HYD: నూతన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని, నీలం మధు ముదిరాజ్ హైదరాబాద్‌లోని ఆరామ్‌గార్‌లో సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించిన నీలం మధుని మంత్రి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. సామాజిక న్యాయం, అన్నివర్గాల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కలిసి కృషి చేయాలని చర్చించారు.
Locations: Hyderabad
-
విద్యుత్ సరఫరాలో అంతరాయం
HYD: మరమ్మతుల కారణంగా సోమవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏడీఈ ఆదినారాయణ రావు తెలిపారు. శ్రీనివాస అపార్ట్‌మెంట్, షిరిడిసాయి నగర్, నాగార్జున నగర్, సండే మార్కెట్ ప్రాంతాల్లో సాయంత్రం 5గంటల వరకు కరెంటు ఉండదని ఆయన తెలిపారు. ప్రజలు ఈ విషయం గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు.
-
శిల్పారామంలో సాంస్కృతిక సందడి
మేడ్చల్: ఉప్పల్‌లోని శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంది. నృత్య కిన్నెర వ్యవస్థాపకులు, సంగీత నాటక అకాడమీ అవార్డీ మద్దాలి ఉషాగాయత్రి శిష్య బృందం నీరజ, లక్ష్మిశ్రీ. వైష్ణవి, వినీత, ఉజ్వల, సిరి చందన, తదితరులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కెనడా నుంచి వచ్చిన కూచిపూడి నృత్య కళాకారిణి రేణి శ్రీజిత్ నృత్యం అలరించింది.
-
KTR విచారణ.. ఏసీబీ ఆఫీసు సమీపంలో ఉద్రిక్తత
HYD: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే KTR ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. కార్యాలయం సమీపంలోని నీలోఫర్ కేఫ్ వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారికి పోలీసులు సూచించారు. పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
-
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ మోసం
HYD: పాతబస్తీలోని ఖులీ కుతుబ్‌షాహీ స్టేడియంలో బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ ఢిల్లీగ్యాంగ్ మోసం చేసింది. సల్మాన్ అలియాస్ ఢిల్లీవాలా ఆధ్వర్యంలో 2రోజుల పాటు నాటు వైద్యం పేరిట రూ.1300వసూలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో 5-6వేల మంది హాజరయ్యారు. గతంలో ఉప్పల్‌లో ఇలాంటి మోసంపై కేసు నమోదైనా, మళ్లీ శిబిరం ఏర్పాటు చేశారు. పోలీసులకు ఫిర్యాదు రాలేదని హుస్సేనిఆలం ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు.
-
మహాగణపతికి 73 అడుగుల మండపం
HYD: హైదరాబాద్‌లో వినాయకచవితి వేడుకలకు ఖైరతాబాద్ మహాగణపతి ప్రసిద్ధి. ఈ ఏడాది గణపయ్యకు 73 అడుగుల భారీ మండపం ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది 69 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్ నుంచి తెప్పించిన కర్రలతో మండప షెడ్డును ఏర్పాటు చేస్తున్నారు. -
భూగర్భ జలమట్టాల పెరుగుదల
HYD: ముందస్తు వర్షాలతో తెలంగాణలో భూగర్భ జలమట్టాలు పెరగడం ప్రారంభమైంది. ఏప్రిల్ నాటికి భూగర్భ జలాల రాష్ట్ర సగటు మట్టం 10.17మీటర్ల లోతుకు పడిపోయిన జలమట్టం, మే నెలలో భారీ వర్షాలతో 10.07 మీటర్లకు తగ్గింది. 2024 మేతో పోలిస్తే 2025 మే లో 0.30మీటర్ల పెరుగుదల నమోదైంది. రుతుపవనాల రాకతో జలమట్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ నివేదిక వెల్లడించింది.
-
పెళ్లి పేరుతో మోసం.. కేసు నమోదు
HYD: షాదీ డాట్‌కామ్ ద్వారా పరిచయమైన కల్పేష్ కక్కడ్(42) అనే వ్యక్తి, బేగంపేటకు చెందిన మహిళ(47)ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ.22లక్షలు వసూలు చేసి ముంబైకి పరారయ్యాడు. ఫొటోలు, వీడియోలతో బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
కెమెరాలను తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ మోసం
HYD: ఈవెంట్లలో ఫొటో గ్రాఫర్లను నమ్మించి ఖరీదైన కెమెరాలను తక్కువ ధరకు ఇస్తానంటూ లక్షల రూపాయలు వసూలు చేసిన సూరజ్ ధనాలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లలో 24మందిని మోసం చేసి, వసూలు చేసిన డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టేవాడు. గతంలో గజ్వేల్‌లో అరెస్టై బెయిల్‌పై వచ్చినా మోసాలు కొనసాగించాడు. రాష్ట్రవ్యాప్తంగా నిందితుడిపై 24కేసులు నమోదయ్యాయి.
-
29న ఘటోత్సవంతో సికింద్రాబాద్ బోనాలు ప్రారంభం
HYD: ఈనెల 29న ఘటోత్సవంతో సికింద్రాబాద్ బోనాలు ప్రారంభం కానున్నాయి. ఉజ్జయిని మహాకాళీ అమ్మవారి దేవస్థానంలో జులై 13, 14వ తేదీల్లో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఈక్రమంలో ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఉత్సవాలు సమీపిస్తుండడంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఘటోత్సవానికి వారం రోజుల ముందుగానే ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేస్తామని EO మనోహర్‌రెడ్డి తెలిపారు.