మేడ్చల్: బాచుపల్లి పరిధిలోని మిథిలా నగర్ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు మంటలను గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఏసీకి మంటలు అంటుకుని భారీగా మంటలు విస్తరించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Locations: Hyderabad
-
సెల్‌ఫోన్ దొంగల అరెస్టు
HYD: వాహనదారుల దృష్టి మరల్చి సెల్‌ఫోన్లు దొంగిలిస్తున్న ఒడిశాకు చెందిన గంట చిన్న(40), ప్రధాన్ శ్రీకాంత్(22), ఆవుల గోపీరావు(20)లనుతాడుబంద్‌లో, బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.25లక్షల విలువైన రెండు ద్విచక్ర వాహనాలు, 77సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. 250సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. సెల్‌ఫోన్లు విదేశాలకు పంపే జాగీర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లు
HYD: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న పికెట్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి గార్డెన్‌లో జరిగే వేడుకల ఏర్పాట్లను సీఈఓ మధుకర్ నాయక్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ పరిశీలించారు. అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఈఓ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, ఇన్‌స్పెక్టర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
-
కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడికి ఘన సన్మానం
HYD: బదిలీపై వెళ్తున్న కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ నంజుడేశ్వరకు సీఈవో మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నర్మదా మాట్లాడుతూ.. తన మూడు నెలల బోర్డు సభ్యురాలి కాలంలో బ్రిగేడియర్ సహాయ సహకారాలు మరువలేనివని, వారి నిస్వార్థ సేవ, దార్శనికత ఆదర్శనీయమని కొనియాడారు.
-
అనుమానాస్పద స్థితిలో సినీ కార్మికుడు మృతి
HYD: మధురానగర్ రాణా పరిధిలోని శ్రీకృష్ణానగర్ ఫుట్‌పాత్‌పై సినీ కార్మికుడు అరిపినేని వివేక్(28) మృతి చెందాడు. నాలుగు నెలలుగా దేవన్న వద్ద పనిచేస్తున్న వివేక్‌కు షూటింగ్ సమయంలో ఫిట్స్ వచ్చింది. స్నేహితుడు సతీష్ సంరక్షణ అందించగా.. జగదాంబ శానిటరీ దుకాణం ముందు అనుమానాస్పద స్థితిలో ఫుట్‌పాత్‌పై మృతి చెందాడు. దేవన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
క్రికెట్ బెట్టింగ్ యాప్‌లపై కేసు
HYD: క్రికెట్ మ్యాచ్‌ల జయాపజయాలు, టాస్‌పై అంచనాలతో నాలుగు బెట్టింగ్ యాప్‌లు, ఆరుగురు నిర్వాహకులపై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటలీలో చదువుతున్న కుత్బుల్లాపూర్‌కు చెందిన దినేశ్‌రెడ్డి టెలిగ్రామ్ గ్రూప్‌ల ద్వారా బెట్టింగ్‌లో రూ.50 లక్షలు, అతడి స్నేహితుడు కుల్వంత్‌సింగ్ రూ.60లక్షలు పోగొట్టుకున్నారు. కుల్వంత్‌సింగ్ డిసెంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దినేశ్‌రెడ్డి ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
HYD: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమంతుడి ఆశీసులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాండు యాదవ్, టీఎన్ శ్రీనివాస్, దేవలపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
-
స్మశాన వాటికలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు
HYD: బన్సీలాల్‌పేట్ స్మశాన వాటికలో కబ్జాదారుల అక్రమ నిర్మాణాలను తొలగించాలని కురుమ సంఘం నాయకులు బేగంపేట్ జీహెచ్‌ఎంసీ డీసీ డాకు నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. సనత్‌నగర్ ప్రధాన కార్యదర్శి ఎం.పీ సునీల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు నటరాజ్, జట్ల శివప్రసాద్, జక్కుల శివకుమార్ పాల్గొన్నారు.
-
నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం
HYD: బోయిన్‌పల్లిలో చెట్ల కొమ్మల కత్తిరింపు కారణంగా బుధవారం విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నట్లు ఏడీఈ గోపాల్ రావు తెలిపారు. ఓల్డ్ బోయిన్‌పల్లి ఫీడర్‌లో ఉదయం 10 నుంచి 1 వరకు, దుబాయ్ గేట్ ఫీడర్‌లో మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు, సెంట్రల్ ఎక్సైజ్ ఫీడర్‌లో 2:30 నుంచి 3:30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. తదనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలని ఏడీఈ ప్రజలకు సూచించారు.
-
జలమండలిపై విద్యుత్ బకాయిల భారం
HYD: నగర జలమండలిపై విద్యుత్ ఛార్జీల బకాయిలు రూ.6200కోట్లకు చేరాయి. నెలకు రూ.120కోట్ల బిల్లు జోడవుతోంది. కృష్ణా, గోదావరి నుంచి నీటి ఎత్తిపోతల, శుద్ధి ప్లాంట్లు, పంపుహౌస్‌ల వల్ల ఛార్జీల భారం పెరుగుతోంది. జలమండలి ఇప్పుడు 31 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించింది. నెలకు రూ.10 కోట్ల ఛార్జీలు తగ్గించే లక్ష్యంతో ప్రతిపాదనలను తెలంగాణ రెడ్కోకు అందజేసినట్లు జలమండలి ఉన్నతాధికారులు వివరించారు.