బాలీవుడ్ నటి కాజోల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ అని తెలిపింది. ‘‘ఎందుకో అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపెడతాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని.. మరోసారి అక్కడికి రాకూడదు అనిపిస్తుంది. రామోజీ ఫిల్మ్స్ సిటీ కూడా అలాంటిదే’’ అని చెప్పుకొచ్చింది.
Locations: Hyderabad
-
ఏకశిలా నగర్‌లో హైడ్రా కమిషనర్
మేడ్చల్: పోచారం మున్సిపాలిటీ పరిధిలో కోర్రేముల రెవెన్యూలో ఏకశిలా నగర్ లేఔట్‌లో సర్వే నెంబర్ 739 నుంచి 749 లో ఉన్న లేఅవుట్‌లో ప్లాట్స్ ఓనర్స్ హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం లేఔట్‌లో పరిశీలించారు. అక్కడ ఉన్న లేఔట్ ఓనర్స్‌తో మాట్లాడారు. అనంతరం అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.
-
అభివృద్ధి పనులు ప్రారంభం
మేడ్చల్: రూ.46 లక్షల వ్యయంతో వెస్ట్ శ్రీకృష్ణ నగర్‌లో స్టోర్మ్ వాటర్ డ్రైన్, భ్రమరాంబికా నగర్‌లో సీసీ రోడ్డు రిస్టోరేషన్ అభివృద్ధి పనులను అధికారులు, కాలనీ వాసులతో కలిసి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ప్రారంభించారు. అదే విధంగా వివిధ కాలనీలో ప్రత్యేక పారిశుధ్య పనులను చెప్పట్టారు. మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో బోనాల పండుగ దరఖాస్తులను స్వీకరిస్తునామాని, దరఖాస్తుదారులు నేరుగా తనకు ఇవ్వోచ్చని తెలిపారు.
-
ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్
మేడ్చల్: మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని నరసింహనగర్ కాలనీలో రూ.7.50 లక్షల అంచనా వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణపనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి విషయంలో అవసరమైన సహకారం అందిస్తూ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
-
పెండింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
HYD: మదీనా నగర్ మురుగునీటి పారుదల నాలా పెండింగ్ పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌కే కర్ణన్, జీహెచ్‌ఎంసీ జోనల్‌కమిషనర్ వారితో కలిసి యాకుత్‌పురా ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెహరాజ్ సందర్శించి పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అయితే ఇటీవలే నాలా సమస్యపై కొంతమంది స్థానికులు ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెహ్రాజ్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే.
-
గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ.. మాది ఇన్నోవేటివ్ ప్రభుత్వం: సీఎం రేవంత్
TG: హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ..మాది ఇన్నోవేటివ్ ప్రభుత్వం. నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశాం. ఉత్తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారుతోంది. తెలంగాణ రైజింగ్‌లో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తున్నాం. ఇక్కడి మహిళలు ధనిక పెట్టుబడిదారులకు పోటీదారులుగా మారుతున్నారు’’అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు హాజరైన ప్రణీత్‌రావు
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు నిందితుడు ప్రణీత్‌రావు బుధవారం హాజరయ్యారు. ఎన్నికల ముందు ఎస్‌ఐబీలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్‌ను ఆయన లీడ్ చేశాడు. రాజకీయ నేతలు, ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేశాడు. ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు ఆదేశాలతో ప్రణీత్‌రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశాడు. నాగోల్ వద్ద మూసీ నదిలో వాటిని పడేశాడు.
-
ఓయూలో వైర్‌లెస్ ఛార్జింగ్‌పై పరిశోధన
HYD: కాలుష్య నియంత్రణ, ఇంధన కొరత కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భవిష్యత్‌లో భారీగా పెరగనున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు వైర్‌లెస్ ఛార్జింగ్‌పై పరిశోధన ప్రారంభించారు. ద్విచక్ర వాహనాల నుంచి బస్సుల వరకు వైర్‌లెస్‌గా చార్జింగ్ సౌకర్యం కల్పించే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీని రూపొందిస్తున్నారు. ఈ సాంకేతికతతో విద్యుత్ ఆదాచేస్తూ వైర్‌లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చని ప్రొఫెసర్లు తెలిపారు.
-
డబుల్ బెడ్‌రూమ్ పేరిట మోసాలు
HYD: నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇప్పిస్తామని మోసం చేసిన నలుగురు నిందితులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ప్రభుత్వ డబుల్ బెడ్‌రూమ్ గృహాల కేటాయింపు పేరిట బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాళేశ్వరం కమిషన్ ముందు ఎంపీ ఈటల అసత్యాలు: మంత్రి తుమ్మల
TG: గాంధీభవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. BRS హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు తుది నివేదిక రాలేదన్నారు. నాడు ప్రాణహితతోపాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై సబ్‌కమిటీ వేశారని.. మేడిగడ్డ విషయం క్యాబినెట్ ముందుకు రాలేదని తుమ్మల చెప్పారు. కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి, BJP ఎంపీ ఈటల రాజేందర్ అసత్యాలు మాట్లాడారని ఆరోపించారు.