Locations: Hyderabad

  • నకిలీ పత్రాలతో బురిడీ కొట్టించే యత్నం

    HYD: నార్సింగి మార్వా టౌన్‌షిప్‌లో రూ.6కోట్ల విలువైన 617 చ.గజాల ప్లాటు మార్టిగేజ్ విడుదల కోసం నకిలీ పత్రాలు సృష్టించిన ఘటనపై మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణమోహన్‌రెడ్డి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీరజ దవులూరి అనే వ్యక్తి సీహెచ్ శివనాగేశ్వరరావు పేరిట నకిలీ ఫైల్‌తో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాలు సమర్పించాడు. సబ్‌రిజిస్ట్రార్ అనుమానంతో కమిషనర్‌ను సంప్రదించగా.. ఆ పత్రాలు నకిలీవని తేలింది. 

     

  • సేవాకార్యక్రమాలతో ప్రశంసలు అందుకున్న వైష్ణవీ యాదవ్

    HYD: మోండా డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు వైష్ణవీ యాదవ్ సేవా కార్యక్రమాలు, ప్రజలు ఆదరణ పోందడమే కాకుండా, ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో సహా నాయకుల మన్ననలు పొందుతున్నారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ఏడాది పూర్తి సందర్భంగా వైష్ణవీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయగా.. ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించి, ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. 

  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఈసీ ప్రకటన!

    TG: ఈ నెల 8న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందడంతో ఆ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నికలు వస్తాయని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక ఉండకపోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు నోటిఫికేషన్ వచ్చిందన్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక ఆలస్యం కావొచ్చన్నారు.

  • దివ్యాంగులు పెద్దఎత్తున తరలి రావాలి

    HYD: భారత అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డును పొందిన మందకృష్ణ మాదిగకు గురువారం శుభం గార్డెన్‌లో నిర్వహించే సన్మాన సభకు దివ్యాంగులు, పెన్షన్ దారులు పెద్ద ఎత్తున తరలి రావాలని వీహెచ్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు. అడ్డగుట్టలో మంగళవారం జరిగిన సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథులుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోరు కమిటి ఛైర్మన్ గోపాల్, గోవర్ధన్ ఉన్నారు.

  • పెళ్లి ఇంట్లో అగ్నిప్రమాదం

    HYD: పెళ్లి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి విలువైన వస్తువులు దగ్ధమైన ఘటన శాలిబండ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. శాలిబండ ఖాజీ బండ ప్రాంతానికి చెందిన మెహమ్మద్ ఒమర్ సౌదీ ఈ నెల 22న తన పెద్ద కూతురు పెళ్లి అని అరేబియా నుంచి పాతబస్తీకి వచ్చాడు. ఘటనలో పెళ్లి కోసం షాపింగ్ చేసిన సామాగ్రితో పాటు దుస్తులు, ఫర్నీచర్ కాలి బూడిదయ్యాయి.

  • నాయకుల మధ్య అంతర్గత వర్గపోరు

    మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గపోరు నడుస్తోంది. ఈ విషయంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు జి. రవి ముదిరాజ్ మాట్లాడుతూ.. ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు పార్టీ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం అయిన సామాన్య కార్యకర్తలను దూరం పెడుతూ పార్టీలో అసమానతలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

  • ‘సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత’

    HYD: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తానని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం పద్మారావు నగర్‌లో రూ.96 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, మూత్ర శాలల గదుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, డీసీ డాకు నాయక్, ఈఈ సుబ్రహ్మణ్యం, వాటర్ వర్క్స్ జీఎం వినోద్, పాల్గొన్నారు.

  • సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన సీవీ ఆనంద్

    HYD: మనుషుల అక్రమ రవాణా, పిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, జువెనైల్ బ్యూరో యూనిట్‌ను మరింత బలోపేతం చేసేందుకు హైదరాబాద్ పోలీసులు శ్రీకారంచుట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉమెన్ సేఫ్టీ విభాగంలో సౌకర్యాలతో కూడిన కార్యాలయాన్ని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ప్రజ్వల ఫౌండేషన్‌తో కలిసి పోలీసులు బాధితుల సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు.

  • ప్రముఖ నటి రమ్యశ్రీపై కత్తితో దాడి

    HYD: ప్రముఖ నటి రమ్యశ్రీపై దాడి జరిగింది. గచ్చిబౌలి పీఎస్ దగ్గరలోని FCI కాలనీ లేఅవుట్‌లో ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేశారు. దానిని నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్ వీడియో తీస్తున్నారని సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్‌రావు అనుచరులు దాడికి పాల్పడ్డారు. కత్తి, క్రికెట్ బ్యాట్‌తో దాడిచేశారు. పీఎస్‌ ఎదురుగానే పట్టపగలు తమపై హత్యాయత్నం చేశారని నటి వాపోయారు.

  • ORRపై రోడ్డు ప్రమాదం..

    మేడ్చల్: కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అర్థరాత్రి లారీ అదుపు తప్పిన పక్కనే ఉన్న చెట్లలోకి దూసుకుపోయింది. కీసర నుంచి ఈసీఐఎల్‌కి కంకర లోడ్‌తో వెళ్తున్న లారీ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.