Locations: Hyderabad

  • చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నేతలు

    మేడ్చల్: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 81 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి అందజేశారు. వారితో పాటుగా ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ నియోజకవర్గం ఇంఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఉన్నారు. కార్యక్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్, మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ పాల్గొన్నారు.

  • సీఎస్‌తో ఎమ్మెల్యే భేటీ

    HYD: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ రాష్ట్ర ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావును సెక్రటేరియట్‌లో కలిశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసి కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాలని, ప్రక్రియ ఆలస్యమయ్యే పక్షంలో కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరారు. కంటోన్మెంట్ బోర్డుకు 2020 జనవరి లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా ఎన్నికలు జరగలేదన్నారు.

  • నిమ్స్ ఎంహెచ్‌ఎం కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు

    HYD: నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (నిమ్స్‌) ఆస్పత్రిలో మాస్టర్‌ ఇన్ హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్‌(ఎంహెచ్ఎం) కోర్సుల కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నట్లు ఆస్పత్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ ప్రొఫెస‌ర్ నిమ్మ స‌త్యనారాయణ తెలిపారు. 20 సీట్లు మాత్రమే ఉన్నాయని, డిగ్రీ అర్హత త‌ప్పనిసరని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు జూన్28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు ఆస్పత్రి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాల‌ని పేర్కొన్నారు.

  • సుపరిపాలన వారోత్సవాలు

    మేడ్చల్: ఎల్లంపేట్ మున్సిపాలిటీ రావల్ కోల్ గ్రామంలో నరేంద్ర మోడీ కేంద్రంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన వారోత్సవాలను నిర్వహించారు. ఇందుల్లో భాగంగా ఎల్లంపేట్ మున్సిపాలిటీ బీజకేపీ అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు పుష్ప మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • ‘హత్యాకాండను వెంటనే ఆపాలి’

    HYD: ‘ఆపరేషన్ కగార్’ పేరిట సాగిస్తున్న హత్యాకాండను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ధర్నచౌక్ వద్ద భారీ స్థాయిలో మహాధర్నా చేపట్టి నిరసన కార్యక్రమానికి సినీ నటులు ఆర్.నారాయణ మూర్తి హాజరై మాట్లాడారు. ఎక్కడ అణచివేత, పీడనం, దోపిడీ ఉంటుందో.. అక్కడ ఉద్యమం ఉంటుందని అందుకు అడిగినోడు నక్సలైట్.. అడగనోడు ఆల్ రైట్ ఆ .! అని ఆయన ప్రశ్నించారు.

  • ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఏఈ..

    మేడ్చల్: కాప్రా మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడులో కాంట్రాక్టర్ రామ్ రెడ్డి దగ్గర నుంచి బిల్ పాస్ చేయడానికి రూ.1,20,000 చర్లపల్లి ఏఈ స్వరూప డిమాండ్ చేయడంతో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో కూడా ఏఈ స్వరూపపై కాంట్రాక్టర్లను లంచాల కోసం వేధింపులకు గురి చేసిందని ఆరోపణలు ఉన్నాయి.

  • సీఎం, మంత్రి పొన్నం చిత్రపటాలకు పాలాభీషేకం

    HYD: కొత్త ఆటోలకు పర్మిట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంతోపాటు రవాణారంగ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదన చేయడంపై తెలంగాణ రాష్ట్ర ఆటోరిక్షా డ్రైవర్ల సంఘాల ఐకాస హర్షం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్ కూడలిలో తెలంగాణ ఆటో సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సలీమ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం చిత్రపటాలకు పాలాభీషేకం చేశారు.

  • సెల్ ఫోన్లు దొంగిలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్

    HYD: బోయిన్‌పల్లిలోని తాడ్‌బంద్ చౌరస్తా వద్ద పోలీసులు తమ సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తుండగా ముగ్గురు నిందితులు నంబర్ ప్లేట్లు లేని 2బైకులతో అనుమానాస్పదంగా పారిపోతుండగా వారిని అరెస్టు చేయగా, సిబ్బంది విచారణలో 77 ఫోన్లు, 2బైక్‌లు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లు, బైక్‌ల విలువ సుమారు రూ.25లక్షలు ఉంటుందని తెలిపారు.

  • బస్తీబాట కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్

    HYD: రహమాత నగర్ డివిజన్ హెచ్‌ఎఫ్ నగర్ ఫేస్-1 లో అధికారులతో కలిసి కార్పొరేటర్ CN రెడ్డి పర్యటించారు. అనంతరం బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మురుగనీరు సమస్య, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలపైన స్థానిక ప్రజలతో ఆయన మాట్లాడారు. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఆయన దృష్టికి రాగ సంబంధిత అధికారులతో కలిసి త్వరలో పరిష్కరించాలని వారిని కోరారు.

  • స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

    మేడ్చల్: మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ పలు కాలనీలలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేప్పట్టారు. భ్రమరాంబికానగర్, విమలదేవినగర్, విష్ణుపూరి, శివపురి, రాజీవ్ గాంధీ నగర్ తదితర కాలనీలలో పాదయాత్ర ద్వారా వర్షా కాలంలో ఇబ్బందికి గురి కాకుండా వ్యర్థాలను తొలిగించారు. అలాగే రోడ్ల నిర్మాణంలో వ్యర్థాలను తొలించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజు, మెడికల్ ఆఫీసర్ మంజుల పాల్గొన్నారు.