మేడ్చల్: రాబోయే వర్షాకాలం నేపథ్యంలో డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలను పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని శారదానగర్, ప్రగతి నగర్‌లో నిర్వహించారు. స్థానిక పరిసరాల్లో నిత్యం పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈ చందన, అమ్మాన వెంకట రెడ్డి, రానా ప్రతాప్ పాల్గొన్నారు.
Locations: Hyderabad
-
కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే
HYD: హైదరాబాద్ నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన హరి చందనను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. తన నియోజక వర్గంలోని పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.
-
‘ఫీజులలో 50% రాయితీ ఇవ్వాలి’
మేడ్చల్: కార్పొరేట్ స్కూల్‌లో చదువుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఫీజులలో 50% వరకు రాయితీ ఇవ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విద్యాసంస్థల యాజమాన్యాలను కోరారు. ఏఎస్ రావు నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రులు చర్లపల్లికాలనీల సమాఖ్య సీసీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి తమ చిన్నారులకు ఫీజులలో రాయితీ ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
-
బీఆర్‌ఎస్ భవన్‌కు తరలిన పార్టీ శ్రేణులు
మేడ్చల్: ఫార్ములా ఈ-కారు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. సోమవారం తెలంగాణ భవన్ నుంచి ఆయన బయలుదేరుతున్న నేపథ్యంలో గౌతమ్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి తెలంగాణ భవన్‌కు భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల రాము యాదవ్, బైరు అనిల్, నర్సింగ్ రావు ఉన్నారు.
-
ప్రజావాణిలో పాల్గొన్న కార్పొరేటర్
మేడ్చల్: మల్కాజ్గిరి సర్కిల్‌లో జరిగిన ప్రజావాణిలో కార్పొరేటర్ శ్రవణ్‌తో పాటు సర్కిల్‌లోని పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శానిటైజషన్ పూర్తి అస్తవ్యస్తంగా ఉందని, కనీసం వారం రోజులకు ఒక్కసారి కూడా రోడ్లు శుభ్రం చేయట్లేదని అన్నారు. స్వీపింగ్ మెషిన్ల జాడ ఎక్కడ లేవన్నారు వాపోయారు. సమస్యలపై చర్యలు తీసుకొకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హేచ్చరించారు.
-
శానిటేషన్ డ్రైవ్‌లో పాల్గొన్న కార్పొరేటర్
మేడ్చల్: కప్రా మున్సిపల్‌లో ‘ముందస్తు వర్షాకాల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్’ చర్లపల్లి డివిజన్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. డివిజన్లోని అన్ని కాలనీలో శానిటేషన్ స్పెషల్‌డ్రైవ్‌ను మూడు రోజులు జరుగుతుందని తెలిపారు. ఈరోజు చిన్నచర్లపల్లి, పెద్ద చర్లపల్లి, బిఎన్ రెడ్డి నగర్, వాసవి శివనగర్, ఇందిరానగర్ కాలనీల వీధులను శుభ్రం చేసిన్నట్టు తెలిపారు.
-
అంబర్‌పేటలో రేపు పలు ప్రాంతాల్లో కరెంట్ కట్!
HYD: అంబర్‌పేట నియోజకవర్గంలో చెట్లనరికివేత తదితర పనుల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు ఏడీఈజీ నాగేశ్వరరావు తెలిపారు. 11కేవీ ఫీవర్ హాస్పిటల్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 1వరకు ఫీవర్‌హాస్పిటల్, అంజయ్య క్వార్టర్స్, బీకేపీ బస్‌డిపో ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం, రత్న నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.
-
కొత్త మున్సిపాలిటీలు.. పాత బోర్డులు
మేడ్చల్: రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి 2 నెలలు కావస్తున్నా గ్రామ పంచాయతీలకు మాత్రం కొత్త మున్సిపాలిటీ బోర్డులు వేయించలేదు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాలను విలీనం చేస్తూ నూతన మున్సిపాలిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇంకా గ్రామ పంచాయతీ కార్యాలయం అనే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు గ్రామ పంచాయతీ భవనాలకు మున్సిపాలిటీ భవనాలను మార్చాలని స్థానికులు కోరుతున్నారు.
-
అభిప్రాయ సేకరణ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి కేవీఆర్ కన్వెన్షన్‌లో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీల ఏర్పాటుకు ప్రతిపాదన జాబితాలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయ సేకరణ సమావేశంలో అబ్సర్వర్స్ పారిజాత నర్సింహ రెడ్డి, దుర్గం భాస్కర్‌తో కలిసి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్రంలో నూతనకమిటీల ఏర్పాటు జరుగుతుందన్నారు.
-
పాతబస్తీలో సిగ్నల్స్ మరమత్తులు
HYD: పాతబస్తీలోని అన్ని ఎక్స్ రోడ్లలో సిగ్నల్ గ్లాస్ శుభ్రపరచడం, సాంకేతిక లోపాలున్న సిగ్నల్స్ మరమ్మతుల కోసం జీహెచ్‌ఎంసీ క్రేన్లను వినియోగిస్తోంది. ఈ పనులు ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడానికి, సిగ్నల్స్ సమర్థవంతంగా పనిచేసేలా చేయడానికి చేపట్టారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ పనులను వేగవంతం చేసి, పాతబస్తీలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు.