Locations: Hyderabad

  • ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    HYD: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో వేడుకలను రసూల్ పుర హెవెన్ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్, జిల్లా పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ పరిశీలకులు సిద్దేశ్వర్‌తో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి రాహుల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

  • ‘సీఎంఆర్‌ఎఫ్ పేదలకు సంజీవని’

    మేడ్చల్: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు సంజీవని లాంటిదని నర్సారెడ్డి భూపతిరెడ్డి తెలిపారు. ఈ నిధి ద్వారా ఎన్నో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీలోని బౌరంపేట్ గ్రామానికి చెందిన వెంకట్రామ్ శివ ప్రసాద్ రెడ్డి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • పైప్‌లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

    HYD: మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ గురుద్వారా వెనుక రూ.11 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన సివరేజ్ పైప్‌లైన్ పనులను ఎమ్మెల్యే శ్రీగణేష్, కార్పొరేటర్ కొంతం దీపికతో కలసి ప్రారంభించారు. ఏళ్లుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు పైప్ లైన్ నిర్మాణంతో తొలగిపోతుందని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

  • పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఫోకస్

    మేడ్చల్: పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధులకు దూరంగా ఉండొచ్చన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు రాబోయే వర్షా కాలంలో ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపై ఉప్పల్‌లో చేపట్టిన ముందస్తు వర్షాకాల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను ఆయ ప్రారంభించారు.

  • పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి

    HYD: కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆధ్వర్యంలో పార్టీ ‘ఏ’ బ్లాక్ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్ కుమార్, టీపీసీసీ జిల్లా పరిశీలకులు సిద్దేశ్వర్ హజరయ్యారు. పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు సూచనలు చేశారు.

  • అభివృద్ధి కార్యక్రమాలు

    మేడ్చల్: తెలంగాణ ప్రభుత్వ 100 రోజుల ప్రణాళికలో భాగంగా నాగారం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ సీడీఎమ్‌ఏ జ్యోష్న, మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 3వ వార్డులోని పార్క్‌లో బ్లాక్ ప్లాంటేషన్ మొక్కలు నాటారు. అదేవిధంగా కంపోస్ట్ తయారీ కేందాన్ని సందర్శించి అందులో నుంచి వేస్ట్‌వాటర్ పోవడానికి కాలువలాగా చేయాలని డీఈకి సూచనలు చేశారు.

  • హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌

    HYD: హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ వేడుకగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినీ నటి సీరత్‌ కపూర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు మోడల్స్‌, ఫ్యాషన్‌ లవర్స్‌ పాల్గొన్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్‌ జరగనుంది.

  • అభివృద్ధి పనుల పరిశీలన

    మేడ్చల్: సఫిల్‌గూడ లేక్ పార్క్‌లో దాదాపు రూ.40లక్షలతో చేపట్టిన పనులను మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ సందర్శించారు. అదే విధంగా చెరువులో గుర్రపు దెక్క పనులను ఆయన పరిశీలించారు. అధికారులు పనులను వేగవంతం చేయ్యాలని కోరారు. ఈ సందర్బంగా మినీ ట్యాంక్ బండ్‌పై ఎటువంటి విగ్రహాలు వద్దని అధికారులని కోరారు. ఈ కార్యక్రమంలో స్పైడర్ శ్రీనివాస్, నందు, మురళి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

  • ఫీజులను నియంత్రించాలి: ఎమ్మెల్యే

    మేడ్చల్: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజులలో రాయితీ ఇవ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఫీజులలో 50% వరకు రాయితీ ఇవ్వాలని ఆయన విద్యాసంస్థల యాజమాన్యాలను కోరారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో కార్మిక, పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉంటాయన్న విషయాన్నిదృష్టిలో ఉంచుకొని యాజమాన్యాలు ఫీజులలో రాయితీ ఇచ్చేలా చూడాలన్నారు.

  • మూసాపేట్‌లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    మేడ్చల్: రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా మూసాపేట్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్ బండి రమేష్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, జ్యోతి, రమణ, శ్రావణ్, కామినేని వాసు, నాగమణి, నజీర్ తదితరులు పాల్గొన్నారు.