Locations: Hyderabad

  • రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

    HYD: అమ్ముగూడ – మౌలాలి స్టేషన్ల మధ్య వినాయక నగర్ సమీపంలో ఎల్‌టీటీ రైలు కింద పడి బిల్లా(38) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నేరేడుమెట్‌కు చెందిన బిల్లా వైవాహిక సమస్యల కారణంగా మద్యానికి బానిసై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ సాయీశ్వర్ గౌడ్ తెలిపారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • ‘సౌండ్ సిస్టమ్స్ అనుమతులను పునరుద్ధరించాలి’

    HYD: తెలంగాణ సౌండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రహీం, ఉపాధ్యక్షులు కృష్ణ, శంకర్‌లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. 50 వేల కుటుంబాలు సౌండ్ సిస్టమ్స్‌పై ఆధారపడి జీవిస్తున్నాయని, పోలీసులు కేసులు నమోదుచేసి, సిస్టమ్స్ సీజ్ చేయడంతో నష్టం జరుగుతోందన్నారు. పోలీస్ కమిషనర్ అనుమతుల రద్దుతో వేలకుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయని, సింగిల్ పిన్ సిస్టమ్స్‌కు అనుమతించాలని కోరారు.

     

  • నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

    HYD: నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఉదయం 9-12 గంటల వరకు బీఎస్‌మక్తా, హుస్సేన్‌నగర్, నిశాంత్ బాగ్ కాలనీ, హనుమాన్ టెంపుల్, సుభాని మసీదు,  మధ్యాహ్నం 2-సాయంత్రం 5 గంటల వరకు శాంతి శిఖర అపార్ట్మెంట్, కుందన్ బాగ్, హిల్ టాప్ కాలనీ, దారువాలా, అల్లు అర్జున్ బిల్డింగ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.

  • ఓయూలో రివాల్యుయేషన్ దరఖాస్తులు ఆహ్వానం

    TG: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని విభాగాల ఎంఈ, ఎంటెక్ కోర్సుల మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని, ఫలితాలను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

     

  • భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

    HYD: నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. యూపీకి చెందిన కిషోర్(30) గత రాత్రి టైల్స్ వర్క్ ముగించుకొని అదే నిర్మాణ భవనంపై నిద్రిస్తుండగా బిల్డింగ్‌పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. నందకిషోర్ సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

  • నిత్యానందంకు సన్మానం

    మేడ్చల్: ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ నిత్యానందం ను డబిల్ పూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీకి నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నిత్యానందం కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు భాగ్య రెడ్డి, తలారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

  • ఈనెల 22న ఎగ్జిబిషన్ ఏర్పాటు: ఎంపీ ఈటల

    HYD: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తవడంతో పాటు మల్కాజిగిరిలో తాను ఎంపీగా గెలిచి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఈనెల 22న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. బీజేపీ సాధించిన విజయాలను ఇంటింటికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇంపీరియల్ గార్డెన్‌లో జరగబోయే ఈ ఎగ్జిబిషన్‌కు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు.

  • మున్సిపల్‌ అధికారులపై హైకోర్టు ఆగ్రహం

    HYD:నగరంలోని అక్రమ నిర్మాణాల విషయంలో మున్సిపల్‌ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు మున్సిపల్‌ అధికారులు ఏం చేస్తారని ప్రశ్నించారు. నిర్మాణ సమయంలో అధికారులు కళ్లు మూసుకొని తిరుగుతుంటారా? అని మండిపడింది. శేరిలింగంపల్లి గుట్టల బేగంపేటలో ఓ భవన నిర్మాణదారుడి పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

  • గద్దర్ అవార్డ్ రూపకర్త రామ్‌ నాయక్‌కు సీఎం అభినందన

    HYD: గద్దర్ తెలుగు సినీ అవార్డు జ్ఞాపికను రూపొందించిన ప్రముఖ కళాకారుడు రామ్ నాయక్‌ను అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి అభినందించారు. తన ఆర్ట్ ద్వారా  తెలంగాణ కళారంగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రామ్‌ నాయక్‌కు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దిల్‌రాజు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా రామ్‌ను ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షులు సీహెచ్ భద్ర అభినందించారు.

     

  • సర్టిఫికెట్లపై విచారణ చేయాలి

    HYD: గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జారీ చేసిన బర్త్ అండ్ సర్టిఫికెట్లపై విచారణ చేయాలని బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌ను కోరారు. గత 10 ఏళ్లలో జారీ అయిన సర్టిఫికెట్లపై విచారణ కావాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ విచారణ జరుగితే, ఎన్ని ఫేక్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి అనేది బయటపడుతుందన్నారు.  బీజేపీ కార్పొరేటర్లు శ్రవణ్, శ్రీవాణి తదితరులు ఉన్నారు.