు. నాణ్యమైన బోజనాన్ని అందించాలన్నారు.