HYD: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని పేషెంట్ వార్డులు, ఓపీ బ్లాక్, MCH ఆక్సిజన్ ప్లాంట్లను ఆయన పరిశీలించారు. గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారితో సమావేశమై ఆస్పత్రిలో సమస్యలు, సౌకర్యాలు, పేషెంట్లకు అందుతున్న వైద్యం తదితన అంశాలపై చర్చించారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, ఆస్పత్రి వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Locations: Hyderabad
-
జన్మదిన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే
మేడ్చల్: గౌడవెల్లి మాజీ సర్పంచ్ అప్పమ్మగారి జగన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌడవెల్లిలోని కృషి హోమ్స్‌లో జరిగిన వేడుకల్లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే మల్లారెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు యూనిఫార్మ్స్ అందజేశారు. అనంతరం విద్యార్థులకు జగన్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు దయానంద్, పాల్గొన్నారు.
-
కేటీఆర్‌కు సంఘీభావం.. భారీగా తరలివెళ్లిన నేతలు
మేడ్చల్: ఫార్ములా ఈ -కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, నియోజకవర్గ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళా నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ముందుగా తెలంగాణ భవన్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి ఏసీబీ కార్యాలయం వద్దకు చేరుకుని సంఘీభావం తెలిపారు.
-
‘తండాలోని సమస్యలను పరిష్కరిస్తా’
మేడ్చల్: ఎల్లంపేట మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను రావల్ కోల్ తండా, సైదోనిగడ్డ తండాలలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా తండాలోని అంగన్వాడి కేంద్రాలను డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు.రోడ్డుమీద నుంచి లోపలికి రావడానికి లైట్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారిన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా ఈ ప్రాంత ప్రజల సమస్యలను అతితొందరలో పరిష్కారం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
-
‘స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తెలంగాణ
HYD: తెలంగాణను “స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్”గా అభివృద్ధి చేసేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బషీర్‌బాగ్‌లోని ఉస్మానియా పీజీ లా కాలేజీలో జరిగిన “మెగా జాబ్, స్కిల్, లోన్ మేళా”లో ఆయన పాల్గొన్నారు. యువత నైపుణ్యాభివృద్ధి దేశాభివృద్ధికి కీలకమని, కేంద్రం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు.
-
భక్తులు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
HYD: బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో జులై 1న నిర్వహించే కళ్యాణోత్సవం కోసం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి కలగకుండా ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బల్కంపేట ఆలయం వద్ద ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యం
HYD: అంగన్వాడి కేంద్రాలకు వెళుతున్న చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందచేయాలని ఉద్దేశంతో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ప్రతిపాదనలను చేసింది. వారానికి రెండు రోజులు ఎగ్ బిర్యానీ అందించాలని సూచించింది. ఇందులో భాగంగా నేడు రహమత్ నగర్ డివిజన్‌లోని బ్రహ్మ శంకర్‌నగర్ అంగన్వాడీ కేంద్రంలో నేటి నుంచి ప్రభుత్వం ప్రతిపాదించిన మెనూ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు అక్షరభ్యాసం చేయించారు.
-
వాటర్ వర్క్ పనులను పరిశీలించిన కార్పొరేటర్
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ ఆరోగ్య నగర్‌లో జరుగుతున్న వాటర్ వర్క్ పనులను కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మేనేజర్ రాజేందర్‌తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుంగా పనులు వేగవంతం చేయాలని అధికారలకు ఆయన సూచించారు.
-
తూంకుంటలో యువకుడు అదృశ్యం
మేడ్చల్: శామీర్‌పేట్ పీఎస్ పరిధిలోని తూంకుంట గ్రామానికి చెందిన ముదావత్ దినేష్(19) మే 18న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి మందలించడంతో మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరాడు. గతంలోనూ 4-5రోజులు ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చాడు. ఈసారి రాకపోవడంతో తండ్రి శామీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
మంత్రిని కలిసిన బండి రమేష్
మేడ్చల్: కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ సోమవారం ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబును ఆయన నివాసంలో కలిశారు. తన నియామకానికి మద్దతు ఇచ్చినందుకు శ్రీధర్ బాబుకు, రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందుబాటులో ఉండాలని శ్రీధర్ బాబు సూచించారు.