మేడ్చల్: సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు సీఎంకు రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్‌ని సీఎం అభినందించారు. పార్టీలో మరింత ఉన్నత స్థానానికి ఎదిగేందుకు నియోజకవర్గ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.
Locations: Hyderabad
-
‘హబ్సిగూడ’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?
HYD: హబ్సిగూడ అప్పటి నిజాంరాజు పశువుల మైదానంగా ఉండేది. నిజాం రాజు ఆఫ్రికాలోని అబ్బిసినియన్లను పశువుల కాపరులుగా పెట్టేవారు. వీరు కొన్ని దశాబ్దాల కాలం పాటు ఇక్కడే నివాసం ఉండి, సెటిలయ్యారు. ఈ అబ్బిసినియన్లనే హాబీలు అని అనే వారు. దీంతో ఈ ప్రాంతాన్ని హాబీగూడ అని పిలిచేవారు. కాలక్రమేపి ‘హాబీగూడ.. హబ్సిగూడ’గా మారిందని చరిత్రకారుల అభిప్రాయం.
-
కేటీఆర్‌పై చిక్కడపల్లి పీఎస్‌లో ఫిర్యాదు
HYD: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది భాను, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిక్కడపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌పై, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని హితువు పలికారు.
-
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
HYD: బోరబండ నటరాజ్ నగర్‌లో బుష్ర(30) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె భర్త ఆశిమ్ గదిలో నిద్రించి లేచి చూడగా, తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ గాజు పగలగొట్టి చూడగా బుష్ర ఫ్యాన్‌కు వేలాడుతూ అచేతనంగా కనిపించింది. బుష్ర తల్లి, ఆశిమ్ డబ్బు కోసం తనకుమార్తెను వేధించాడని బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
‘సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
HYD: 2005 నుంచి అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ప్రభుత్వ సమాచారాన్ని పొందే హక్కును కల్పిస్తుందని మాజీ సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడ భూషి శ్రీధర్ ఆచార్యులు అన్నారు. హైదరాబాద్‌లోని సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగిన చర్చా గోష్టిలో ఆయన పాల్గొన్నారు. రూ.10అప్లికేషన్‌తో విలువైన సమాచారం పొందవచ్చని తెలిపారు. ప్రజలందరూ ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
-
నూతన పోలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన ఎంపీ
HYD: ఆధునిక వసతులతో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బొల్లారం మున్సిపల్ పరిధిలో హెట్రో లేబరేటరీస్ సౌజన్యంతో రూ.3.5 కోట్లతో, గుమ్మడిదలలో రూ.2.5కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బొల్లారంలో నూతన పీఎస్‌కు ఆయన ఎంపీ రఘనందన్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. శాంతిభద్రతలతో పాటు సత్వర న్యాయం అందించేలా కృషిచేయాలని అధికారులకు సూచించారు.
-
కాంగ్రెస్ నేతకు తలసాని నివాళి
HYD: రాంగోపాల్ పేట డివిజన్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఘన్ శ్యామ్ ఆకస్మిక మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నెక్లెస్ రోడ్‌లోని అంబేద్కర్ నగర్‌లో ఆయన నివాసానికి వెళ్లి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. -
భర్తకు మద్యం తాగించి రాడ్డుతో కొట్టి చంపిన భార్య
HYD: సైదాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సింగరేణి కాలనీలో నివసిస్తున్న జీషన్ అలీ(45), పూల వ్యాపారిగా జీవనం సాగిస్తున్నాడు. రోజూ మద్యం తాగి గొడవ చేస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మందలించినా మారకపోవడంతో, ఆమె బలవంతంగా మద్యం తాగించి ఇనుప రాడ్డుతో భర్త తలపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జీషన్ అలీ మృతి చెందాడు.
-
అమెజాన్ ఆర్డర్‌లో మోసం.. ట్యాబ్ బదులు సబ్బులు
HYD: కెపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్ కాలనీకి చెందిన సుబ్బారావు తన భార్య కోసం రూ.18వేల ధర ఉన్న ట్యాబ్‌ని అమెజాన్‌లో ఆర్డర్ చేశారు. వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ఆర్డర్ ఓపెన్ చేసిచూడగా అందులో ట్యాబుకు బదులు లైఫ్‌బాయ్ సోప్స్ కనిపించాయి. దీంతో కస్టమర్ ఒక్కసారిగా కంగారు పడ్డాడు. ఈ విషయంపై కెపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని సుబ్బారావు వెల్లడించారు. -
విమాన దుర్ఘటనలో మృతిచెందిన వారికి నివాళి
మేడ్చల్: మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మైనాంపల్లి హన్మంతరావు ఆదేశాలతో 136డివిజన్ కాంగ్రెస్ నాయకులు అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్, రాఘవన్, కుట్టి శీను, ఆండ్రూస్, బాల నారాయణరెడ్డి, కనకరాజు, తదితరులు పాల్గొన్నారు.