మేడ్చల్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను NMC అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
Locations: Hyderabad
-
ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు ప్రారంభం
HYD: గణేశ్ చతుర్థి వచ్చిందంటే అందరి చూపు ఖైరతాబాద్ బడా గణేశుడి మీదే ఉంటుంది. అయితే,ఈ సారి ప్రత్యేకమైన సందేశంతో 69 అడుగుల్లో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా లంబోదరుడు దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే వినయాక విగ్రహ తయారీ పనులూ ప్రారంభమమ్యాయి. మరో 78 రోజుల్లో విఘ్నేశ్వరుడి పూర్తి రూపం సిద్ధమవుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.
-
సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావుపై కేసు
HYD: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావుతో పాటు మరో ముగ్గురిపై పై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తన కారుపై శ్రీధర్‌రావు అనుచరులు దాడి చేశారని కుషీచంద్ వడ్డే అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆయన నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
-
ఐఆర్ఏ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం
మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగచెర్లలో ఐఆర్ఏ డయాగ్నస్టిక్ సెంటర్‌ను కాంగ్రెస్ నాయకులతో కలిసి మేడ్చల్ నియోజకవర్గ ఇంఛార్జ్ వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు. బోడుప్పల్ అభివృద్ధితో ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయని, సరైన పరీక్షలు అందుబాటు ధరల్లో అందించాలని సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పీసరి మైపాల్ రెడ్డి, కొత్త కిషోర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
-
సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్‌రావు
HYD: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు నాలుగో సారి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రభాకర్‌రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ జరగనున్న విచారణ ఈ కేసులో కీలకమని తెలుస్తోంది.
-
మన్మోహన్ రెడ్డిని పరామర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే
మేడ్చల్: అనారోగ్యంతో ECIL జినియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న చర్లపల్లి డివిజన్‌కు చెందిన మన్మోహన్ రెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మహేష్ గౌడ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
-
‘జూబ్లీహిల్స్ బరిలో నేనే ఉన్నా’
HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓడినా.. పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు అత్యధిక ఓట్లు రాబట్టినట్లు చెప్పారు. పార్టీలో తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ సీఎం రేవంత్, సోనియా, రాహుల్ ఆశీస్సులతో టికెట్ సాధించి గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు.
-
పిల్లల అశ్లీల వీడియోలు షేర్ చేస్తున్న 18 మంది అరెస్ట్
HYD: పిల్లల అశ్లీల వీడియోలు షేర్ చేస్తున్న 18 మంది యువకులు అరెస్ట్ అయ్యారు. చిన్న పిల్లల అశ్లీల వీడియోలు డౌన్‌లోడ్ చేసి, షేర్ చేస్తున్నారని అమెరికాలోని కంట్రోల్ రూమ్‌కి వచ్చిన సమాచారంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు నగరంలో 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒక్కొక్కరిపై ఐదు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ అరెస్ట్‌లు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.
-
భద్రకాళీ అమ్మకు భాగ్యనగరం నుంచి తొలి బోనం
HYD: నగరంలో రాష్ట్ర పండుగ బోనాలకు విశేష గుర్తింపు ఉంది. 400ఏళ్లుగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీకి బోనం సమర్పిస్తున్నారు. ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తొలిసారి వరంగల్ భద్రకాళీకి బంగారు బోనాన్ని మంత్రి కొండా సురేఖ ఎత్తనున్నారు. బోనాల ప్రత్యేకతను చాటేందుకు ఢిల్లీ తెలంగాణ భవన్, శ్రీశైలం, బెజవాడ కనకదుర్గ, జోగులాంబ ఆలయాలకు ప్రభుత్వం బోనం సమర్పిస్తోంది.
-
‘కష్టపడే నాయకులకే ప్రాధాన్యం’
మేడ్చల్: ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం ఇంఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ రస్తు ఫంక్షన్ హాల్‌లో జరిగింది. చెర్లపల్లి డివిజన్ కమిటీల ఏర్పాటు కోసం పార్టీ పదవులకు ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కష్టపడే నాయకులకే ప్రాధాన్యం ఇవ్వాలని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పేర్కొన్నారు. సమావేశంలో పారిజాత నరసింహరెడ్డి, దుర్గం భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.