Locations: Hyderabad

  • ఉద్యోగం కోల్పోయాడని యువకుడు ఆత్మహత్య

    మేడ్చల్: కేపీహెపీ పీఎస్ పరిధిలో ఖమ్మం జిల్లాకు చెందిన గోపికృష్ణ(26) ఉద్యోగం కోల్పోవడంతో మనస్థాపానికి గురై తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ నెల రోజుల క్రితం ఉద్యోగం కోల్పోయిన అతడు, “నేను భయంతో కాదు, భరించలేని బాధతో చనిపోతున్నాను” అని సూసైడ్ నోట్‌లో రాశాడని పోలీసులు తెలిపారు.

  • పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

    HYD: పాతబస్తీలోని మొఘల్‌పురా దర్గా భోలా షా సాహబ్ రహమతుల్లాహి సమీపంలో ఒక నివాస భవనంలోని కార్టూన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలను మొఘల్‌పురా అగ్నిమాపక దళం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో భవనంలో నివసిస్తున్న 9మందిని సురక్షితంగా రక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • 28న గచ్చిబౌలి- కొండాపూర్ ఫ్లై ఓవర్ ప్రారంభం

    TG: గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ఈనెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికి దివంగత నాయకుడు పి.జనార్ధన్‌రెడ్డి ప్లైఓవర్‌గా నామకరణం చేశారు. ప్రారంభోత్సవానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని మేయర్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. ఈ పైవంతెన అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది.

  • ‘జూబ్లీహిల్స్ బరిలో నేనే ఉన్నా’

    HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. ఈనేపథ్యంలో జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ ఆయన నివాసం వద్ద మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నట్లు స్పష్టంచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడానని, తక్కువ ఓట్లతో ఓడిపోయానని తెలిపారు.

  • మెట్టుగూడలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం

    HYD: మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీత ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు పాల్గొని వీధులన్నీ శుభ్రం చేశారు. పేరుకు పోయిన శిథిలాలు, చెత్త పెరిగిన చెట్లను తొలగించడంపై దృష్టి సారించినట్లు కార్పొరేటర్ తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయవద్దని, నాలలో చెత్త ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయవద్దని ప్రజలకు సూచించారు.

  • చిన్నారిపై వైద్యుడు లైంగిక దాడి..

    HYD: మానసికంగా బాధపడుతున్న చిన్నారి(4)పై వైద్యుడు లైంగిక దాడి చేసిన ఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాలుగు నెలల నుంచి హబ్సిగూడలోని వైబ్రెన్ట్ వింగ్స్‌లో చిన్నారి వైద్యం తీసుకుంటుండగా వైద్యుడు రంజిత్ లైంగిక దాడికి పాల్పడిన్నట్టు సమాచారం. బాలికను చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. రంజిత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

     

  • చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య..

    రంగారెడ్డి: గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీలో చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. తలకు ప్లాస్టిక్‌కవర్ చుట్టుకొని హీలియం గ్యాస్ పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చార్టెడ్ అకౌంటెంట్ సురేష్ రెడ్డి(28) డైరీలో సూసైడ్ నోట్ రాసుకున్నాడు. పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో రాసినట్లు తెలిసింది. సురేష్ రెడ్డి మణికొండలోని ఓ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.

  • ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి మందు బాబు హల్‌చల్..

    HYD: దిల్‌సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద మద్యం మత్తులో ఓ మందుబాబు ఆత్మహత్యకు యత్నించాడు. మెఘా థియేటర్ వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించగా అతడికి కరెంట్ షాక్‌ తగిలి తొడ భాగం నుంచి అరికాళ్ల వరకు కాలిపోయింది. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బాధితుడి వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం చేశారు.

  • అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

    HYD: ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన బుధవారం బన్సీలాల్ పేట డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు. కోటి 10 లక్షల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా న్యూ బోయగూడలోని ఉప్పలమ్మ దేవాలయం వద్ద D క్లాస్‌లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.

  • శ్రావణ్ కుమార్‌కు శుభాకాంక్షలు

    మేడ్చల్: కాంగ్రెస్ మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షుడు శ్రావణ్ కుమార్ జన్మదిన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంఛార్జ్ కొలను హనుమంత రెడ్డి పాల్గొన్నారు. అనంతరం శాలువాతో సత్కరించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.