Locations: Hyderabad

  • ప్రియుడితో కలిసి భర్తపై భార్య కత్తితో దాడి..

    HYD: భార్య తన ప్రియుడితో కలిసి భర్తపై కత్తితో దాడి చేసిన దారుణ ఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
  • క్యూఆర్ కోడ్‌తో గోల్కొండ కోట చరిత్ర సమాచారం

    HYD: గోల్కొండకోటను సందర్శించే పర్యాటకులు చరిత్ర తెలుసుకోవడానికి పుస్తకాల కొరతతో నిరాశ చెందుతున్నారని, పురావస్తుశాఖ అధికారులు కోట ప్రధాన ద్వారం వద్ద క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టారు.గూగుల్ స్కానర్‌తో స్కాన్ చేస్తే కాకతీయులకాలంలో గొల్లకొండగా ఉన్న చరిత్ర, 7కి.మీ.ప్రహరీ, 8దర్వాజాలు, వాటర్ సిస్టమ్, 23నిర్మాణాల చిత్రాలు అందుబాటులోకి వస్తాయి. కుతుబ్‌షాహీ రాజులపేర్లు, పరిపాలించిన చరిత్ర లేకపోవడం లోటుగా భావించి పూర్తివివరాలు ఇవ్వాలని పర్యాటకులు కోరుతున్నారు. 

  • యువకుడు ఆత్మహత్య

    మేడ్చల్: జిల్లా పీఎస్ పరిధిలోని బృందావన్ కాలనీలో కూలీ గణేష్(20) ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • విద్యుత్ సరఫరా నిలిపివేత

    HYD: శాంతినగర్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1వరకు శాంతినగర్‌, రఘుపతిరెడ్డి ఇల్లు ప్రాంతం, హుడా కేఫ్‌ మెయిన్‌రోడ్డులో విద్యుత్‌ ఉండదని అధికారులు తెలిపారు. హుడాకాలనీ 11కేవీ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5వరకు హుడాకాలనీ, వాటర్‌ట్యాంక్‌ ప్రాంతం, ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ రోడ్డు, ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ మెయిన్‌ రోడ్డు ప్రాంతాల్లో పవర్‌కట్ కానుంది.

  • ఎక్సైజ్‌శాఖలో ఆన్‌లైన్‌ ప్రక్రియ !

    HYD: ఆబ్కారీలోనూ ఆన్‌లైన్‌ విధానానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పోలీస్‌ శాఖ తరహాలోనే ఆబ్కారీ శాఖలో కూడా పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు ఎఫ్‌ఐఆర్‌ల నమోదు తదితర అంశాలను సైతం ఆన్‌లైన్‌ విధానంలోకి తీసుకువచ్చేందుకు ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు మొదలు పెట్టారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాలు డిజిటలైజేషన్‌తో పరుగులు తీస్తుంటే ఆబ్కారి అధికారులు ఎట్టకేలకు ఆన్‌లైన్‌ విధానానికి శ్రీకారం చుట్టారు.

  • మెట్రో రైల్ రెండవ దశ నిర్మాణానికి చర్యలు

    HYD: ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైల్ నిర్మాణానికి చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. పాతబస్తీ మెట్రోరైల్ విస్తరణకు ప్రభుత్వం రూ.125కోట్లు విడుదల చేసింది. ఇప్పటివరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ అధికారులు దాదాపు 311ఆస్తులను స్వాధీనం చేసుకోగా.. పరిహారం కింద రూ.283కోట్లు అందించారు. కేంద్రం నుంచి అనుమతి లభించగానే మెట్రో రైల్ రెండవ దశ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

     

  • గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ గ్లోరియస్ SCR పుస్తక ఆవిష్కరణ

    HYD: దక్షిణ మధ్య రైల్వే (SCR) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రైల్ నిలయంలో 2022-2025 మధ్య SCR సాధించిన విజయాలను వివరించే “గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ గ్లోరియస్ SCR” పుస్తకాన్ని ఆవిష్కరించారు. భద్రతా సమీక్ష సమావేశంలో మే నెలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 9మంది సిబ్బందికి “ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులు ప్రదానం చేశారు. 

  • 24 గంటల్లో నిశ్చితార్థం.. అంతలోనే బలవన్మరణం

    HYD: చాంద్రాయణగుట్ట తాళ్లకుంటకి చెందిన యూసుఫ్‌ బిన్‌ బహష్వాన్‌(25), ఆస్ట్రేలియా క్యాబ్‌‌డ్రైవర్‌, నిశ్చితార్థానికి 24గంటల ముందు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి కోసం నెలరోజుల క్రితం స్వదేశం వచ్చిన యూసుఫ్‌, ఘాజిమిల్లత్‌ కాలనీలో ఇంటికి రంగులు వేస్తూ పర్యవేక్షిస్తూ వెళ్లాడు. ఎంతకీ రాకపోవడంతో సోదరుడు ఆయూబ్‌ వెళ్లి చూడగా చీరతో ఉరేసుకున్నట్లు గుర్తించాడు. పోలీసులు కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

  • మురుగు నీటి సమస్య.. అధికారులు నిర్లక్ష్యంపై ఆగ్రహం

    HYD: సుభాష్‌నగర్ డివిజన్‌లోని రామ్‌రెడ్డి నగర్‌లో పాక్స్ సాగర్ మార్గంలో మూడేళ్లుగా మురుగు సమస్య కొనసాగుతోంది. మ్యాన్‌హోల్స్ పొంగి మురుగు రోడ్డుపై నిలిచి రాకపోకలకు అడ్డంకిగా మారుతోంది. స్థానికులు జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా.. తాత్కాలికంగా మురుగు తొలగిస్తున్నారే తప్ప, సీవరేజీ లైన్ విస్తరణకు చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

  • అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు

    HYD: సుప్రీంకోర్టు, హైకోర్టు వ్యాఖ్యలతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ, అక్రమ నిర్మాణాలను సీజ్ చేయడానికి కమిషనర్ ఆర్‌‌వీ.కర్ణన్ ఎస్‌ఓపీ రూపొందించారు. మొదటి తాఖీదుతోనే తాళం వేయాలని, విచారణ పూర్తయ్యాక చర్యలు తీసుకోవాలని జోనల్, సర్కిల్ కార్యాలయాలకు ఆదేశాలు జారీచేశారు. సీజ్, కూల్చివేతలో నిర్లక్ష్యం చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేని భవనాలు, ప్లాన్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.