మేడ్చల్: ఘట్కేసర్‌లో నందిని(24) అనే గృహిణి అదృశ్యమైంది. వెంకటేష్, నందిని దంపతులు వారి ముగ్గురు పిల్లలతో ఘట్కేసర్‌లోని కృష్ణ మార్ట్ సమీపంలో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలను వదిలి, ఎవరికి చెప్పకుండా ఈనెల 15 మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుంచి వెళ్లి, తిరిగి రాలేదు. భర్త వెంకటేష్ ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసుల మిస్పింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Locations: Hyderabad
-
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
మేడ్చల్: పుణ్యక్షేత్రాలకు మేడ్చల్ బస్ డిపో నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు డిపో మేనేజర్ సుధాకర్ తెలిపారు. బస్ డిపోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిపో మేనేజర్ సుధాకర్ మాట్లాడుతూ.. ఈ నెల 27 నుంచి ఉదయం ఐదు గంటలకు మేడ్చల్ బస్సుడిపో నుంచి కాలేశ్వరం, రామప్ప, భద్రకాళి, వేయి స్తంభాల గుడి దర్శన అనంతరం డిపోకు రాత్రి10కి చేరుకుంటుందని తెలిపారు.
-
‘లైసెన్స్ సర్వేయర్‌లది కీలక పాత్ర’
మేడ్చల్: భూ భారతి చట్టం ప్రక్రియలో లైసెన్స్ సర్వేయర్లు కీలక పాత్రవహిస్తారని అదనపు కలెక్టర్ విజేయేందర్ రెడ్డి పేర్కొన్నారు. శామీర్‌పేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో లైసెన్స్ సర్వేయర్ల శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లైసెన్స్ సర్వేయర్లకు అనుభవం కలిగిన వారిచే శిక్షణ ఇప్పించామన్నారు. సర్వేయర్లు భూ భారతి చట్టాలపై పూర్తిస్ధాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు.
-
బాధితులకు మనీ రిఫండ్
మేడ్చల్: నేరేడ్మెట్ పీఎస్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులలో డబ్బులు పోగొట్టుకున్న 52 మంది బాధితులకు కోర్టు ద్వారా ప్రాసెస్ చేసి రూ.8,33,6115 రూపాయలు సంబంధిత బాధితులకు మనీ రిఫండ్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంతయ్య, నాగలత, కుమారి, స్వప్న లను ప్రత్యేకంగా అభినందించారు.
-
రోడ్డు నెంబర్ బోర్డులు ప్రారంభం
మేడ్చల్: కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుషాయిగూడ మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన రోడ్ నెంబర్ బోర్డులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్ హాజరయ్యారు. కుషాయిగూడకి అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామన్నారు.
-
ఉపాధ్యాయుల సమస్యలపై వినతి పత్రం
మేడ్చల్: తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TUTF) రాష్ట్ర అధ్యక్షులు రామినేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ నూతన కమిషనర్, విద్యా సంచాలకులు నవీన్ నికోలస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఉన్న వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెంకన్న, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి గణేష్ పాల్గొన్నారు.
-
‘ముందుగానే రైతుల ఖాతల్లో నిధులు’
మేడ్చల్: తొలకరి కంటె తొందరగా రైతుభరోసాతో రైతుల ఖాతాల్లోకి నిధులు అందించి రైతుల ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. బుధవారం రైతుభరోసా పథకం ద్వారా జిల్లాలో 4291 మంది రైతుల ఖాతాల్లో రూ.2.57 కోట్లు విడుదల చేసిన్నట్టు కలెక్టర్ తెలిపారు. యాసంగి సీజన్ కంటే ముందుగానే రైతుల ఖాతల్లో నిధులు జమ చేశారన్నారు.
-
అంతరాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్
HYD: మాసాబ్ ట్యాంక్ పోలీసులతో కలసి వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి అంతరాష్ట్ర డ్రగ్ విక్రేతతో పాటు 7మంది సబ్‌డీలర్స్, వినియోగదారులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.2.25లక్షల విలువైన హాష్ ఆయిల్, 175గ్రాముల గంజాయి, 3కత్తులు, 15చిల్లియమ్స్, 3 బైక్స్, 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు.
-
హనీ ట్రాప్‌కు చిక్కి.. రూ.38.73 లక్షలు పోగొట్టుకున్న వృద్ధుడు
TG: హైదరాబాద్‌కి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(70) హనీ ట్రాప్‌కు గురయ్యారు. ఫేస్ బుక్‌లో మహిళ పేరుతో చాటింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి నుండి ఏకంగా 38.73లక్షలు కాజేశారు. తాను మోసపోయినట్లు గ్రహించిన వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో పాల్గొన్న కార్పొరేటర్
మేడ్చల్: రాబోయే వర్షాకాల నేపద్యంలో శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్‌కి సంబంధించిన ప్రోగ్రాంలో చివరి రోజు డివిజన్‌లోని కామాక్షి పురం, వివేక్ నగర్‌లో రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు హాజరయ్యారు. స్థానిక పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ప్రజలకి తెలియజేశారు. కార్యక్రమంలో కాలనీ సీనియర్ మాజీ కౌన్సిలర్ చింతోజు శ్రీనివాసచారి, కాలనీ మాజీ అధ్యక్షులు తమ్మలి రవి, పాల్గొన్నారు.