ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు చిన్న పిల్లల నుంచి పెద్దల దాక అందరూ అడిక్ట్ అయిపోయారు. ఒక్క క్షణం కూడా ఫోన్‌ను వదలకుండా, గంటల తరబడి ఫోన్లకు బానిసై వింతగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిలో కొందరికి ఎర్రగడ్డ ఆస్పత్రిలో కౌన్సెలింగ్, చికిత్స అందించినట్లు డాక్షర్లు తెలిపారు. పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దని, పెద్దలు అవసరానికి మించి వాడొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.
Locations: Hyderabad
-
కూన శ్రీశైలంగౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మహిళలు
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున మహిళలు సమావేశమై, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని, ఆయన సేవలను కొనియాడారు. శ్రీశైలం గౌడ్ స్థానిక సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని ప్రశంసించారు.
-
పెట్రోల్ పంప్‌లో ఘరానా మోసం
మేడ్చల్: ఉప్పల్‌లోని మెహిఫిల్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న భారత్ పెట్రోల్ పంప్‌లో మోసం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. బాటిల్‌లో పెట్రోల్ కొట్టించగా, మిషన్ సెట్టింగ్‌తో తక్కువ పెట్రోల్ వస్తున్నట్లు బయటపడింది. రూ.100పెట్రోల్ కొట్టించగా తక్కువ వచ్చినట్లు గుర్తించి అడిగిన కస్టమర్‌కు “అంతే వస్తుంది” అని దురుసుగా జవాబు చెప్పారు. ఇలాంటి బంకులపై చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు.
-
ఫంక్షన్ హాల్‌లో అగ్నిప్రమాదం
వికారాబాద్: తాండూరు పట్టణంలోని చెరువెంటి ఈశ్వరాలయం సమీపంలోని వీరశైవ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించి కుర్చీలు, కూలర్లు, డెకరేషన్ వస్తువులు బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.15లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.
-
బస్ భవన్ వద్ద ఏబీవీపీ ఆందోళన
HYD: ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు బస్ పాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. “మేము లోపలికి రావాలా, సజ్జనార్ బైటికి వస్తాడా” అని నినాదిస్తూ బస్ భవన్‌ను ముట్టడించారు. పోలీసులకు, ఏబీవీపీ విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. పలువురిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
-
అభివృద్ధి పనుల పరిశీలించిన ఎమ్మెల్యే
మేడ్చల్: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి, వార్డు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. యూసఫ్ నగర్ స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. రాజీవ్ గాంధీ నగర్‌లో పైప్‌లైన్ పనులు పూర్తి చేసి, మట్టి వేసి, చెట్లు నాటి సుందరీకరణ చేయాలని ఆదేశించారు.
-
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మేడ్చల్: చర్లపల్లి నుంచి చక్రీపూరం వెళ్తున్న నవీన్ రెడ్డి (27), రాయల్ ఎన్‌ఫీల్డ్ నడుపుతూ డైనాటెక్ కంపెనీ సమీపంలో ముందు వెళ్తున్న వ్యక్తిని తప్పించే క్రమంలో అదుపు తప్పి పార్క్ చేసిన లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఛాతీకి బలమైన గాయంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. చర్లపల్లి పోలీసులు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ హామీ
మేడ్చల్: నాగార్జున నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు యావపురం రవి విజ్ఞప్తితో కాలనీని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ సందర్శించారు. రోడ్డు నెంబర్ 1బీటీ రోడ్డు, అంతర్గత రోడ్ల పునర్నిర్మాణం, పాట్‌హోల్స్ పూడ్చడం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలకు త్వరలో పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ నాయకులు, కాంగ్రెస్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు హాజరైన టీపీసీసీ చీఫ్
TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఆయన తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2023 నవంబరులో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నందున అప్పటి BRS ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేసిందని గతంలో మహేశ్‌కుమార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు ఆయన హాజరయ్యారు.
-
‘అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా’
మేడ్చల్: ఎల్‌బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ (IAS), ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి చర్లపల్లి డివిజన్‌లో పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. జీహెచ్‌ఎంసీ నిధులు త్వరలో మంజూరు చేస్తామని జోనల్ కమిషనర్ హామీ ఇచ్చారు. చర్లపల్లి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.