
Locations: Hyderabad
-
‘విద్యావిధానంలో మార్పులతో అభివృద్ధి కృషి’
HYD: గత పాలకుల వైఫల్యం వల్ల తెలంగాణలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం విమర్శించారు. బాగ్‌లింగంపల్లిలో జరిగిన ‘తెలంగాణ విద్యారంగం- ఆంధ్రా కార్పొరేట్ దోపిడీ’ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యావిధానంలో మార్పులతో అభివృద్ధి కృషి చేస్తున్నారని, చాలా కళాశాలలు ఫీజు రీయింబర్స్‌మెంటు కోసమే పనిచేస్తున్నాయని వెల్లడించారు. -
ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి
HYD: వండుకుని తినగా మిగిలిన ఆహార వ్యర్థాలనే గ్యాస్‌గా మార్చి వంట చేస్తున్నారు. ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసి ఏకంగా 400 మందికి సరిపడా ఆహారాన్ని వండుతున్నారు. ఈ వినూత్న పద్ధతిని ఉస్మానియా యూనివర్సిటీలోని మహిళల హాస్టల్‌లో వినియోగిస్తున్నారు. మహిళల మెస్‌లో వంట చేయడానికి ఆరు నెలలుగా ఆహార వ్యర్థాలతో తయారు చేసిన బయోగ్యాస్‌నే వాడుతున్నారు.
-
డిగ్రీ కళాశాల ప్రారంభం
HYD: సోమాజిగూడలో శివశివానీ విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలను ఏపీ ఎంపీ నిరంజన్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధ్యక్షురాలు ఆరతి, కళాశాల ప్రిన్సిపల్ సారికారాజ్ పాల్గొన్నారు.
-
ప్రేమ పేరుతో జూనియర్ ఆర్టిస్ట్‌కు మోసం..జిమ్ ట్రైనర్ అరెస్ట్
HYD: ప్రేమ పేరుతో జిమ్ ట్రైనర్ తనను లోబర్చుకుని మోసం చేశాడని ఓ జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులను ఆశ్రయించింది. ఈఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం జిమ్‌ట్రైనర్ మహేష్ ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఆమెవద్ద నుంచి రూ.15 లక్షలు తీసుకుని మొహం చాటేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసునమోదు చేసి నిందితుడు మహేష్‌ను ఆరెస్ట్ చేశారు.
-
MRPS 31వ ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం
HYD: బౌద్ధనగర్‌లో జరిగిన MRPS సమావేశంలో 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జూలై 7న ఘనంగా నిర్వహించాలని నాయకులు సూచించారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 30 ఏళ్లుగా సజీవంగా నిలిచి లక్ష్యాలను సాధించిన ఏకైక సామాజిక ఉద్యమం MRPS మాత్రమేనని వారు పేర్కొన్నారు. జులై 7న అన్ని గ్రామాల్లో దండోరా వేసి, జెండా ఎగరవేయాలని కోరారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
మేడ్చల్: కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం వెనుక లింగాల కుంటలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఆనవాళ్లు కనిపించాయని స్థానికులు తెలిపారు. ఆలయానికి సమీపంలోని శివలింగానికి పూజలు చేసి తవ్వకాలు జరిపినట్లు పేర్కొన్నారు. మట్టి కుండ, ఎర్రని క్లాత్, పసుపు, నిమ్మకాయలు కనిపించడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
డాక్టర్ నిర్లక్ష్యంతో యువకుడు మృతి
HYD: సికింద్రాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసాలా బజార్‌లో ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యంతో యువకుడు విగ్నేష్ (32) మృతి చెందాడు. రాత్రి తిన్న బిర్యాని జీర్ణం కాకపోవడంతో ఆర్ఎంపీ డాక్టర్‌ను ఆశ్రయించిన విగ్నేష్‌కు ఇంజెక్షన్ ఇవ్వగా, అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆర్ఎంపీ క్లినిక్‌పై దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
పర్యాటక స్థలాల్లో పరిశుభ్రత లోపం
HYD: హైదరాబాద్‌లోని పర్యాటక స్థలాలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల నుంచి వచ్చే చెత్త సకాలంలో తొలగించకపోవడంతో ఈ ప్రాంతాలు దుర్గంధభరితంగా మారుతున్నాయి. పలువురు ఈ లోపాలను ఎత్తి చూపుతున్నారు. ప్రైవేట్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించినప్పటికీ, వాటి పనితీరుపై అధికారులు సరైన పర్యవేక్షణ చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనదారుల ఇబ్బందులు
HYD: నగరంలో అధునాతన హంగులతో రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ జరుగుతున్నా రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనదారులకు పడిగాపులు తప్పడం లేదు. గేటు పడిందంటే సహనానికి పరీక్షే. ప్రతిపాదనలు సిద్ధం చేసినా నిధుల మంజూరు, భూసేకరణలో స్థానికుల నుంచి వ్యతిరేకత, కోర్టు వివాదాలతో పనులు ముందుకు సాగడం లేదు. సుమారు 18 ప్రాంతాల్లో ఆర్‌యూబీలు, ఆర్‌వోబీలు నిర్మించాలి.
-
అందుబాటులోకి రాని సర్వీస్ రోడ్డు!
HYD: అంబర్‌పేట ఫ్లై ఓవర్ పక్కా ప్రణాళిక లేకుండా ఏర్పాటు చేశారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. కనీసం సర్వీసు రోడ్లు వేయకుండానే ప్లై ఓవర్‌ను ప్రాంభించారని వాపోయారు. ట్రాఫిక్ తగ్గించే చర్యల్లో భాగంగా ఈ ప్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో అంబర్‌పేట చే నంబరు చౌరస్తా నుంచి గోల్నాక వెళ్లే సర్వీసు రోడ్డు అందుబాటులోకి రాకపోవడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు.