మేడ్చల్: కాప్రా మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద జవహర్ నగర్‌లోని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోటపల్లి శంకర్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. 2003-04లో పేదలకు గుడిసెలు కట్టించినా, 25ఏళ్ల తర్వాత రెవెన్యూ అధికారులు వాటిని కూల్చడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీఎస్ బోస్, ఉమా మహేశ్వరి ఖండించారు. కార్యక్రమంలో దశరథ్, సహదేవ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Locations: Hyderabad
-
‘సమస్యల పరిష్కారానికి చర్యలు’
మేడ్చల్: చర్లపల్లి డివిజన్‌లోని మారుతి నగర్ కాలనీ నివాసులు తమ సమస్యల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్పందించిన కార్పొరేటర్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
-
SBI 70వ వార్షికోత్సవం.. మెగా రక్తదాన శిబిరం
మేడ్చల్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70వ వార్షికోత్సవం సందర్భంగా నాచారం RBO ఆధ్వర్యంలో SBI ECIL బ్రాంచ్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 227 మంది ఆఫీసర్లు, ఖాతాదారులు, బెల్ కంపెనీ సిబ్బంది రక్తదానం చేశారు. SBI ఫౌండేషన్ 70ఏళ్ల సందర్భంగా అన్ని RBOలలో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ సంజీబ్ కుమార్ సాహు తెలిపారు.
-
యువతి ఆత్మహత్య…
HYD: సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన సుష్మ(27), హైటెక్‌సిటీలోని డైబోల్డ్/నిక్స్‌డార్ఫ్ కార్యాలయానికి పని నిమిత్తం వచ్చింది. అక్కడి నుంచి రాత్రి 10:30కి బయలుదేరినట్లు మేనేజర్ తెలిపారు. ఇంటికి రాకపోవడంతో తండ్రి అంజయ్య ఉదయం 4గంటలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 7గంటలకు దుర్గంచెరువులో మహిళ మృతదేహం తేలిందని సమాచారం అందింది. సుష్మ మృతదేహంగా గుర్తించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం
హైదరాబాద్-తిరుపతి స్పెస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో మళ్లీ శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో విమానంలోని 80 ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
కుటుంబ కలహాలు.. భార్యపై భర్త కత్తితో దాడి
HYD: జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని శ్రీకృష్ణనగర్‌లో కుటుంబ కలహాల కారణంగా అరుణ్ ప్రసాద్(42) తన భార్య జయలక్ష్మి(35)పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గొడవల మధ్య కోపోద్రిక్తుడైన అరుణ్, కూరగాయల కత్తితో జయలక్ష్మి మెడపై పొడిచాడు. ఇరుగుపొరుగు వారి సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన జయలక్ష్మిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
పెద్దమ్మతల్లి దర్శనానికి వచ్చిన భక్తుడి బైక్ చోరీ
HYD: పెద్దమ్మతల్లి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడి ద్విచక్రవాహనం చోరీకి గురైన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. బొల్లారం అల్వాల్ విలేజ్ ప్రాంతానికి చెందిన మల్లేష్(30) జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయానికి వచ్చారు. ఆలయ పార్కింగ్ స్థలంలో బైకును పార్కింగ్ చేశాడు. దర్శనం చేసుకుని వచ్చేసరికి వాహనం కన్పించలేదు. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
ORRపై సాయంత్రం తర్వాతే ఎక్కువ ప్రమాదాలు
HYD: నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై అడ్డూఅదుపులేని వేగం, జిగ్‌జాగ్ డ్రైవింగ్, నిద్రమత్తు కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరిగి రక్తసిక్తమవుతోంది. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఈప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. చీకటిపడ్డ తర్వాత జరిగే ఈ ఘటనలను విశ్లేషించిన పోలీసులు, ఘటనాస్థలాల పరిశీలన, డ్రైవర్ స్థితిపై దృష్టి సారించారు. ప్రమాద నియంత్రణకు కఠిన చర్యలు, సరైన సంకేతాలు వంటి అంశాలపై పోలీసులు దృష్టిపెట్టారు.
-
మద్యం తాగి స్కూల్ బస్సులు నడిపిన 9 మందిపై కేసులు
HYD: నగరంలో స్కూల్ బస్సుల డ్రైవర్లు మందుతాగి నడుపుతుండటం కలవరపెడుతోంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెడ్గే, నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు ఇలాంటి వారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చిరించారు. నార్త్ జోన్ పరిధిలో 839స్కూల్ వాహనాలు తనిఖీ చేయగా.. 9 మంది మద్యం తాగి బస్సులు నడుపుతున్నట్లు గుర్తించారు. వారిపై డ్రంక్ & డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
-
బంజారాహిల్స్‌లో పార్కింగ్ సముదాయం సిద్ధం.. నాంపల్లిలో ఆలస్యం
HYD: బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం నెలల్లో పూర్తై ట్రయల్ రన్ ప్రారంభమైంది. అయితే, నాంపల్లిలో 2018లో మొదలైన ఆటోమేటెడ్ పార్కింగ్ సముదాయం పనులు ఏడేళ్లుగా కొనసాగుతున్నాయి. జర్మనీ నుంచి పరికరాల ఆలస్యం, కొవిడ్, రుణ సమస్యలతో ఆలస్యమైన ఈ ప్రాజెక్టు నెలాఖరుకు పూర్తవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. వచ్చే నెలలో ట్రయల్ రన్ జరగనున్నట్లు తెలిపారు.