Locations: Hyderabad

  • ఘనంగా వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

    మేడ్చల్: కూకట్‌పల్లి నియోజకవర్గం బేగంపేట్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • విద్యారంగానికి విద్యార్థులే వారధులు : ఎమ్మెల్యే

    HYD: విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యతనే ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి దోహదపడుతుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. భావసార్ క్షత్రియ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 49వ వార్షికోత్సవాన్ని సందర్భంగా 7 నుంచి 10 పదో తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన 400 మంది పేద విద్యార్థులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నోట్ బుక్స్, బ్యాగులతోపాటు స్టేషనరీని భావాస్కర్ భవన్ కమ్యూనిటీ హాల్‌లో పంపిణీ చేశారు.

  • ఉచిత హెల్త్‌క్యాంప్ సేవలు

    మేడ్చల్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్‌లో 191 ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ రిచ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ రవి కిరణ్ హాజరై ప్రారంభించారు.

  • ‘నిధుల కోసం రాజీలేని కృషి’

    మేడ్చల్: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాలనీల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన నిధుల కోసం రాజీలేని కృషిని కొనసాగిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శివసాయి నగర్ పేస్ 3 సంక్షేమ సంఘం ప్రతినిధులు చర్లపల్లికాలనీల సమాఖ్య సీసీఎస్ ఆధ్వర్యంలో ఏఎస్ రావు నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలుసుకొని వినతి పత్రం సమర్పించారు. సమస్యలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు గుర్తు చేశారు.

  • రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

    HYD: విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆస్మాన్‌ఘడ్ సబ్ డివిజన్ పరిధిలో సోమవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 11కేవీ సింగరేణి కాలనీ, నూర్ఖాన్ బజార్, ఎస్సార్ టీ కాలనీ ఫీడర్లలో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12వరకు, సరస్వతి నగర్, యాసిన్ జంగ్ మసీద్ తదితర ఫీడర్లలో మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5:30వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

  • ‘సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా’

    మేడ్చల్: సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ సమావేశం నాచారంలోని హెచ్‌ఎంటీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కోదండ రామ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

  • కరాటే విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం

    మేడ్చల్: రామంతపూర్‌లో జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 16మంది కరాటే విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు విద్యార్థులను అభినందించి, బెల్టులు అందజేశారు. అసోసియేషన్ కార్యదర్శి రామ్‌కుమార్ కృషిని, సెయింట్ జాన్ స్కూల్ ప్రిన్సిపాల్ రాంరెడ్డి ఉచిత కరాటే శిక్షణ సేవలను శ్రీవాణి ప్రశంసించారు.

  • ‘ఆషాడ మాస బోనాలను వైభవంగా నిర్వహిస్తాం’

    HYD: ఆషాడ మాస బోనాలను వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో దేవాలయాలకు ఆషాడ మాసబోనాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించాలని దేవాలయాల కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, సాయి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
  • రైల్వే వంతెన నిర్మాణంలో జాప్యం

    మేడ్చల్: ఘట్కేసర్ కొండాపూర్ రైల్వే వంతెన నిర్మాణం 15ఏళ్లుగా జాప్యం కావడంపై స్థానికులు, రాజకీయ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల మార్పు, సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడం జాప్యానికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి. రెండేళ్లుగా బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వంతెన పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.

  • రౌడీషీటర్ ఆత్మహత్య

    HYD: కుటుంబ కలహాలతో కుల్సంపుర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఉమేష్ అనే రౌడీషీటర్ ఆత్మహత్య పాల్పడ్డాడు. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.