HYD: సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళీ అమ్మవారి దేవస్థానంలో జులై 13, 14 తేదీల్లో జరిగే బోనాల ఉత్సవాలు ఈనెల 29న ఘటోత్సవంతో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఆలయాన్ని ముస్తాబుచేస్తున్నారు. ఉత్సవాలు సమీపిస్తుండడంతో ఇప్పటికే మొదలైనఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఘటోత్సవానికి వారం రోజుల ముందుగానే ఆలయంలో ఏర్పాట్లు పూర్తిచేస్తామని ఈవో మనోహర్‌రెడ్డి తెలిపారు. బోనాల ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలిరానుండడంతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
Locations: Hyderabad
-
జనావాసాల మధ్య హైటెన్షన్ తీగలు
HYD: బస్తీలు, శివార్లలోని పలు కాలనీల్లో జనావాసాల మధ్య హైటెన్షన్ తీగలున్నాయి. ఇళ్ల పైనుంచి చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్నాయి. దుస్తులు ఆరేయబోయి, పనులుచేస్తూ, పిల్లలు ఆడుతూ ఇలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని ఇళ్లపై విద్యుత్తు తీగల తొలగింపుకు గతంలో సర్వే చేయగా రూ.250 కోట్లు అవుతుందని తెలిపారు. అంచనాలు పెరిగి ఇప్పుడు ఆరేడు వందల కోట్లకు చేరిందని అధికారులు చెబుతున్నారు.
-
మల్టీ లెవల్ పార్కింగ్ ట్రయల్ రన్ ప్రారంభం
HYD: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లో ట్రయల్ రన్ ప్రారంభమైంది. విదేశీ సాంకేతికతతో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ కాంప్లెక్స్‌లో ఏకకాలంలో 72 కార్లు నిలిపేందుకు అవకాశం ఉంది. మున్సిపల్ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ కాంప్లెక్స్ నిర్మిస్తున్న సంస్థ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు.
-
దంపతుల మధ్య వివాదం.. భర్త ఆత్మహత్య
రంగారెడ్డి: బ్రాస్‌లెట్ విషయంలో దంపతుల మధ్య వివాదం జరిగి భర్త బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. బండ్లగూడజాగీర్‌లోని భవానీకాలనీలో కుమారస్వామి, మౌనిక ఇద్దరు భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. వీరిమధ్య బంగారు బ్రాస్‌లెట్ విషయంలో వివాదం తలెత్తింది. కోపంతో కుమారస్వామి భార్యపై చేయిచేసుకోగా ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో భార్య మరణించిందని అతడు భయపడి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
-
బీటెక్ విద్యార్థి అదృశ్యం
మేడ్చల్: ఘట్కేసర్ పీఎస్ పరిధిలోని అంకుశాపూర్‌లో ఏస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఇస్లావత్ రాహుల్ (21) అదృశ్యమయ్యాడు. ఘట్కేసర్‌లో నివాసముంటున్న రాహుల్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని అతని తండ్రి మల్లేష్ ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
VIDEO: మల్టీ లెవల్ కార్ పార్కింగ్.. ఒకేసారి 72 కార్లను!
TG: హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద నూతన మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ పది రోజుల ట్రయల్ రన్ ప్రారంభించింది. కొరియన్ టెక్నాలజీతో నిర్మితమైన ఈ కాంప్లెక్స్ 72 కార్లను నిలిపే సామర్థ్యం కలిగి ఉంది. ఇది బంజారాహిల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యను తగ్గిస్తుంది. ఆటోమేటెడ్ వ్యవస్థలు వాహనాలను వేగంగా.. సమర్థవంతంగా పార్క్ చేస్తాయి.
-
చిన్నారిపై బాలుడు అత్యాచారయత్నం
మేడ్చల్: జగద్గిరిగుట్ట పీఎస్‌లో దారుణ ఘటన జరిగింది. ఐదు ఏళ్ల చిన్నారిపై 14ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం చేసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిన్నారి తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
HYD: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భవాని నగర్‌కు చెందిన కుమార స్వామి రెడ్డి శనివారం సాయంత్రం ఇంట్లో గొడవపడ్డాడు. తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్నితరలించారు.పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
-
ఈ నెల 23న ‘చలో రాజ్ భవన్’
HYD: ఆపరేషన్ కగార్‌ను ఆపాలని కోరుతూ ఈ నెల 23న జరిగే ఛలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమానికి యువత అధికంగా తరలి రావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం హిమాయత్ నగర్‌లో ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, అమాయక గిరిజనులపై దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
-
యువతి అదృశ్యం
రంగారెడ్డి: పరీక్ష రాయడానికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది శంషాబాద్‌కు చెందిన ఉగరాల మేఘన(23) ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంది. శుక్రవారం పరీక్షకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి కళాశాలకు వెళ్ళింది. కాగా సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో ఆమె సోదరుడు ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో సోదరుడు పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.