మేడ్చల్: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ డివిజన్ సీనియర్ నాయకులు సాయిబాబా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయనకు శాలువాతో సన్మానించి, కేక్ కట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
Locations: Hyderabad
-
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత
మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని అవుషాపూర్‌కు చెందిన శ్రీనుకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అవుషాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సల్మాన్ ఖాన్, ఘట్‌కేసర్ మండల్ ఉపాధ్యాక్షులు వెంకట్ రెడ్డి, బిట్టా భాస్కర్ పాల్గొన్నారు.
-
రూ.80కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం
HYD: బంజారాహిల్స్‌లో రూ.80కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నించారు. స్థలం చుట్టూ బ్లూ షీట్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. నెల రోజుల క్రితం షేక్‌పేట్ మండల అధికారులు ఇదే యత్నాన్ని అడ్డుకొని, ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. తాజాగా మళ్లీ జరిగిన ఈ కబ్జా ప్రయత్నంపై అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
-
మండల సంకల్ప సభ కార్యక్రమం
మేడ్చల్: ఎల్లంపేట్ మున్సిపాలిటీ రావల్ కోల్ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన వారోత్సవంలో భాగంగా ఎల్లంపేట్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో మండల సంకల్ప సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జగన్ గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు పుష్ప మల్లారెడ్డి, సత్యనారాయణ, రవీందర్, పాల్గొన్నారు.
-
వంతెన నిర్మాణానికి నిధులు..
మేడ్చల్: ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ రైల్వే వంతెన నిర్మాణానికి రూ.1.70కోట్లు నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎంకు, మంత్రి శ్రీధర్ బాబు, మేడ్చల్ ఇంఛార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, మాజీ ఛైర్‌పర్సన్ ముల్లిపావని ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకతీతంగా సహకరిస్తే వంతెన నిర్మాణం త్వరగా పూర్తవుతుందని, ప్రజల సమస్యలను కలిసి పరిష్కరించాలని పిలుపునిచ్చారు.
-
అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన నేత
మేడ్చల్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్‌లో డ్రైనేజీ పనుల ప్రారంభించిన మున్సిపల్ అధికారులకు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు నాయకులు తుంగతుర్తి రవి కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ నంబర్ 19లో ప్రారంభమైన డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. అనంతరం పనులను మొదలు పెట్టిన మున్సిపల్ కమిషనర్ త్రిలేశ్వర్, సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
-
జర్నలిస్టులు జాతీయ ప్రయోజనాల కోసం కృషి చేయాలి
HYD: భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ ప్రజల హక్కులను మీడియా కాపాడాలని ఇఫ్లూ వైస్‌ఛాన్స్‌లర్ రాజారావు అన్నారు. సంచలనాలకు ప్రాధాన్యమివ్వకుండా సరైన సమాచారాన్ని ప్రజలకు అందించాలని సూచించారు. ఓయూలో ‘జాతీయ విద్యా విధానం-మీడియా పాత్ర’ అంశంపై వర్కింగ్‌జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా, ఓయూకాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆంధ్రమహిళా సభ కాలేజీ టీచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయసదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
-
ఘనంగా భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు
HYD: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన జన్మదిన వేడుకలను కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, లింగాజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత దీప భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
ఉర్సు ఉత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి
మేడ్చల్: శామీర్‌పేట్ మండల కేంద్రంలోని హజరత్ సయ్యద్ జలాల్ ఉద్దీన్ ముల్తాని రెహ దర్గా ఉర్సు ఉత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మల్లారెడ్డికి ముస్లిం మత పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మోహన్‌రెడ్డి, శామీర్‌పేట్ సొసైటీ వైస్ ఛైర్మన్ ఐలయ్య యాదవ్ పాల్గొన్నారు.
-
రేపు ఖైరతాబాద్‌లో ఆటో డ్రైవర్ల ధర్నా
HYD: కొత్త జీఓ 263కి వ్యతిరేకంగా రేపు ఖైరతాబాద్‌లోని తెలంగాణ రవాణా భవన్ ఎదుట పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లతో ధర్నా చేయనున్నట్లు గరీబ్ ఆటో డ్రైవర్స్ సంఘర్షణ సమితి అధ్యక్షుడు మొహమ్మద్ ఇబ్రహీం అహ్మద్ ప్రకటించారు. పర్యావరణ హితంకై 20వేల సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు పరిమితులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి జీఓలోని తప్పులను సవరించాలని డిమాండ్ చేశారు.