HYD: గణేశ్ నిమజ్జనం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) 26 ప్రత్యేక కుంటలను సిద్ధం చేసింది. వీటిలో పది బేబీపాండ్స్, ఎనిమిది పోర్టబుల్ ట్యాంకులు, ఎనిమిది తవ్విన కుంటలు ఉన్నాయి. బేబీపాండ్స్‌లో జైపాల్ రెడ్డి స్పూర్తి స్థలి, సంజీవయ్య పార్క్,ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉన్నాయి. చిన్నవిగ్రహాల నిమజ్జనం కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు నిమజ్జన ప్రక్రియను సులభతరం చేస్తాయని అధికారులు తెలిపారు.