Locations: Hyderabad

  • కలెక్టర్‌‌ను కలిసిన నేతలు

    మేడ్చల్: జిల్లా కలెక్టర్‌గా మిక్కిలినేని మను చౌదరీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో మేడ్చల్, ఉప్పల్, కుకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇంఛార్జీలు వజ్రేష్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, రమేష్, హనుమంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఉన్నారు.

  • ఆరు పుణ్యక్షేత్రాలకు ఒకేరోజు దైవ దర్శనం

    మేడ్చల్: టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఈ నెల 27 నుంచి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఒకేరోజు ఆరు పుణ్యక్షేత్రాలను దైవ దర్శనం చేసుకొనే అవకాశం ఆర్టీసీ కల్పిస్తుందని హకింపేట్ డిపో మేనేజర్ భవభూతి తెలిపారు. సికింద్రాబాద్ నుంచి అళియాబాద్ రత్నాలయం, మజీద్‌పూర్ వెంకటేశ్వర స్వామి, వర్గల్‌సరస్వతి ఆలయం, కొమురవెల్లి మల్లన్న, కోలనపాక శివాలయం, బుద్ద దేవాలయం, స్వర్ణగిరి దేవాలయాల దర్శనాలు ఉంటాయన్నారు.

  • మను చౌదరిని కలిసిన నేతలు

    మేడ్చల్: జిల్లా నూతన కలెక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన మను చౌదరిని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్ బండి రమేష్ వారి కార్యలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు. నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. వాటి పరిష్కారం కోసం తక్షణమే తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. వారితో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

  • పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

    మేడ్చల్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట కాలనీలో రూ. 51 లక్షల 40 వేల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే పార్క్ నిర్మాణ పనులకు  ముఖ్యఅతిథిగా పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ, డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు హాజరై శంకుస్థాపన చేశారు. వారితో పాటు యువజన నాయకులు నిఖిల్, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

  • స్టూడెంట్ సేఫ్టీపై అవగాహన సదస్సు

    HYD: స్టూడెంట్ సేఫ్టీపై నిర్వహించిన స్కూల్ మేనేజ్మెంట్, స్టేక్ హోల్డర్స్ మీటింగ్‌లో సీపీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్‌పోలీసులు నిర్వహించే ఈ అవగాహన సదస్సు పిల్లల సేఫ్టీకి ఉపయోగపడుతుందన్నారు. పిల్లల భద్రతపై ట్రాఫిక్‌పోలీసులు, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, స్కూల్‌మేనేజ్మెంట్, మీడియా, తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలనన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ సీసీ కెమెరాలు అమార్చుకొని పిల్లల భద్రతకు తోడ్పడాలని పేర్కొన్నారు.

  • బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ

    మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్‌ఎఫ్‌సీ నగర్ మాజీ సర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్ అమ్మ లక్ష్మి మృతి చెందారు. ఈ విషయం తెలుసున్న మేడ్చల్ నియోజకవర్గ ఇంఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వారి పార్ధివ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • ‘పథకాలను సద్వినియోగం చేసుకోవాలి’

    HYD: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని, లబ్ధిపొందాలని ప్రజలకు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. వెస్ట్‌మారేడ్ పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. ఈ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు తమ పరిసరాలలోని అర్హులైన వారు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు.

     

  • రోడ్డు ప్రమాదం.. యువ‌కుడు మృతి

    మేడ్చల్: సూరారం పీఎస్ పరిధిలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. షాపూర్‌నగర్ నుంచి సూరారం వైపు వెళ్తున్న బైక్‌ను ఇసుక లోడుతో వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెళ్తున్న గాగిల్లాపూర్‌కు చెందిన సాయికుమార్‌(21) యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

  • రాహుల్ గాంధీకి బర్త్‌డే విషెస్

    మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఔషపూర్ గ్రామంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ జిల్లా నాయకులు కవాడి మాధవరెడ్డి హాజరై కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కందగట్ల సందీప్ రెడ్డి, డోనికేనా శంకర్ గౌడ్, మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

  • ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఘనపురం పవర్ గ్రిడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల రాజు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గం B బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ హాజరయ్యారు.